NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. రాపిడో యాడ్ తొలగించాలని ఆదేశించిన హైకోర్టు..!

Rapido: ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రాపిడో అనే బైక్ టాక్సీ షేరింగ్ కంపెనీ ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాడ్(rapido ad)లో బన్నీ ఆర్టీసీని కించపరిచేలా నటించారని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వెళ్లగక్కారు. అంతేకాదు బన్నీకి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ప్రజలను ప్రభావితం చేయగల హోదాలో ఉండి కూడా ప్రజా రవాణా వ్యవస్థను తక్కువ చేసి చూపించడం సరికాదన్నారు. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. అలాగే వ్యాపార నీతులను పాటించని రాపిడో సంస్థకు కూడా లీగల్ నోటీసులు పంపించారు. కానీ ఇప్పటివరకు రాపిడో యాడ్ టీవీల్లో, యూట్యూబ్ లో ప్రసారం అవుతూనే ఉంది. దాంతో సజ్జనార్ కోర్టును ఆశ్రయించారు.

ఆర్టీసీని కించపరిచేలా యాడ్


రాపిడో యాడ్ లో అల్లు అర్జున్ ఒక హోటల్లో దోసె చేస్తూ కనిపిస్తాడు. అంతేకాదు ప్రయాణికులను ఆర్టీసీ బస్సు దోశను ఖైమా కొట్టినట్లు నలిపేస్తుందని బన్నీ డైలాగులు చెప్పాడు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ బస్సును కూడా చూడొచ్చు. అయితే ఒక ప్రైవేటు సంస్థ అయిన రాపిడోని ప్రమోట్ చేసేందుకు ఆర్టీసీని తక్కువ చేసి చూపించడం చాలా తప్పు అని సజ్జనార్ తో సహా చాలామంది అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రకటనలు నిలిపివేయాలని కోరారు. ఈ వివాదం ముదరడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్న రాపిడో ఆర్టీసీ బస్సు కనిపించకుండా ప్రకటనను ఎడిట్ చేసింది. కానీ అల్లు అర్జున్ డైలాగులు మాత్రం యథావిధిగా ఉంచేసింది. దాంతో చిర్రెత్తిన సజ్జనార్ కోర్టును ఆశ్రయించారు.

యాడ్ తొలగించాలని ఆదేశించిన నాంపల్లి హైకోర్టు


వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాపిడో యాడ్ వ్యవహారంపై తాజాగా కోర్టు విచారణ చేపట్టింది. యాడ్ ను పరిశీలించి ఆర్టీసీకి మద్దతుగా తన తీర్పును వెలువరించింది. తక్షణమే యూట్యూబ్ తో సహా అన్ని మాధ్యమాలలో రాపిడో యాడ్ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ప్రకటనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బన్నీతో సహా రాపిడో సంస్థకు షాక్ తగిలినట్లయింది. ఎన్నో ఏళ్ళగా పేదవారిని, మధ్యతరగతి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ బస్సుల సేవలను ఎవరూ కూడా చులకన చేయకూడదన్నట్లు నాంపల్లి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా మళ్లీ ఈ ప్రకటనను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ఇలా నటించడం తప్పని అల్లు అర్జున్‌కు తెలిసేలా నాంపల్లి హైకోర్టు తీర్పు వెలువరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఆయన ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే ప్రకటనల్లో నటించకుండా జాగ్రత్త పడతాడో లేదో చూడాలి.

Related posts

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju