NewsOrbit
న్యూస్

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ .. కీలక నిర్ణయాలు ఇవే

AP Cabinet Meet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచౌంగ్ తుఫాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు ఏపీ కేబినెట్ అనుమతి ఇచ్చింది. రుణ సేకరణకు ఏపీఎఫ్ఎస్ఎల్ కు అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మధురవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటునకు మంత్రివర్గం ఆమోదించింది. నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలో వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటునకు నిర్ణయం తీసుకుంది. విశాఖలోని నాలుగు కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వృధాప్య పింఛన్లు రూ.3వేలకు పెంపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కాగా, మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే షేక్ సాబ్జీ మరణవార్త తెలియడంతో సీఎం జగన్ దిగ్భాంతి చెందారు. షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఎన్నికలకు పూర్తిగా సన్నద్దంగా ఉన్నామని మంత్రులతో పేర్కొన్నారు.  మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యుల్ విడుదల కావచ్చని జగన్ అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దనీ, బలంగా తిప్పి కొట్టాలని మంత్రులను సూచించారు సీఎం జగన్.

Related posts

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?