NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 30 2023 Episode 2066: అంజలి ఫ్యామిలీ అందరూ కలిసి ఆశ గుట్టు రట్టు చేస్తారా లేదా.

Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights

Kumkuma Puvvu December 30 2023 Episode 2066: లక్ష్మి కాదు కాదు కాదు నేను అంజలిని కాదు లక్ష్మిని అని చెబుతుంటే ఎవరు వినిపించుకోరే అంటుంది. బంటి లేదు నువ్వు నా అంజలి. అరుణ్ కుమార్ పిలిపించిన మాంత్రికుడు వస్తాడు అతను కూడా లేదు తను అంజలి అంటాడు.లక్ష్మీ ఆత్మ లేదు నేను లక్ష్మిని అంటుంది. మాంత్రికుడు నువ్వు లక్ష్మీవ అంజలివ ఇప్పుడే తేలుస్తాను రా అంటూ తన మంత్ర శక్తితో లక్ష్మీ ఆత్మను అంజలి శరీరం నుంచి బయటికి తీస్తాడు. లక్ష్మీ ఆత్మను చూసి అందరూ షాక్ అవుతారు. మాంత్రికుడు ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అని అడుగుతాడు. లక్ష్మీ ఆత్మ అవును నేను లక్ష్మిని లక్ష్మీ ఆత్మ ని అయితే ఏంటి. అమృత అయితే ఏంటా నువ్వు నీ కూతురు కోసం నా కూతురు జీవితంతో ఆడుకుంటావా అంటుంది. లక్ష్మీ ఆత్మ మీ అంజలి నాకు ఇచ్చిన మాట తప్పి అందుకే నేను నా ఆత్మ ఘోషిస్తూ నేను సమాధి నుంచి ఆత్మగా వచ్చి అంజలి శరీరాన్ని ఆవహించి నా కూతురు స్నేహితులకు ప్రేమను అందిస్తున్నాను అందులో తప్పేముంది నీ కూతురు నాకు ఇచ్చిన మాట తప్పింది కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చింది అంటుంది లక్ష్మీ ఆత్మ.

Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights
Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights

అమృత ఏంటి లక్ష్మి నువ్వు చేసిన మంచి ఒక ఆడదానికి భర్త ఉండి కూడా తన భర్త తనను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నా కూడా ఆ ఆడదాన్ని ఇంకొక మగవాడికి భారీగా ఉండిపోయేలా చేస్తావా ఇది మీకు ఏ మాత్రం న్యాయంగా అనిపిస్తుందా అని అడుగుతుంది అమృత. లక్ష్మీ ఆత్మ అవును నేను చేసింది నాకు న్యాయంగానే ఉంది ఎందుకంటే నేను శ్వేతకు తల్లి ప్రేమ దక్కాలని చేశాను అందులో వీరి స్వార్థం ఏమీ లేదు ఒక మా ఒక మగవాడు పురుష అహంకారంతో భార్యని పిల్లని లెక్కచేయని స్థితిలో ఉన్నప్పుడు ఆడదాని కన్నీళ్ళ విలువ తెలియని వాడితో నేను కష్టాలు పడి లోకం నుంచి వెళ్లిపోయాను. కానీ నా కూతురుకు అలాంటి గతి పెట్టవద్దని నేను అంజలి శరీరాన్ని ఆవహించి తల్లి ప్రేమను పంచుతున్నాను కానీ మీ అంజలిని అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే పవిత్రంగా ఉండేలా చూశాను తనది కాని వస్తువును తను దక్కించుకోవాలని చూస్తున్నాడు మానవుడు నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటుంది లక్ష్మీ ఆత్మ. అరుణ్ కుమార్ లక్ష్మి నువ్వు చేసింది తప్పు నీకు అనిపించకపోవచ్చు కానీ సృష్టికి విరుద్ధంగా దేవుడిని మించిన శక్తి నీకు లేదు అది ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే ఈ భూలోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights
Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights

