RGV: తల నరుకుతా అన్న వాడు .. తల ఎక్కడ దాచుకున్నాడని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశ్నించారు. తన తల నరికి తెస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తానని కొలికిపూడి శ్రీనివాసరావు పై రెండు రోజుల క్రితం ఆర్జీవీ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫిర్యాదు అధారంగా కొలికిపూడిపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు కొలికిపూడిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కొలికపూడి ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.
కేసు గురించి కొలికపూడి భార్యకు సీఐడీ అధికారులు సమాచారం అందజేశారు. వ్యూహం సినిమా విషయంలో ఓ టీవీ డిబెట్ లో వర్మపై కొలికిపూడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
YS Sharmila: వైఎస్ షర్మిల వెంట నడిచే మొదటి ఎమ్మెల్యే రెడీ అయ్యారు(గా)..!