NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన మాజీ డీఎస్పీ నళిని

CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమ సమయంలో నళిని అనే మహిళా డీఎస్పీ తన పదవిని వదులుకుని వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మరో సారి తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ డీఎస్పీ నళిని కోరుకుంటే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ను ఆమె ఇప్పటికే తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె అథ్యాత్మిక మార్గంలో ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగం చేయదల్చుకోలేదు. తనకు ఉద్యోగం లో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. గత సమీక్షల్లో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు సమాచారం ఇవ్వడంతో ఇవేళ నళిని మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగం తనకు ఇప్పుడు అవసరం లేదని అన్నారు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయటపడ్డానని చెప్పారు. ఇప్పుడు తనది ఆధ్యాత్మిక మార్గమని అన్నారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం కోసం సీఎం రేవంత్ ను కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నానని చెప్పారు.

సనాతన ధర్మం ప్రచారం చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ కు గతంలో తాను, సహ ఉద్యోగులు డిపార్ట్ మెంట్ లో ఎదుర్కొన్న సమస్యలపై నివేదిక ఇచ్చానని, తనలా ఎవరు బాధపడకూడదన్న అభిప్రాయంతో ఆ సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు. తన విషయంలో జరిగిన పరిణామాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇన్నాళ్ల తన మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నళిని.

నళిని భేటీ పై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తన డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఆడబిడ్డ నళిని ఈరోజు సచివాలయంలో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్  అయ్యాయి.

Related posts

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju