NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేత‌కు జై కొడ‌తారు? అంటే .. రెండు నెలల కింద‌ట వైసీపీ అని వినిపించింది. అనేక స‌ర్వేలు కూడా.. ఇదే చెప్పాయి. కానీ, అప్ప‌ట్లోనే చెప్పుకొన్న‌ట్టు.. మేనిఫెస్టోలు వ‌చ్చాక‌.. మారుతుంద‌ని.. ప్ర‌జ‌ల నాడి వేడి పెరుగుతుంద‌ని అన్న‌ట్టుగా మేనిఫెస్టోలు వ‌చ్చాక‌.. మ‌రోసారి నాడి మారింది. వైసీపీ ప్ర‌స్తుతం ఇస్తున్న సంక్షేమాన్ని పిస‌రంత పెంచి ఇస్తాన‌ని చెబుతోంది. పెద్ద‌గా మార్పులు లేవు.

బ‌డుగులు ఆశించినంత బ్ర‌హ్మాండాలేవీ కూడా.. వైసీపీ వండి వార్చ‌లేదు. ఇక‌, టీడీపీ కూటమి పార్టీల విష‌యానికి వ‌స్తే.. ఊహించ‌నివి కూడా ఇందులో చేర్చారు. వైసీపీ మేనిఫెస్టోకు కొన‌సాగింపుగా.. కాపీగా ఉంద‌న్న ప్ర‌చారాన్ని పక్క‌న పెడితే.. చంద్ర‌బాబు ఇచ్చిన మేనిఫెస్టోలో.. క‌న‌క వ‌ర్గం.. కాసుల వ‌ర్షం కూడా కురిపించారు. తాను అధికారంలోకి వ‌స్తూ వ‌స్తూనే 4000 పింఛ‌ను ఇస్తాన‌న్నారు. ఇది తాజాగా ఆయ‌న చేస్తున్న ప్ర‌ధాన ప్రచారం.

ఇక‌, మెగా డీఎస్సీ వేస్తామ‌న్నారు. 20 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేందుకు.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణాన్ని ప్ర‌క‌టించారు. ఇది పెద్ద ఎత్తున మ‌హిళ‌ల‌ను టీడీపీ వైపు క‌నెక్ట్ చేసే అంశంగా చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల ను లెక్కిస్తే.. వైసీపీ మేనిఫెస్టో తేలిపోతోంది. దీంతో ఓట‌ర్ల నాడి మారింద‌నే చెప్పాలి. క‌ట్ చేస్తే.. ఇంకేముంది.. మాదే విజ‌య‌మ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

కానీ, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. ప‌వ‌నాలు మారుతున్నాయ‌న్న ప్ర‌చారం ఉన్నా… ఓట‌రు దేవుడు ఎవ‌రిని క‌రుణిస్తార‌నే విష‌యం మాత్రంస‌స్పెన్స్‌గానే ఉంది. ఎందుకంటే.. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో కొద్దిగా ఊపు మాత్ర‌మే ఉంది. పోనీ.. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోపై మ‌న‌సు పెడ‌దామా? అంటే.. భారీ ఎత్తున ప్ర‌క‌టించారు. దీనిని ఎలా న‌మ్మాల‌నేది.. వైసీపీ చేస్తున్న యాంటీ ప్ర‌చారం.

ఈ త‌ర‌హా ప్ర‌చారం వైసీపీపై టీడీపీ చేయ‌లేక పోతోంది. దీంతో వెంట‌నే భూములు, రేష‌న్‌కార్డులు అంటూ.. ప్రత్యేక ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చింది. అయితే.. దీనిపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం క‌లిగిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. అలాగ‌ని వైసీపీ వైపే పూర్తిగా మొగ్గు చూపించ‌డం లేదు. సో.. ఎలా చూసుకున్నా.. ప‌వ‌నాలు మ‌రుతున్నాయి కానీ.. స‌స్పెన్స్ మాత్రం కొన‌సాగుతోంది. మ‌రో నాలుగు రోజులు ఇంతే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?