NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని… త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి అందరూ చేరుతారని జోరుగా ప్రచారం చేశారు. అయితే కెసిఆర్ బస్సు యాత్ర, టీవీ9 లాంటి ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం తర్వాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి ఇదే ప్రచారం తెరపైకి వచ్చింది.

గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నారని తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబు పేలిచారు. జూన్ 5వ తేదీ తర్వాత గులాబీ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వస్తారని ఆయన తాజాగా ప్రకటించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఈ విధంగా స్పందించారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని బాంబు పేల్చారు.

దీంతో ఇప్పుడు మళ్లీ గులాబీ నేతల్లో కాస్త అలజడి నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటివరకు కడియం శ్రీహరి మరియు భద్రాచలం ఎమ్మెల్యే, దానం నాగేందర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ముగ్గురు తప్ప ఏ ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే… కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం లేరని తెలుస్తోంది. ఎందుకంటే గత నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనాల్లో క్లారిటీ వచ్చింది. కరెంటు ఉండటం లేదు, నీళ్లు రావడమే లేదు, ధాన్యం కొనడమే లేదు అని నిత్యం జనాలు రోడ్డు పైకి ఎక్కుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలేనే కాదు మంత్రులను కూడా ఎక్కడికి అక్కడ నిలదీస్తున్నారు జనాలు. ఇప్పటికే జూపల్లి కృష్ణారావును తాజాగా 6 గ్యారంటీ లపై ప్రజలు నిలదీశారు. ఇలా అడుగడుగునా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన సెగలు తగులుతున్నాయి. అటు నిరుద్యోగుల్లో కూడా అసంతృప్తి మొదలైంది. కెసిఆర్ ప్రభుత్వం కంటే దారుణంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో 15 ఎంపీలు గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ గ్రౌండ్ స్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఖమ్మం సీటు కూడా పోయేలా కనిపిస్తోంది. అక్కడ ఉన్న అగ్రనేతల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ గెలిస్తే నల్గొండ గెలిచే ఛాన్సులు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆ తర్వాత భువనగిరికి ఎక్కువగా హోప్స్ ఉన్నాయి. ఇక మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నది సత్యం.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో… రిస్క్ చేసి గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేది అవాస్తవమని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఒకవేళ అంచనాలకు మించి… పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే… కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది నిజం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ…. భవిష్యత్తు మొత్తం పార్లమెంటు ఎన్నికల ఫలితాలపైనే ఉందని అర్థం. మరి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Related posts

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

IPS AB Venkateswararao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్ .. అయిదేళ్లుగా న్యాయపోరాటం

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju

ఆ మంత్రి గెలుపు ఆశ‌లు వ‌దులుకున్నారా… వైసీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

Prajwal Revanna: బెంగళూరులో ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన సిట్ పోలీసులు

sharma somaraju

ఏపీ ఉద్యోగులు రెచ్చిపోయారు.. జ‌గ‌న్‌కు ఎఫెక్టేనా..!

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

sharma somaraju

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju