NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన కోవై సరళ.. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే సినీ రంగ ప్రవేశం చేసిన కోవై సరళ.. హీరోయిన్ గా, లేడీ కమెడియన్ గా, సహాయక నటిగా 900 కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు తమిళ భాషల్లో ప్రధానంగా సినిమాలు చేశారు. తనదైన కామెడీ టైమింగ్ మరియు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

గౌండమణి, సెంథిల్, వడివేలు, బ్రహ్మానందం మరియు వివేక్‌తో సహా అగ్ర హాస్యనటులందరితోనూ కోవై స‌ర‌ళ జ‌త క‌ట్టారు. వడివేలు మరియు బ్రహ్మానందంతో ఆమె చేసిన కామెడీ ట్రాక్‌లు విశేష ప్రజాదరణ పొందాయి. అలాగే ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కోవై స‌ర‌ళ‌.. ఇటీవల అరణ్మనై 4 మూవీతో పలకరించారు. సుందర్‌ సి దర్శకత్వం వహించిన ఈ హర్రర్ మూవీ గత వారం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సంగతి పక్కన పెడితే.. కోవై సరళ వయసు 62 ఏళ్లు. కానీ ఇంతవరకు ఆమె వివాహం చేసుకోలేదు. ఇకపై చేసుకునే ఆలోచన కూడా ఆమెకు లేదు. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన కోవై సరళ పర్సనల్ లైఫ్ లో ఎందుకు వెనక పడ్డారు..? పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి..? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. తాజాగా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో కోవై సరళ ఓ టీవీ కార్యక్రమంలో స్పష్టం చేశారు. `జీవితంలో కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. స్వేచ్ఛ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాము. తర్వాతే బంధాలన్నీ వచ్చాయి.

ప్ర‌స్తుత స‌మాజంలో పిల్లలు ఉన్న‌ కూడా ఎంతో మంది చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. మనల్ని ఒకరు చూడాలని అనుకోవడం పెద్ద తప్పు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి` అంటూ కోవై సరళ చెప్పుకొచ్చారు. ఇక ఒకానొక సమయంలో ఆస్తి మొత్తం లాక్కుని కోవై సరళను ఆమె అక్కలు ఇంట్లో నుంచి గెంటేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల‌ పై కూడా కోవై సరళ స్పందించారు. మా అక్కవాళ్ళు చాలా మంచివార‌ని.. వారిపై తప్పుడు కథనాలు రాసినందుకు ఎంతగానో బాధపడ్డాన‌ని కోవై స‌ర‌ళ తెలిపారు. త‌న‌ను ఎవ‌రూ ఇంట్లో నుంచి గెంటేయ‌లేద‌ని.. చెన్నైలో త‌న‌కు సొంత ఇల్లు ఉంద‌ని ఆమె వెల్ల‌డించారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు: సీఈవో మీనా

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!