NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

Ravi Teja: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషి ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో రవితేజ ఒకరు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన భూపతిరాజు రవిశంకర్ రాజు అలియాస్ రవితేజ.. నటుడు కావాలన్నా తపనతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన కూడా ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. ఆ సమయంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా రవితేజ పనిచేశారు.

1997లో కృష్ణవంశీ తీసిన సింధూరం మూవీ రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సెకండ్ హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు రవితేజ చేరువయ్యారు. ఆ త‌ర్వాత గుర్తింపు ఉన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా నిలపడ్డ‌ రవితేజ.. నీకోసం సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ స‌క్సెస్ తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ మాస్‌ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా మారారు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటికీ హీరోగా దూసుకుపోతున్నారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ను అలరిస్తున్నారు. అయితే రవితేజ త‌న‌ కెరీర్ ఆరంభంలో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయన అలా ప‌ని చేసిన‌ చిత్రాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉందని మీకు తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఇంతకీ ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున సినిమా మ‌రేదో కాదు నిన్నే పెళ్లాడ‌తా.

కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో నాగార్జున‌, ట‌బు జంట‌గా న‌టించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ సినిమాను స్వ‌యంగా నిర్మించ‌గా.. సందీప్ చౌతా సంగీతం అందించారు. చలపతిరావు, చంద్ర‌మోహ‌న్‌, గిరిబాబు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, బెన‌ర్జీ, సివిఎల్ నరసింహారావు, జీవా త‌దిత‌రులు ఈ సినిమాలో ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించారు. 1996లో విడుద‌లైన నిన్నె పెళ్లాడ‌తా చిత్రం వ‌ద్ద భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

39 సెంటర్లలో 100 రోజులు, 4 సెంటర్లలో 175 రోజుల ఆడింది. అప్ప‌ట్లోనే ఫుల్ ర‌న్ లో రూ. 19 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. అయితే ఈ సినిమాకు ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. న‌టుడు బ్రహ్మాజీ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. నిన్నే పెళ్లడతా సినిమాలో ఓ బైక్ రేసింగ్ సీన్ ఉంటుంది. ఆ బైక్ సీన్ కోసం నాగ్ జుట్టు పైకి ఎగరడానికి ఫ్యాన్ పట్టుకున్న వారిలో రవితేజ కూడా ఒక‌రి బ్ర‌హ్మాజీ తెలిపారు. అలాగే నిన్నే పెళ్లాడ‌తా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గానే కాకుండా.. హీరోకు సవాలు విసిరే బైక్ రేసర్‌గా కూడా ర‌వితేజ క‌నిపిస్తాడు.

Related posts

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar