NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా ? లేదా గతంలో లాగానే మళ్లీ పవన్ కళ్యాణ్ ఓడిపోతారా అని సందేహం అందరిలోనూ నెలకొంది. దీంతో ఏపీ రాజకీయాలు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా వైసిపి పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఏమాత్రం ఛాన్స్ వదులుకోకుండా… పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి వంగ గీతా కోసం కృషి చేస్తోంది జగన్ పార్టీ. అంతేకాకుండా అడుగడుగునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చుక్కలు చూపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం ను పార్టీలో చేర్చుకొని… కాపు ఓట్లను చీల్చుతోంది.

అక్కడితో ఆగకుండా నిత్యం ముద్రగడ పద్మనాభంతో ప్రెస్మీట్ లు నిర్వహించి… పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేపిస్తోంది వైసిపి. దానికి తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభం…. పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తన కూతురు తో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు వీడియోలు చేపించిందని… తన కూతురితో తననే తిట్టించారనే కోపంతో ముద్రగడ పద్మనాభం ఉన్నారు.

తన కూతురు క్రాంతి వీడియోలు బయటికి వచ్చిన తర్వాత… పవన్ కళ్యాణ్ ను మరింత టార్గెట్ చేశారు ముద్రగడ పద్మనాభం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ భార్యలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఏంటని నిలదీశారు. అలాగే పవన్ కళ్యాణ్ భార్యలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ముద్రగడ పద్మనాభం.

పవన్ కళ్యాణ్ కు నచ్చితే…. ఆయన ముగ్గురు భార్యలకు వైసీపీ పార్టీ టికెట్ ఇప్పిస్తానని సెటైర్లు పెంచారు ముద్రగడ పద్మనాభం. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. తన కూతురుతో… తనను తిట్టించారని నేపథ్యంలో… ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పై చేస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయాలు హిట్ ఎక్కుతున్నాయి.

ఇక మరో మూడు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం మధ్య మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు రోజుల్లో గెలుపు కోసం ఈ రెండు పార్టీలు ఏదైనా చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో ఏదైనా అద్భుతం జరిగితే… జరగవచ్చని… అప్పుడే ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుందో చెప్పవచ్చని తెలుపుతున్నారు.

Related posts

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju

ఆ మంత్రి గెలుపు ఆశ‌లు వ‌దులుకున్నారా… వైసీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

Prajwal Revanna: బెంగళూరులో ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన సిట్ పోలీసులు

sharma somaraju

ఏపీ ఉద్యోగులు రెచ్చిపోయారు.. జ‌గ‌న్‌కు ఎఫెక్టేనా..!

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

sharma somaraju

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?