NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏమైనా ఉందా? వాడుతున్నారా..??

ఆహా… అసలు వీళ్లకు ఏమైనా ఉందా? ఉంటే దాన్ని వాడుతున్నారా…? ఇదీ సామాన్యుడి ప్రశ్న. సీఎం జగన్ నేతృత్వంలో ప్రభుత్వం కరోనా తగ్గించే ప్రయత్నాలు చేస్తుంటే… ఇటు క్షేత్రస్థాయిలో నాయకులు కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఎక్కడికక్కడ నాయకులు చిల్లర పబ్లిసిటీ వేషాలతో కొత్త చిక్కులు వస్తున్నాయి. మొన్న శ్రీకాళహస్తి, నిన్న రోజా, ఈరోజు కొండపిలో వెంకయ్య… అధికార పార్టీ అనే ధీమాతో విచ్చలవిడిగా ప్రజల్లో తిరుగుతూ, మెహర్బానీ కార్యక్రమాలు చేస్తూ ప్రాణాంతక వైరస్ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు.

: శ్రీకాళహస్తిలో 40 మందికి…

చిత్తూరు జిల్లాలో ఈ నెల 15 వరకు 8 కరోనా కేసులు ఉండేవి. ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఆకస్మికంగా ఆ జిల్లా భయనకస్థితికి వెళ్ళింది. దీనికి పరోక్ష కారణం ఈ జిల్లా శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఈ నెల 12 న ఆ ఊరిలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. జనాలను పోగేసి ఊరిలో ప్రధాన రహదారులు ద్వారా ర్యాలీ చేశారు. ఆ తర్వాత ఇక్కడ కరోనా కేసులు ఆకస్మికంగా విజృంభించాయి. అప్పటి వరకు రెండు మాత్రమే కరోనా కేసులు ఉండగా… ఈ నెల 16 న కొందరు అధికారులకు బయటపడింది. అలా అల్లా ఇప్పటికి 40 మందికి ఈ ప్రాణాంతక వైరస్ వ్యాపించింది. మొన్న ఓకేరోజున 24 మందికి, నిన్న ఆరుగురికి వచ్చింది. మరో 200 నమూనాలు పరీక్షలు చేసారు, ఫలితాలు రావాల్సి ఉంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేశారు.

రోజమ్మకి పూల బాట…!

అదే జిల్లాలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా తాజాగా విమర్శలపాలయ్యారు. ఈ నెల 20న ఆమె పుత్తూరు ప్రాంతంలో ఓ బోరు ప్రారంభానికి వెళ్లారు. ఆ గ్రామ నాయకులు మెహర్బానీ గా ఆమె నడుస్తున్న దారిలో పూలను వేయించారు. నిజానికి కరోనా వేళన జనాలను పోగేయ్యడమే తప్పు అనుకుంటే… జనాలతో ఇలా చేయించడం, పైగా ఫోటోలు తీయొద్దు అంటూ నాయకులు అంటుండడం.. వీడియోల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ అయింది. తర్వాత రోజా ఎన్ని చెప్పుకున్నా, తప్పు జరిగిందనే భావన జనంలోకి వెళ్ళింది. ఆ ఊరిలో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా ఇక ఆమెదే బాధ్యతగా ఉంటుంది.

వెంకయ్య… ఇదేమిటి..?

ఇది మరీ విడ్డురం. రద్దీగా ఉంటే కరోనా వ్యాపిస్తుంది అని చెప్పడానికి, రద్దీని క్రెయేట్ చేసి మరీ చెప్పారు. కరోనాపై అవగాహన అనే పేరుతో ప్రభుత్వ, పార్టీ భజన చేస్తూ పెద్ద సభ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవరర్గం కారుమంచిలో ఆ పార్టీ ఇంచార్జి వెంకయ్య ఆధ్వర్యంలో ఇది జరిగింది. మొన్న రాత్రి 200 మంది జనాలను పోగేసి, మీటింగ్ పెట్టారు. అరగంట స్పీచ్ ఇచ్చారు. వీరిలో ఏ ఒక్కరికి కరోనా సోకినా ఎవరిది బాధ్యత?? నిజానికి ఇది అసలు అవసరం లేని సభ. తన డాబు, భారీ తనం కోసం వెంకయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ మీటింగ్ వీడియో ఇప్పుడు రాష్ట్రమంతటా వైరల్ అయింది.

పోలీసు కోరలు లేనట్టేనా…?? 

ఒకరు, ఇద్దరు రోడ్డుపై కనిపిస్తే పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. సామాన్యులను కొడుతున్నారు. కానీ ఈ పెద్దల పరిస్థితి ఏంటి? రోజా బొర్ ప్రారంభం, ఎమ్మెల్యే మధుసూదన్ ర్యాలీ, వెంకయ్య సభకి ఎవరు అనుమతి ఇచ్చారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఆ ర్యాలీ కారణంగానే కరోనా సోకింది అంటూ పార్టీపై, ప్రభుత్వంపై నేరుగా విమర్శలు వస్తున్నాయి. దీనికి బాధ్యులు మొదట ఎమ్మెల్యే, తర్వాత పోలీసులే. మరోవైపు రోజా, ప్రకాశం జిల్లాలో వెంకయ్య చేసిన ఫలితాలు కూడా అలాగే వస్తే ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి. అప్రమత్తంగాఉండాల్సిన సమయంలో ప్రచారానికి పోయి మచ్చలు చేసి వెళ్తున్నారు.

 

 

Related posts

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

Leave a Comment