మాంత్రికుడు ఇదిగో చూడు నీ అంతట నీవే ఈ శరీరాన్ని వదిలి పంచభూతాల్లో కలిసిపోయావా సరే లేదంటే నీ ఆత్మను భూతప్రేత పిశాచి ఆత్మలను ఎలా అష్టదిబ్బందన చేసి సిబ్బందిస్తారు అలా బంధించి వేస్తాను గుర్తుపెట్టుకో అంటాడు మాంత్రికుడు. లక్ష్మి నేను వెళ్ళిపోతే నా కూతురిని ఎవరు చూసుకుంటారు తనకి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదు అంటుంది.అంజలి నీ కూతురు బాధ్యత నేను తీసుకుంటాను తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అంటుంది. అమృత అరుణ్ కుమార్ వంటి అందరూ కలిసి అవును శ్వేతకు ఇలాంటి లోటు రాకుండా మేము చూసుకుంటాము అని చెబుతారు.అది విన్న సాగర్ లేదు శ్వేతను కన్నతండ్రిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను కాబట్టి ఇకనుంచైనా శ్వేతకు తండ్రి ప్రేమను అందిస్తాను నేను చేసిన పొరపాటు నాకు బాగా తెలిసి వచ్చింది నన్ను క్షమించు లక్ష్మి నువ్వు బ్రతికున్నంత కాలం ఆడదాన్ని కన్నీటి విలువ నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మన శ్వేతకు ఎలాంటి లోటు రాకుండా తన కంటి నుండి కన్నీటి చుక్కలు రాలకుండా నేను చూసుకుంటాను తల్లి ప్రేమను తండ్రి ప్రేమను కలిపి నేను అందిస్తాను నన్ను నమ్ము ఉంటాడు సాగర్. లక్ష్మీ ఆత్మ నీలో ఇంత మార్పు వస్తే నాకు చాలా సంతోషమే కదా ఇప్పటికైనా నువ్వు మారాలనే నా కోరిక నువ్వు మారావు శ్వేతను బాగా చూసుకుంటావని నమ్మకం నాకు వచ్చింది సరే నేను ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే మీ అందరిని క్షమించమని అడుగుతున్నాను ఇక నేను వెళ్తాను సెలవు అంటూ లక్ష్మీ ఆత్మ వెళ్ళిపోతుంది. కొండమ్మ ఈ విషయం శ్వేతకు ఎలా చెప్పాలి అని అంటుంది. శ్వేత వచ్చి లేదు నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు నేను మీరు అందరూ కలిసి మాట్లాడుకునేటప్పుడే అంత వినేశాను ఈ లోకంలో మా అమ్మ లేదు అనే సంగతి నాకు ఆ రోజు తెలిసిపోయింది కానీఇ అంజలి మా లక్కీ లాగే ఉంది అని తనలో మా లక్కీని చూసుకోవచ్చు అనుకున్నాను అంతే అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights
Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights

కట్ చేస్తే బంటి అంజలి ఇద్దరు కలిసి తను చిన్నప్పటినుంచి ఎప్పుడూ కలుసుకునే ఒక పార్కుకి వెళతారు అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. బంటి ఇదిగో అంజలి ఇదంతా జరగడానికి కారణం నేనే నేను నిజంగానే నువ్వు చెప్పినట్లుగానే మొద్దబ్బాయిని నేను ఏది కరెక్ట్ గా అర్థం చేసుకోలేను కాబట్టే నీకు నావల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి నిన్ను కష్టాలపాలు చేశాను కాబట్టి ఆ దేవుడు నాకు కష్టం పెట్టాడు కానీ నువ్వు నన్ను క్షమించాలి అంజలి అంటాడు బంటి. అంజలి అయ్యో బంటి నువ్వు నిజంగానే మొద్దబ్బాయి వి ఎందుకంటే ఇందులో నా తప్పు కూడా ఉంది ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు వేరు కాదు కదా అందుకని. బంటి లేదు అంజలి నిజంగానే నీ పట్ల నేను చాలా తప్పు చేశాను ఇక నువ్వు ఎప్పటికీ నన్ను విడిపోవద్దు నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని అంటాడు బంటి. అంజలి లేదు బంటి నువ్వు కట్టినా తాళి నా మెడలో ఉన్నంతవరకు నువ్వు నాతోనే ఉన్నట్టు మరి నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పు నీ నీడై నిన్ను అంటిపెట్టుకొని ఉంటాను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఎనీ ఇద్దరు బాధపడతారు.అంజలి సరే బంటి ఇక మనకు అంత నిజం తెలిసిపోయింది కాబట్టి మన ఇద్దరము కలిసి ఆశ ఆట కట్టిద్దాం ఇంటికి వెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు.

Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights
Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights

