NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 6 2024  Episode 305: ప్రత్యక్ష నారాయణ వ్రతాన్ని భంగం చేసిన రుక్మిణి, ఇదేనా నా మీద ప్రేమ అంటున్న శ్యామ్..

Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights

Madhuranagarilo March 6 2024  Episode 305:  రుక్మిణి దేవుడికి నిజంగానే హస్త హారతి ఇస్తుంది. చూశారా మీరు అంటే ఎంత ప్రేమ లేకపోతే అక్క చేతిలో కర్పూరం వెలిగించుకుంటుంది అని రాధా అంటుంది. అది ప్రేమ కాదు డ్రామా ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని శ్యామ్ అంటాడు. రుక్మిణి చెయ్యి కాలిందామా అని మధుర అడుగుతుంది. శ్యామ్ కోసం చేయంటీ అత్తయ్య నేను అయినా ఆ కర్పూరం లా కాలిపోతాను అని రుక్మిణి అంటుంది.రాధా మీఅక్కతో ప్రత్యక్ష నారాయణ వ్రతం చేస్తానన్నావు కదా అని శ్యామ్ అంటాడు. ప్రత్యక్ష నారాయణ వ్రతమా అదేంటి రాధ అని రుక్మిణి అడుగుతుంది.ఈరోజు రథసప్తమి కదా అక్క సూర్యభగవానున్ని ప్రత్యక్ష నారాయణ గా పూజిస్తే సౌభాగ్యం బాగుంటుంది చేస్తావు కదా అని రాదా అంటుంది. చెప్పాను కదా రాధా ఆయన కోసం ఏమైనా చేస్తానని అని రుక్మిణి  అంటుంది.

Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights
Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights

కట్ చేస్తే, అక్క ప్రత్యక్ష సూర్యనారాయణ ని పూజించి దీపారాధన చేయాలి అని రాదా చెబుతుంది.రుక్మిణి దీపారాధన చేసి సూర్య భగవానుడికి మొక్కుకుంటుంది.రాధా దీపారాధన చేసి సూర్యభగవానుడికి మొక్కుకున్నాను ఇప్పుడేం చేయాలి అని రుక్మిణి అడుగుతుంది. ఆ దీపం కొండెక్కి దాకా సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి ఓం దివాకరాయ నమః అనే మంత్రాన్ని జపించాలక్క అని రాధా  చెబుతుంది. ఏంటి దీపం కొండెక్కి దాకా ఎండలో నిలబడి జపించాలా అని రుక్మిణి అంటుంది.ఏంటి నామీద బోలెడంత ప్రేమ ఉంది అన్నావు కదా ఆ మాత్రం చేయలేవా అని శ్యామ్ అంటాడు. మీకోసం చేస్తాను అంటూ రుక్మిణి ఎండలో నిలబడి ఓం దివాకర్య నమః అని జపిస్తూ ఉంటుంది.

Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights
Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights

తను జపిస్తుంటే మనం ఎందుకు ఎండలో ఉండాలి లోపలికి వెళ్దాం పదండి అని శ్యామ్ అంటాడు. అందరూ లోపలికి వెళ్తారు. రుక్మిణి జపం చేస్తూ అ దీపని ఆర్పాలని చూస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇలా ఎండలో ఉండాలి పెద్ద గాలి వచ్చి దీపం కొండెక్కితే బాగుండు అని రుక్మిణి అనుకుంటుంది. ఇక లాభం లేదు నేను నిజం చెప్పేస్తాను అని రుక్మిణి వెళ్తుంది. కట్ చేస్తే, ఏంటి రుక్మిణి అప్పుడే జపం ఆపేసి వచ్చేసావు ఇదేనా నా నామీద నీకున్న ప్రేమ అని శ్యామ్ అంటాడు. నావల్ల కావట్లేదు ఇది కాకుండా ఇంకేదైనా చేస్తాను అని రుక్మిణి అంటుంది. ఏంటమ్మా నిన్న ఉపవాస దీక్ష చేస్తానని మధ్యలోనే ఆపేసావు ఇప్పుడు సూర్యనారాయణ వ్రతం చేస్తానని ఆపేసావు అసలు వాడిని కాపాడే ఉద్దేశం ఉందా నీకు అని మధుర అంటుంది. అత్తయ్య నేను ఆయన కోసం చేయాలని అనుకుంటున్నాను కానీ నా బాడీ సహకరించట్లేదు ఇంకేదైనా చెప్పండి చేస్తాను అంటూ రుక్మిణి వెళ్ళిపోతుంది. చూడు రాధా మీ అక్కకి నా మీద ప్రేమ లేదని ఇప్పటికైనా అర్థం చేసుకో అంటూ శ్యామ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, కిరణ్ శ్యామ్ ఫోన్ చేసి మనోహర్ కి స్పృహ వచ్చిందని చెబుతాడు. అవునా మనోహర్ కి స్పృహ వచ్చిందా నేను వెంటనే హాస్పిటల్ కి వస్తున్నాను అని శ్యామ్ అంటాడు. శ్యామ్ హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏంట్రా మనోహర్ కి స్పృహ వచ్చిందా ఇప్పుడు ఎలా ఉన్నాడు అని శ్యామ్ అంటాడు. తను మాట్లాడుతున్నాడు అంట రా పద వెళ్లి చూద్దాం అని కిరణ్ శ్యామ్ మనోహర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు  ఇప్పుడు మనోహర్ కి ఎలా ఉంది అని కిరణ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights
Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights

