NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అల్లుడు దెబ్బకు..వైసీపీ మామ జాత‌కం తిర‌గ‌బ‌డుతుందా..?

ఉమ్మ‌డి శ్రీకాకుళంలోని ఆమదాలవలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కూన రవికుమార్ కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన త‌ర్వాత‌.. అనూహ్య‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ పోరు ఏక‌ప‌క్ష‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూన‌కే మా ఓటు. మాకు ఆయ‌న అండ‌గా ఉన్నారు అనే టాక్ జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా.. త‌మ్మినేనికి వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ వెల్ల‌డైంది. దీంతో వైసీపీ కూడా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇస్తే..ఆయ‌న ఓట‌మిని చ‌విచూడ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులుకూడా చెబుతున్నారు.

TDP's son-in-law gets hit.. Will YCP's
TDP’s son-in-law gets hit.. Will YCP’s

అలాగ‌ని ఇవ్వ‌క‌పోతే.. బీసీ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని వైసీపీలో మ‌రో చ‌ర్చ సాగుతోంది. దీంతో ఈ సీటు విష‌యంపై ఎటూ తేల‌లేదు. అయితే.. త‌మ్మినేని మాత్రం త‌న‌కుటుంబానికేన‌ని ప్ర‌చారం చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ ద‌ఫా త‌న త‌న‌యుడికి టికెట్ ఇవ్వాల‌ని కోరారు. కానీ, వైసీపీ అధినేత దానికిఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలో త‌మ్మినేని పోటీ అనివార్యంగా మారింది. ఇక‌, బ‌లాబ‌లాల ప‌రంగా చూస్తే.. 2014 ఎన్నికల్లో కూన రవికుమార్‌ తొలిసారి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

TDP's son-in-law gets hit.. Will YCP's
TDP’s son-in-law gets hit.. Will YCP’s

2019ఎన్నికల్లో ఓటమి పాలయిన రవికుమార్ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. వారి ద‌గ్గ‌ర మంచి మార్కులే వేయించుకున్నారు. ఇదే ఆయ‌న‌కు 2024లోనూ టిడీపీ టికెట్ ద‌క్కేలా చేసింది. వాస్త‌వానికి ఈ నియోజకవర్గానికి పది సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి వైసీపీ విజయం సాధించింది. అంటే.. ఒక‌ర‌కంగా టీడీపీకి ఆముదాల వ‌ల‌స కంచుకోట‌. ఈ క్ర‌మానికి తోడు.. గ‌త ఎన్నిక‌ల్లో కూన ఓడిపోయార‌న్న సింప‌తీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి.

ఈ సింప‌తీ ప‌వ‌నాల‌కు తోడు.. సీతారాం వ్య‌వ‌హార శైలి.. ఆయ‌న‌దూకుడు వంటివి ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు.. ఎలాంటి అభివృద్ధి లేక‌పోవ‌డం.. కూన‌పైనే కేసులు పెట్టినా.. ఖండించ‌లేద‌న్న వాద‌న వంటివి సీతారాం రాజ‌కీయాల‌కు మైన‌స్‌గామారాయి. అంతేకాదు, తాను అనేక సార్లు కోరినామంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డం.. కూడా సీతారాం వ‌ర్గంలో అసంతృప్తిగా ఉంది. ఈ సారి కూన గెలిస్తే.. ఖ‌చ్చితంగా చంద్రబాబు ఆయ‌న‌కు మంత్రిప‌ద‌వి ఇస్తార‌నే అండ‌ర్ క‌రెంట్ ప్ర‌చారం పుంజుకుంది. దీంతో ఆముదాల వ‌ల‌స‌లో సీతారాం రాజ‌కీయాలు ఈ సారి త‌ల‌కిందులు కావ‌డంఖాయ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?