NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. సీనియర్ నేత తాటికొండ రాజయ్య రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తొటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి స్టేషన్ ఘన పూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుండి రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. రాజయ్య రాజీనామాతో వరంగల్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

1997 లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన టీ రాజయ్య 1999 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు నాటి టీడీపీ అభ్యర్ధి కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలైయ్యారు. 2004 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ లభించలేదు. 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరో సారి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కడియం శ్రీహరిపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కడియం శ్రీహరిపై రెండో సారి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ జి విజయరామారావుపై 58వేలకు ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.

కేసిఆర్ మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. తదుపరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఇందిరా సింగవరపు పై 35వేలకుపైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రాజయ్య విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ మహిళా సర్పంచ్ రాజయ్యపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది.

ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గడచిన ఎన్నికల్లో రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. రాజయ్య అసంతృప్తిని చల్లార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రైతుబంధు) చైర్మన్ గా కేసిఆర్ సర్కార్ నియమించింది. అయినప్పటికీ రాజయ్య అప్పటి నుండి పార్టీ పై అసంతృప్తిగానే ఉన్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజయ్య సిద్దమైనట్లుగా తెలుస్తొంది.

YSRCP: వైసీపీ ఆరవ జాబితా వచ్చేందోచ్ .. కొన్ని సవరణలు ఇలా

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju