NewsOrbit
న్యూస్

అయోధ్య ఆల‌యానికి 150 న‌దుల నుంచి ఈ సోద‌రులు నీటిని సేక‌రించారు..!

ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణ భూమి పూజ జ‌ర‌గ‌నున్న సంద‌ర్భంగా ఇప్ప‌టికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ స‌హా మొత్తం 150 మంది వ‌ర‌కు అతిథులు హాజ‌రు కానున్నారు. అయితే ఆల‌య నిర్మాణంలో ఉప‌యోగించేందుకు గాను మొత్తం 150 న‌దుల నుంచి ఇద్ద‌రు సోద‌రులు నీటిని సేక‌రించారు. ఆ సోద‌రులు ప్ర‌స్తుతం అయోధ్య‌కు చేరుకున్నారు.

these two brothers collected soil and water from sacred places for ram mandir construction

రాధే శ్యాం పాండే, శ‌బ్ద్ వైజ్ఞానిక్ మ‌హాక‌వి త్రిఫ‌ల అనే ఇద్ద‌రు సోద‌రులు 1968 నుంచి 2019 వ‌ర‌కు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పి అనేక మార్గాల్లో ప్ర‌యాణాలు చేశారు. కాలిన‌డ‌క‌న వెళ్లారు. సైకిల్ తొక్కి ప‌లు ప్ర‌దేశాలు చేరుకున్నారు. కొన్ని ప్ర‌దేశాల‌కు మోటార్‌సైకిళ్లు, ట్రెయిన్లు, విమానాల ద్వారా కూడా వెళ్లారు. శ్రీ‌లంక‌లోనూ ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో రాముడు తిరిగిన ప‌లు చోట్ల‌కు చెందిన మ‌ట్టితోపాటు మొత్తం 151 న‌దులు, 8 పెద్ద న‌దులు, 3 మ‌హా స‌ముద్రాలు, 16 చోట్ల నుంచి మ‌ట్టిని సేక‌రించి అయోధ్య‌కు తెచ్చారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం అయోధ్య‌కు చేరుకున్నారు.

ఆ సోద‌రులిద్ద‌రూ సేక‌రించిన నీరు, మ‌ట్టిని అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఉప‌యోగించ‌నున్నారు. కాగా ఇప్ప‌టికే రామ మందిర నిర్మాణ భూమి పూజ‌కు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. కోవిడ్ జాగ్ర‌త్త‌ల న‌డుమ సోష‌ల్ డిస్ట‌న్స్ పాటిస్తూ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. అదే రోజు మోదీ అయోధ్య‌లో రూ.500 కోట్ల విలువ చేసే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు కూడా చేస్తారు.

Related posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

sharma somaraju

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

sharma somaraju

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

sharma somaraju

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

sharma somaraju

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

IPS AB Venkateswararao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్ .. అయిదేళ్లుగా న్యాయపోరాటం

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju