Paluke Bangaramayenaa February 1 2024 Episode 140: ఈ సృష్టిలో శక్తివంతమైనవి ఏంటో మీకు తెలుసా అని విశాల్ అంటాడు. పుట్టుక చావు అని రంగరాజు అంటాడు. కాదు అని విశాల్ అంటాడు.మనీ పవర్ అని వైజయంతి అంటుంది. వాటికంటే శక్తివంతమైనవి ఇంకా రెండు ఉన్నాయి అని విశాల్ అంటాడు. సరే అవేంటో నువ్వు చెప్పు అని రంగరాజు అంటాడు. ప్రేమ వైరం ఈ రెండిటి కోసమే యుద్ధాలు జరిగాయి స్వర మీద ఉన్నది అభికి ప్రేమ అయితే అభి మీద ఉన్నది నాకు వైరం చూస్తాను వాడి ప్రేమ గెలుస్తుందో నా వైర0 గెలుస్తుందో అని అంటాడు. ఇంతలో చందన రవీంద్ర అక్కడికి వస్తారు. నువ్వేంటి చందన ఎక్కడికి వచ్చావు అని వైజయంతి అంటుంది.మీరు చేసిన పనికి కొంచెం లో మా అన్నయ్య తప్పిపోయాడు లేదంటే ఏంటి మేడం అని చందన అంటుంది.
స్వర గురించి మాట్లాడేటప్పుడు విశాల్ ఉండకూడదని పంపించేస్తుంది వైజయంతి. ఇప్పుడు చెప్పు చందన అభికి ఏం కాలేదు కదా అని వైజయంతి అంటుంది. మీరిచ్చే డబ్బు కోసం నేను మీకు అనుకూలంగా మాట్లాడట్లేదు మేడం ఆ స్వర నాకు నచ్చదు కాబట్టి మీరు చెప్పినట్టు చేస్తున్నాను అంతేకానీ నా ఫ్యామిలీకి ఏమీ కాకూడదు అని చందన అంటుంది. స్వర నీ విశాల్ పెళ్లి చేసుకుంటాడని మీరు చెప్తే మా కుటుంబంతో సహా నేను బయటకు వెళ్లాను వచ్చేసరికి మా బామ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇప్పుడు మా అన్నయ్యని చంపాలని చూస్తున్నారు ఇందుకోసమేనా నేను మీకు సహాయం చేస్తున్నది ఇది తప్పు మేడం దీనికి ఒప్పుకోను అని చందన అంటుంది. నాకు డబ్బు అవసరమే మేడం కానీ మా మాలో ఎవరికైనా ఏమైనా జరిగితే మేమంతా ఒకటవుతాం మా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను అని చందన అంటుంది.
సొంత అన్నయ్య అయినట్టు అంతే మోషన్ అయిపోయావ్ ఏంటి కానీ మా వాళ్ళు ఎటాక్ చేసింది స్వరని మీ అన్నయ్య మధ్యలో వచ్చాడు జరిగింది ఏందో జరిగిపోయింది ఇంకెప్పుడూ మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ హాని కలగదు నేను నీకు మాట ఇస్తున్నాను మాకు స్వర చావు కావాలి నీకు నీ ఫ్యామిలీ కావాలి అని వైజయంతి అంటుంది. నాకు మా ఫ్యామిలీ మాత్రమే ముఖ్యం స్వరని మీరు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని చందన అంటుంది. అయితే చంపేయండి అని వైజయంతి అంటుంది. ఊరికే ఏం చేయక్కర్లేదు కోటి రూపాయలు ఇస్తాను అని వైజయంతి అంటుంది. కోటి రూపాయల అని తెల్ల మొహం వేసి చూస్తుంది చందన. అవును ఇంకా ఎన్నాళ్ల చిన్ని ఇంట్లో ఉంటారు కొత్తిల్లు కొనుక్కోండి ఇండియాలో ఉన్న అన్ని ప్లేసులు తిరిగి వచ్చేయండి నేను ఇచ్చే కోటి రూపాయలు కాకుండా ఈ ఖర్చులను నేనే భరిస్తాను అని వైజయంతి అంటుంది. ఒకసారి ఆలోచించు వైజయంతి అని రంగరాజు అంటాడు.
వాళ్ళ అవసరాలు వాళ్లకు ఉంటాయి రంగరాజు వెళ్లి తెచ్చివ్వండి అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఓబీ నెగటివ్ బ్లడ్ గ్రూపు కావాలి రా వాట్సాప్ లో కూడా షేర్ చేయరా మన ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పరా త్వరగా బ్లడ్ కావాలి అని అడుగుతాడు అభిషేక్. అలాగే రా అని శివ అంటాడు. బ్లడ్ బ్యాంకు కి కూడా ఫోన్ చేసి అడుగుతాడు కానీ అక్కడ కూడా బ్లడ్ దొరకదు. కట్ చేస్తే, రంగరాజు గారు బ్యాగు తెచ్చి చందన వాళ్లకు ఇస్తాడు. ఆ ఐదు లక్షలని చూసి సున్నాలు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు మేడం అని రవీంద్ర అంటాడు. అమ్మ అతను అంత డబ్బు హ్యాండిల్ చేయలేడు రెండు మూడో ఇవ్వండి అని రంగరాజు అంటాడు. వైజయంతి ఆ బ్యాగ్ తీసుకొని రవీంద్రా కి లక్ష ఇస్తుంది. మేడం లక్ష రూపాయల అని రవీంద్ర దీనంగా అడుగుతాడు. మీకు అదే ఎక్కువ బయలుదేరండి అని వైజయంతి అంటుంది. చందన వాళ్ళ ఆయనను తిట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే, అభిషేక్ స్వర దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు.స్వర నాకోసం నీ ప్రాణం అడ్డెసావ్ నేను ఎలాగైనా సరే కాపాడుకుంటాను అని అభిషేక్ అంటాడు. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు ఆ స్వరని చంపేస్తే కోటి రూపాయలు వస్తాయి అని చందన అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు బంగారం నేనున్నాను కదా వేసే చేద్దాం అని రవీంద్ర అంటాడు. రూమ్ ముందు మా అన్నయ్య ఉంటాడు వాడి కంట పడకుండా మనం వెళ్ళాలి అని చందన అంటుంది. స్వర ని చంపడానికి ఐసీలోకి వెళ్లిన రవీంద్ర స్వరకి పెట్టిన ఆక్సిజన్ తీసేస్తాడు.
ఇంతలో అభిషేక్ అటు నుంచి రావడంతో చందన గుండా ఆగిపోయినంత పని అవుతుంది. స్వర ఆక్సిజన్ లేక కొట్టుమిట్టాడుతుంది. అయ్యో అన్న ఈటే వస్తున్నాడు ఏంటి అని చందన రవీంద్ర కి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ కలవకపోవడంతో అభిషేక్ నుంచి తప్పించుకోవడానికి పారిపోతుంది చందన. స్వరకి ఆక్సిజన్ అందకపోవడంతో గిలగిలా కొట్టుకుంటుంది ఇంతలో అభిషేక్ వచ్చి చూస్తాడు. అభిని చూసినా రవీంద్ర భయంతో స్వర వెనుక దాక్కుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!