NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో చేరిన ఆనం జయకుమార్ రెడ్డి .. నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఇటీవల వైసీపీ బహిష్కరించడంతో ఆయన టీడీపీకి దగ్గర అయిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రంలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, నెల్లూరు జిల్లాలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆనం కుటుంబం నుండే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు టీడీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఇవేళ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

TDP Leader Anam Jaya Kumar Reddy joins in YSRCP

తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంకు వచ్చిన ఆనం జయకుమార్ కి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. జయకుమార్ రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన మరో సోదరుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి జయకుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమైయ్యారు. విజయకుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ దగ్గర అయిన తరుణంలో ఆయన సోదరుడు జయకుమార్ రెడ్డి వైసీపీలో చేరడం నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గతంలో జయకుమార్ రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి కారణంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. నేడు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్

Related posts

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!

ఆరా స‌ర్వేపై ఆరాలెందుకు… తెర‌వెనుక ఏం జ‌రిగింది..?

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

sharma somaraju

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N