కట్ చేస్తే కావేరి చంద్రం ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు. కావేరి ఈ బండి గాడికి గతం గుర్తుకు వచ్చిందన్న సంబరపడిపోవాలో లేదంటే అంజలి కానీ అంజలి ఆ లక్ష్మి దగ్గరికి వెళ్లినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అక్కడ ఏం జరుగుతుంది ఏమో బండి గాడు ఏం రాద్ధాంతం చేస్తున్నాడు ఏమో అని టెన్షన్ తో కాళ్లు కాలిన పిల్లి లాగా తిరుగుతూ ఉంటుంది కావేరి.అరుణ్ కుమార్ లేదక్కా నువ్విక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటాడు. కావేరి వచ్చారా ఏంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదా నీకే మీరు కూడా హాయిగా లక్ష్మి దగ్గరికి వెళ్లిపోయారు కదా మీకే టెన్షన్ అంటుంది మా బండి గాడు వచ్చాడా అని అంటుంది. అమృత వచ్చాడు వదిన మా మేనల్లుడు నా అల్లుడు వచ్చాడు అలాగే నీ కోడలు కూడా వచ్చింది అని చెబుతుంది అమృత. బంటిఅమ్మ నేను వచ్చేసాను అంటాడు. కావేరి అయ్యో బంటిగా నీకోసమే ఎదురుచూస్తున్నాను రా నువ్వు ఏమైపోతున్నావో అని నా బాధఅంటుంది బంటి అమ్మ ఇక నీకు ఆ బాధ అవసరం లేదు ఎందుకంటే నీ కోడలు కూడా వచ్చింది అంటాడు. కావేరి అవునా ఏది రా అంటుంది. అంజలి ఇదిగో వచ్చేసాను అత్తయ్య ఇక నేను ఎప్పటికీ ఎటు వెళ్ళను అంటూ అంజలి లోపలికి వస్తుంది.

Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights
Kumkuma Puvvu Today Episode December 30 2023 Episode 2066 Highlights

కావేరి ఒరేయ్ బంటిగా కోడల్ని తీసుకురా అంటే మళ్లీ ఈ అంజలి వెంటపెట్టుకువచ్చావ్ ఏంటి రా ఇది కాసేపు లక్ష్మీ గారు మరి కాసేపు అంజలిగా ప్రవర్తించి బుర్ర దుబ్బేలా చేస్తుంది అని చెప్తుంది. బంటి ఇక అలా జరగదు అమ్మ అంటాడు. అమృత అవును వదిన ఇక ఎప్పటికీ అలా జరగదు తను నిజంగానే మన అంజలి లక్ష్మీ ఎప్పటికీ రాదు.కావేరి ఏ ఎందుకు రాదు లక్ష్మి ఏమైపోయినట్లు అంటుంది. అరుణ్ కుమార్ ఎందుకంటే లక్ష్మి అనేది ఆత్మ ఆత్మ మన అంజలిని ఆవహించింది కాబట్టే కొద్దిసేపు లక్ష్మీ గా మరికొద్ది సేపు అంజలిగా ప్రవర్తించింది ఇప్పుడు ఆ ఆత్మను అంజలి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు తను నిజంగానే మన అంజలి అని చెబుతాడు.చంద్రం ఏంటి బామర్ది లక్ష్మీ ఏంటి ఆత్మ ఏంటి మాకేమి అర్థం కావడం లేదు అంటాడు. అరుణ్ కుమార్ చెప్తాను బావ లక్ష్మి చనిపోయింది ఆ లక్ష్మీ ఆత్మ తన కూతురు శ్వేత కోసం మన అంజలిని ఆవహించి ఆ ఇంట్లో సాగర్ గ శ్వేతకు తల్లిగా శాశ్వతంగా అంజలి శరీరంలో ఉండే తను తల్లి ప్రేమను ఆస్వాదించాలని అనుకుంది అందుకే మన అంజలి ఇన్ని రోజులు అలా ఇబ్బంది పడింది మాంత్రికుని తీసుకువచ్చి ఆత్మను అంజలి శరీరం నుంచి పంపించేసాము అని చెబుతాడు. చంద్రం అవునా మాకు తెలియకుండా ఇదంతా జరిగిందా ఈ రోజుల్లో కూడా ఆత్మలు ఉన్నాయా నమ్మలేకపోతున్నామే అంటాడు. కావేరి ఎలా అయితేనే ఇప్పుడు ఆ ఆశ అనే కొరివి పోయి ఈ కోడలు వచ్చింది అంటే నాకు ఈ సంబరం చాలదు కానీ ఆశ అనే దయ్యం వస్తే ఏం జరుగుతుందో ఏమో నాకు భయంగా ఉంది. బంటి ఎందుకమ్మా భయం అంటాడు.కావేరి ఎందుకు ఏంట్రా బండిగా నీకు గతం గుర్తుకు లేనప్పుడు ఈ అంజలి లక్ష్మి గా సాక్షి సంతకం పెట్టి రిజిస్టర్ ఆఫీస్ లో నీకు ఆశకి పెళ్లి జరిపించారు కదరా ఇప్పుడు ఆ ఆశ వచ్చి నటింట్లో తిష్టి వేస్తే ఏం చేయాలి రా అని తల పట్టుకుంటుంది. బంటి అమ్మ ఇప్పుడు మనం అందరం కలిసి ఆశ ఆట కట్టించాలి అంటాడు

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N