NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS BSP Alliance: బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు ప్రకటనతో ఆ సీనియర్ నేతకు ఆగ్రహం .. బీఆర్ఎస్ కు గుడ్ బై ..! త్వరలో కాంగ్రెస్ లోకి..?

BRS BSP Alliance: తెలంగాణలో బీఆర్ఎస్ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల ముందు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పగా, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. దిగువ స్థాయి నాయకులు చాలా మంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారి ప్రయోజనాల కోసం అధికార పార్టీ గూటికి చేరుతున్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలతో, మరి కొందరు బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల్లో  బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఇరు పార్టీల నేతలు కేసిఆర్, ప్రవీణ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ సమయంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ నాటి అధికార బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు అనూహ్యంగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై పలువురిని నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిర్పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కోనేరు కోనప్ప పార్టీకి వీడేందుకు సిద్దమైయ్యారు. ఈ నెల 12 లేదా 15న కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తొంది. గడచిన ఎన్నికల్లో కోనేరు కోన్నప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఈ కారణంగా వరుసగా ఆ నియోజకవర్గం నుండి రెండు సార్లు 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కోనేరు కోనప్ప.. ఈ ఎన్నికల్లో కేవలం 3వేల తేడాతో ఓటమి పాలైయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 44వేలకుపైగా ఓట్లు వచ్చి మూడో స్థానం నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్ధి కోనేరు కోనప్పపై 3వేల పైచికులు ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి పాల్వాయి హరిబాబు విజయం సాధించారు.

ఎన్నికలో తన ఓటమికి కారణమైన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో నడవాలని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నిర్ణయించుకోవడంపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ కు తాను ఎంతో గౌరవం ఇచ్చాననీ, పాత్తు విషయంపై తనతో మాటమాత్రంగానైనా చెప్పకపోవడంపై కోనప్ప ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తొంది. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న కోనప్ప నిన్న కార్యకర్తలతో రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఇవేళో రేపో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు గుడ్ బై ప్రకటన చేయనున్నారని సమాచారం.

వాస్తవానికి కోనేరు కొనప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా సిర్పూ ర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలి సారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో , 2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలైయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధిపై విజయం సాధించారు.

ఆ తదుపరి అధికార టీఆర్ఎస్ లో చేరిన కోనప్ప 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి మరో సారి గెలుపొందారు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చీలిక ప్రభావంతో కోనప్ప రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం వల్లనే తాను ఓటమి పాలైయ్యాననే అభిప్రాయం కోనేరు కోనప్పలో ఉంది. ఈ క్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న కేసిఆర్ తో భేటీ కావడం, పొత్తు ప్రకటన చేయడంతో ఆగ్రహంతో ఉన్న ఉన్న కోనప్ప కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.

TDP – Janasena: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ .. ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఆ మహిళా నేత..!

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju