NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఆదివారం దుండగులు కాల్పులు జరపడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబాయిలోని సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్ మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటనపై సమాచారం అందిన వెంటనే క్రైం బ్రాంచ్ తో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. ఫొరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి ఆపై మోటార్ బైక్ పై పరారయ్యారు.

కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితులన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ నుండి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈ సారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తు పెట్టుకో..తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా, సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్ ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలు మార్లు వచ్చాయి. గతంలో ఈ మెయిల్స్ ద్వారా ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది మార్చిలో వచ్చిన బెదిరింపులపై విచారణ జరిపిన మంబాయి పోలీసులు.. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరు ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది.

కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్ ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించారు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదల అయ్యారు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్ లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. 2023 ఏప్రిల్ లోనూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎక్స్ గ్రేడ్ భద్రతను వై ప్లస్ అప్ గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్ కు నిత్యం భద్రతగా ఉంటున్నారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్.. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఢిల్లీ జైలులో ఉన్నాడు.

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

Related posts

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N