మీరు చాలా అదృష్టవంతులు అండి పేషంట్ కోమలో నుంచి బయటికి వచ్చాడు అన్ని నార్మల్గానే ఉన్నాయి అని డాక్టర్ చెబుతాడు. చాలా థాంక్స్ డాక్టర్ అని శ్యామ్ అంటాడు. ఆ దేవుడి దయవల్ల గండం గడిచింది అని శ్యామ్ అని అంటాడు. మనోహర్ లేచి కూర్చుంటాడు. నా పాలిట దేవుడు మీరే సార్ సమయానికి నన్ను హాస్పిటల్ కి తీసుకు రాకపోతే బతికి బట్ట కట్టే వాన్నే కాదు సార్ అని మనోహర్ అంటాడు. ఆ రుక్మిణి నన్ను చంపాలని చూస్తే మీరు బ్రతికించాలని చూశారు సార్ అని మనోహర్ అంటాడు. రుక్మిణి నిన్ను చంపాలనుకుందా అని శ్యామ్ అంటాడు. అవును సార్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు రుక్మిణి ఆ కారులో నేను చూశాను అని మనోహర్ అంటాడు. నిన్ను రుక్మిణి ఎటాక్ చేయించిందని మాకు అనుమానం వచ్చింది కానీ నువ్వు చెప్పడంతో కన్ఫర్మ్ అయింది కానీ రుక్మిణి మీద మనోహర్ నే వ్యక్తితో బ్యాడ్ అని చెప్పించాలనే శ్యామ్ చూస్తున్నాడు అని రాధకి చెప్పింది రాదా నేను చెప్పినా నమ్మదు నువ్వు చెప్పిన నమ్మదు ఇప్పుడు ఎలా అని శ్యామ్ అంటాడు. శ్యామ్ గారు మీరే మీ భయపడకండి నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళండి రుక్మిణి దేనికైనా తెగించగలదని మీ భార్యకి నేను నచ్చచెబుతాను అని మనోహర్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights
Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights

కట్ చేస్తే, నా భర్త కోసం ఉపవాస దీక్ష చేద్దామనుకుంటే నాకు అవకాశం లేకుండా చేసావు ఈరోజు ప్రత్యక్ష నారాయణ వ్రతం చేద్దామంటే నా ఒళ్ళు సహకరించేలా చెయ్యలేదు నా మనసు తహతహలాడుతున్న చేయలేకపోతున్నాను ఎందుకు చేసావ్ స్వామి ఇలా నా భర్త కోసం ఉపవాసం కూడా చేయలేని పరిస్థితి నాకు ఎందుకు ఇచ్చావు చెప్పు అని రుక్మిణి దేవుడి దగ్గర నిలబడి ఉంటుంది. నేను చెప్తాను అని శ్యామ్ అంటాడు. దేవుడికి నువ్వు పూజ ఎందుకు చేయలేకపోతున్నావు నన్ను చెప్పమంటావా అని శ్యామ్ అంటాడు. నేనేం చేశాను అని రుక్మిణి అంటుంది. మనోహర్ ని పిలుస్తాడు శ్యామ్. నేను చెప్పనా నీ గురించి అని మనోహర్ అంటాడు. ఇతని నీ ఫ్రెండ్ మనోహర్ కదా అని రుక్మిణి  అంటుంది. నా ఫ్రెండ్ కాదు నీ ఫ్రెండ్ నీకు క్లోజ్ ఫ్రెండ్ అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights
Madhuranagarilo Today Episode March 6 2024  Episode 305 Highlights

అతని కొట్టి రాధకు నిజం చెప్పించాలని మాట్లాడుకున్నదంతా రాధకి కూడా తెలుసు కదా అవునా రాదా మనం కూడా అతని హాస్పిటల్ కి వెళ్లి చూసి వచ్చాము కదా అని రుక్మిణి  అంటుంది. అవును అని రాధా అంటుంది. రుక్మి గురించి మా దగ్గర నిజం చెప్పించడం ఏంటి అతని నువ్వు కొటి హాస్పటల్లో చేర్పించడం ఏంటి అసలు ఇదంతా ఏంట్రా ఏం జరుగుతుంది అని మధుర అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N