NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564: బెస్ట్ బిజినెస్ మాన్ గా విక్రమాదిత్య.. దివ్య కోపం.. కృష్ణ కొత్త ప్లాన్..?

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564: పద్మావతి వాళ్లు అందరితో కలిసి పిక్నిక్ వెళ్లి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారు. వెళ్లేటప్పుడు నా ఆనందం వచ్చేటప్పుడు ఉండదు. దానికి కారణం పద్మావతి ఆడిన గేమ్ లో విక్కీ, రమేష్ చంద్ర గతాన్ని గుర్తు చేయడం వల్ల అందరూ బాధపడతారు. విక్కీ మాత్రం దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని రమేష్ చంద్రకు తను చేసిన తప్పుని మళ్ళీ తెలిసేలా చేస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత విక్కీ చాలా డల్ గా ఉంటాడు పద్మావతి భోజనం తీసుకొని రూమ్ కి వెళుతుంది. మనసు బాధగా ఉంటే కడుపేంచేసింది సారు భోజనం తినకుండా ఉంటే మీ మనసుకు ఎదుటి పడుతుందా ఏంటి భోజనం తినండి అని నచ్చ చెప్తుంది పద్మావతి. కానీ విక్కీ మాత్రం, భోజనం చేయకుండా రమేష్ చంద్ర గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి పద్మావతి చెప్పిన మాటలకు విక్కీ భోజనం చేయడానికి ఒప్పుకొని పద్మావతి ఒక్కొక్క ముద్దని ఇది మీ అమ్మ ముద్ద అని చివరి వరకు తినిపిస్తుంది ఇక విక్కీ ఇక నాకు చాలు అనడంతో పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights
Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights

ఇక నారాయణ డల్ గా కూర్చుని ఉంటాడు పద్మావతి విక్కీ రమేష్ చంద్రుని ఎంత కలపాలనుకున్న ఎందుకు అది కుదరట్లేదు అని ఆ పిక్నిక్ లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని విక్కీ రమేష్ చంద్రని మీద అరిచిన విక్కీ బాధని రమేష్ చంద్ర బాదని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే కుచల అటువైపుకు వస్తుంది. ఏమైంది నారు అలా డల్ గా ఉన్నావు అని అడుగుతుంది. నారాయణ రమేష్ చంద్ర వికీల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్తాడు అసలు మా అన్నయ్య ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఉండేదే కన్నాలని డాక్టర్ చెప్పారు ఇప్పుడు ఆ కోరిక తీరకుండానే, తండ్రి కొడుకులు కలవకుండానే ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది అని అంటాడు నారాయణ వెంటనే కుచల బావ గారి గురించి ఆలోచిస్తున్నావా, విక్కీకి బావగారంటే అసలు ఇష్టం లేదు. బావగారు అక్కని ఉంచుకొని కూడా వేరే వాళ్లతో పెళ్లి చేసుకోవడం వల్లే విక్కీకి అంత కోపం వచ్చింది మరి ఆయన చేసింది తప్పే కదా నారు అని అంటుంది. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎలాగో అయినా అప్పుడు ఏ పరిస్థితుల్లో తను అలా చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు కదా అని అంటాడు నారాయణ. ఏది ఏమైనా గానీ విక్కీ రమేష్ చంద్ర తో కలవడం అన్నది కుదరదు, మనం కనుక ఏమన్నా మాట్లాడితే మనల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు ఎందుకు నారు మనమైనా ఇక్కడే ఉందా అని అంటుంది కుచల. నారాయణ మాత్రం విక్కీ రమేష్ చంద్ర ఎప్పుడు కలుస్తారో అని బాధపడుతూనే ఉంటాడు.

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights
Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights

రమేష్ చంద్ర సంతోషంగా అందరినీ పిలుస్తూ ఉంటాడు చేతిలో పేపర్ ఉంటుంది ఆ పేపర్ ని తీసుకొని అందరూ రండి అని పిలుస్తాడు పద్మావతి నారాయణ తొందరగా రండి అని అరుస్తాడు ఇక అప్పుడే అక్కడికి అందరూ వస్తారు ఒక వికీ మాత్రమే రాడు ఇక ఏంటి అన్నయ్య అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతాడు నారాయణ ఏం లేదురా ఈ పేపర్లో మన విక్కీకి అవార్డు వచ్చినట్టు రాశారు అని అంటాడు ఏంటి అన్నయ్య నువ్వు అనేది అని అంటాడు నారాయణ అవును నారాయణ బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డుకి మనవికి ఎంపిక అయ్యాడు అని అంటారు ఇక వెంటనే ఇంట్లో అందరూ సంతోషంతో ఒక్కసారిగా అవునా అని అరుస్తారు ఇక అందరూ పేపర్ తీసుకొని చూస్తారు అందులో ది బెస్ట్ బిజినెస్ మాన్ గా చిన్న వయసులోనే ప్రతిభ కనపరిచిన గ్రేట్ విక్రమాదిత్య అని రాసి ఉంటుంది. అదంతా చూసి పద్మావతి చాలా సంతోషిస్తుంది ఇక ఆర్య చూశావా అక్క మనవి కీస్ ఏం సాధించాడు అని అరవిందతో అంటాడు అరవింద్ కూడా చాలా సంతోషంతో, విక్కీ ఎప్పటికైనా ఇలాంటి పొజిషన్ కి రావాలని నేను కోరుకుంది అని అంటుంది. ఇక అప్పుడే ఈ విషయం విక్కీకి తెలుసో లేదో చెబుదాం అని అనుకునేసరికి విక్కీ మేడ మీద నుంచి కిందకి దిగి వస్తూ ఉంటాడు. విక్కీని చూసి ఆర్య ఎవరు చెప్పద్దు అందరం ఒకేసారి చెప్పాలి అని అంటాడు. సరే అని సైలెంట్ గా ఉంటారు ఇక విక్కి కిందకి వచ్చి ఏంటి అంతా సైలెంట్ గా ఉన్నారు అని అడుగుతాడు ఎవరు నోరు మెదపకుండా ఉంటారు ఇక ఒకసారి గా విక్కి ఏమైందో చెప్పండి అని అనడంతో కంగ్రాట్యులేషన్స్ అని ఇంట్లో అందరూ ఒక్కసారిగా అరుస్తారు. దివ్య కృష్ణ మాత్రం వాళ్ళకేం సంబంధం లేనట్టు ఉంటారు. ఇక విక్కి మాత్రం ఏంటి అని అడుగుతాడు అవును బాబు నీకు బెస్ట్ బిజినెస్ అవార్డు వచ్చింది అని రమేష్ చంద్ర చెప్తాడు విక్కి సంతోషంతో చేతిలో ఉన్న పేపర్ ని తీసుకొని చూస్తాడు అందులో విక్కీ ఫోటోతో సహా పేరు కూడా ఉంటుంది.

ఇక అందరూ సంతోషంగా ఉంటే కృష్ణ మాత్రం ఓహో బెస్ట్ బిజినెస్మేన్ అవార్డు వచ్చిందని మురిసిపోతున్నావా విక్కి నీకు ఎన్ని అవార్డులు వచ్చినా నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ పతనం నా చేతిలోనే అని మనసులో అనుకుంటాడు ఈ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది నేను ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని విడగొట్టి తీరుతాను అని అనుకుంటాడు కృష్ణ మనసులో, ఇక అందరూ ఆనందంలో ఉండగా నారాయణ అసలు ఈ అవార్డు రావడానికి కారణం ఎవరో తెలుసా అని అంటాడు. ఎవరు అని అందరూ అడిగితే ఇక నారాయణ ఇంకెవరు మా అన్నయ్య అని చెప్పబోతూ అన్నయ్య అని అనే లోపే వెంటనే రమేష్ చంద్ర పద్మావతి పద్మావతి కారణం అని అంటాడు. ఆ మాట విని దివ్యకి బాగా కోపం వస్తుంది ఇక రమేష్ చంద్ర మాత్రం అవును పద్మావతి వల్లే ఇదంతా సాధ్యమైంది అని అనడంతో నారాయణ కూడా ఇంక చేసేదేం లేక అవును పద్మావతి వల్లే అని అంటాడు.

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights
Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights

ఇక కుచల మాత్రం పద్మావతి వల్ల ఎలా సాధ్యమవుతుంది సాధించింది విక్కీ అయితే పద్మావతిని అందరూ పొగుడుతున్నారు ఏంటి అని అంటుంది. అవును పద్మావతి విక్రమాదిత్య జీవితంలోకి వచ్చినప్పటినుండి మన విక్కీ లైఫ్ మారిపోయింది తను కష్టాల్లో తోడుగా ఉంది ఇలా సుఖాల్లో సంతోషాల్లోనూ తనకి అండగా నిలబడుతుంది అలాంటప్పుడు పద్మావతిని అవార్డుకి రావడానికి కారణం అనక ఏమంటారు అని అంటాడు నారాయణ. వెంటనే విక్కీ మాత్రం కాదు ఈ అవార్డు నా స్వయం కృషితో తెచ్చుకున్నాను. అంచలంచెలుగా ఎదిగి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఈ అవార్డు ఇవ్వాల నాకు వచ్చిందంటే దానికి కారణం నేను నా పట్టుదలే అంతేగాని ఇంకెవరో ఇందులో భాగస్వామ్యం కాదు అని పద్మావతి ముఖానే చెప్పేస్తాడు. ఇక పద్మావతి అవసరం అని అంటుంది ఇక అందరూ కూడా విక్కీకి కంగ్రాట్యులేషన్స్ చెప్పి వెళ్ళిపోతారు.

