NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

మ‌రో ఆరు రోజులు. నేటి(మంగ‌ళ‌వారం) నుంచి ఈ నెల 13న పోలింగ్ జ‌రిగే నాటికి.. కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఐదేళ్ళ‌పాటు కొత్త ప్ర‌భుత్వాన్ని ఎంచుకునేందుకు.. ఏపీలో పాల‌న మార్చాలా.. లేక కొన‌సాగించాలా? అని నిర్ణ‌యించుకునేందుకు మిగిలిన స‌మ‌యం కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే. దీనిపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేయాలి? ఎవ‌రిని గ‌ద్దె నెక్కించాలని భావిస్తున్నారు.. అనేది కీల‌క అంశంగా మారింది.

ఈ కోణంలో చూసుకుంటే.. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇదే స‌మ‌యం లో ఒక పార్టీపై మ‌రోపార్టీ పైచేయి సాధించేందుకు కూడా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఓవ‌ర్ టేక్ పాలిటిక్స్ కు ఇప్పుడు ఏపీ కేరాఫ్‌గా మారిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విష‌యాన్ని టీడీపీ తెర‌మీదికి తెచ్చింది. దీనివ‌ల్ల వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల భూములు లాగేసుకుంటున్నార‌ని చెబుతోంది. ఇది ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. ముందు లైట్ తీసుకున్న వైసీపీ త‌ర్వాత‌.. అలెర్ట్ అయింది.

ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోనూ వైసీపీ నేత‌లు అల్లాడుతున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ మ‌రో విష‌యాన్ని తెచ్చి.. టీడీపీ కూట‌మిని డిఫెన్స్‌లో ప‌డేసింది. అదే మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. మైనారిటీ ముస్లింల‌కు ర‌క్ష‌ణ, రిజ‌ర్వేష‌న్ కూడా ఉండ‌బోవ‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. ఇది కూట‌మిలో టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఈ ప‌రిణామం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది.

ఇలా.. మొత్తంగా ఏపీలో అయితే.. భిన్న‌మైన రాజ‌కీయం హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వే.. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ఒపీనియ‌న్ పోల్స్‌ను సైతం తిర‌గ‌రాసేలా.. ఈ ప్ర‌జాభిప్రాయం రాజ‌కీయాలు రెండు ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే. ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌లు ఒక నిర్ణ‌యానికి రాలేద‌న్న‌ది నిర్వివాదాంశం. పైగా.. జ‌రుగుతున్న ప్ర‌చారంలోనూ.. వారికి అసంతృప్తి ఉంది.

కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు, విభ‌జ‌న స‌మ‌స్య‌లు, విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటు ప‌రం కాకుండా కాపాడుకోవ‌డం వంటివి కీల‌కం. వీటిని ఎవ‌రూ ప్ర‌స్తావించ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల నాడి.. ఇప్ప‌టికీ ఒక‌వైపే ఏక‌ప‌క్షంగా ఉంద‌నిచెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో ఆరు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో పార్టీలు వ్య‌వ‌హ‌రించే తీరు.. పైనే ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రి ఈ ఆరు రోజుల్లో పార్టీలు.. ఆయా పార్టీల అధినేత‌లు ఏం చేస్తారో చూడాలి.

Related posts

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?