కృష్ణ మాత్రం పగతో రగిలిపోతూ ఉంటాడు నేను ఈ ఫ్యామిలీని విడగొట్టాలనుకుంటే వీళ్లేంటి ఒకరికి ఒకరు కలిసిపోతున్నారు రమేష్ చంద్ర వాళ్ళ కొడుకు విక్కీని విడగొట్టి ఇంకాస్త దూరం పెంచి వాళ్ళ మధ్యలో ఈ కుటుంబంలో కలతలు సృష్టిద్దాం అనుకుంటే వీళ్లంతా ఒకటైపోతున్నారేంటి పద్మావతి బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు వచ్చిన కారణంగా విక్కీ ఇంకా దగ్గరవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా కృష్ణకు ఎదురుగా దివ్య కనిపిస్తుంది ఇంకా దివ్య దగ్గరి నుంచి ప్లాన్ మొదలుపెట్టాలి అని అనుకుంటాడు నేను వేసే ప్లాన్ తో ఇంట్లో అల్లకల్లోలం సృష్టించాలి అని అనుకుంటాడు. ఇక దివ్య దగ్గరికి వెళ్దామని రెండు అడుగులు వేసేసరికి దివ్య దగ్గరికి రమేష్ చంద్ర వచ్చి కూర్చుంటాడు. ఇక కృష్ణ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. దివ్య ఏంటమ్మా ఇంత డల్ గా ఉన్నావు మీ అన్నయ్యకు అక్కడ అవార్డు వచ్చిందని అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటి మధ్యలోనే వచ్చేసావు అని అడుగుతాడు ఏంటి డాడీ మీరు మాట్లాడేది నేను సంతోషంగా ఎలా ఉంటాను ఆ అవార్డు రావడానికి కారణం ఎవరు మీరే కదా మీరే పేపర్స్ తీసుకొచ్చి అప్లికేషన్ ఫిల్ అప్ చేయించి ఇవాళ బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు ఆయనకి వచ్చింది అంటే దానికి కారణం మీరైతే అక్కడ మీ పేరు చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళు సంతోషపడుతున్నారు అయినా మీరు కూడా పద్మావతి పేరు ఎందుకు చెప్పారు అని అంటుంది దివ్య.అది కాదమ్మా ఇప్పుడు నా పేరు చెప్తే విక్కీ అవార్డు తీసుకోవడానికి సాయంత్రం ఫంక్షన్ కి వెళ్లడు. అదే పద్మావతి పేరు చెప్తే ఫంక్షన్ కి వెళ్తాడు నా బిడ్డలు నేను సాధించలేని సాధించారు అన్న సంతోషం చాలు నాకు అని అంటాడు రమేష్ చంద్ర ఏమో డాడీ మీరు చేసింది అయితే నాకు అసలు నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనేఇదంతా విన్న కృష్ణ ఓహో అయితే కారణం ఏదన్న మాట రమేష్ చంద్ర ద్వారా విక్కీకి అవార్డు వచ్చిందా? ఈ ఒక్క కారణం అడ్డం పెట్టుకొని ఇంట్లో ఎవరికి తెలియని నిజం నాకు తెలిసింది కాబట్టి ఇక అలజడి సృష్టించచ్చు అని అనుకుంటాడు మనసులో, దివ్య మాత్రం విక్కీ కి అవార్డు వచ్చినందుకు తన తండ్రి కారణం అన్న విషయం చెప్పకపోవడంతో చాలా కోపంగా ఉంటుంది.

Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights
Nuvvu Nenu Prema March 6 2024 Episode 564 episode highlights

ఇక పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్లి సారు నేను మీకు దిష్టి తీయాలి అని అంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటాడు. అదేంటి సారు అలా అంటారు మీ పేరు పేపర్లో అంత పెద్ద అక్షరాలతో వేసి మీ ఫోటో వేస్తే మీరు బెస్ట్ బిజినెస్ మాన్ గా అవార్డు తీసుకోబోతుంటే ఇక ఎంతమంది చూపు మీ మీద పడి ఉంటుంది అందుకనే సారు ఇప్పుడు నేను మీకు దిష్టి తీయాలని ఫిక్స్ అయిపోయాను అని విక్కీ చెప్తున్నా వినకుండా పద్మావతి విక్కి కి దిష్టి తీస్తుంది. నువ్వు మాత్రం చెప్పింది వినవు కదా పద్మావతి అని అంటాడు. ఇక ఫంక్షన్ ఎప్పుడు సారు అని అడుగుతుంది పద్మావతి ఈరోజు సాయంత్రం అందరం కలిసి వెళ్తున్నామని అంటాడు అవునా అయితే నేను బాగా రెడీ అవ్వాలి ది గ్రేట్ విక్రమాదిత్య గారి భార్యని కదా అందుకని నేను కూడా మీ స్థాయికి తగ్గట్టు రెడీ అవుతాను అని అంటుంది.

Related posts

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri