Categories: న్యూస్

Pegasus: మమతపై టిడిపి కుతకుత..ప్రశాంత్ కిశోర్ పైన చిటపట!ఏపీ రాజకీయాలను వేడెక్కించిన పెగాసన్!

Published by
Yandamuri

Pegasus: పశ్చిమ బెంగాల్ సీఎం మమత పై తెలుగుదేశం పార్టీ కుతకుతలాడుతోంది.మరోవైపు అమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను తెగ ఆడిపోసుకుంటోంది.

TDP slams on Mamata and Prashant Kishore Pegasus Issue

ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసన్ సాఫ్ట్ వేర్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన పెగాసన్ కు సంబంధించి చేసిన ఒక వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది.

Pegasus: అసెంబ్లీ సాక్షిగా మమత చెప్పిందేమిటంటే?

రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పెగాసన్ విషయమై చర్చ జరిగింది.దీనికి సీఎం మమతా బెనర్జీ బదులిస్తూ ఇజ్రాయిల్ కు చెందిన ఎస్ఓఎస్ అనే సంస్థ దీనిని తయారుచేసి విక్రయిస్తోందని చెప్పారు.ఆ సాఫ్ట్‌వేర్ సృష్టికర్తలు పశ్చిమబెంగాల్ పోలీసు శాఖను ఇరవై అయిదు కోట్లకు దానిని విక్రయిస్తామంటూ సంప్రదింపులు జరపగా తాము తిరస్కరించామని మమత చెప్పారు.అదే సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేసిందని వెల్లడించారు.దీంతో వైసిపి నేతలకు చేతికి పెద్ద ఆయుధం లభించినట్లయింది.అదే సమయంలో టీడీపీ ఆత్మరక్షణలో పడింది.

నాలుక పీక్కున్న నారా లోకేష్!

ఎప్పుడైతే మమతా బెనర్జీ టిడిపిపై ఈ తరహా ఆరోపణలు చేసిందో వెంటనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తెరపైకి వచ్చారు.మమత చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.”మాకు కూడా ఆ కంపెనీ ఆఫర్ చేసిన మాట వాస్తవమే ..అయితే మేము కొనలేదు” అని లోకేష్ చెప్పారు.అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి నీతిబాహ్య చర్య లను ప్రోత్సహించే బాపతు కాదని లోకేష్ పేర్కొన్నారు.ఆ సాఫ్ట్వేర్ తాము కొనుగోలు చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవారు కాదని లోకేష్ వ్యాఖ్యానించారు.ఒకవేళ తాము ఆ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి ఉంటే జగన్ ప్రభుత్వం ఈపాటికే తమను ఉతికి ఆరేసేదని కూడా ఆయన అన్నారు.

సవాంగ్ కూడా చెప్పిందదే నట!

ఈ సందర్భంలో టిడిపి నేతలుబగతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద పెగాసన్ కు సంబంధించిన సమాధానాన్ని ప్రస్తావిస్తున్నారు.కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి గత ఏడాది జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిందా అని సమాచార హక్కు చట్టం కింద పోలీసు శాఖను కోరగా డిజిపి కార్యాలయం ఆ సాఫ్ట్వేర్ ను తాము కొనుగోలు చేయలేదని జవాబిచ్చిందని చెబుతున్నారు.డిజిపి కార్యాలయం ఇచ్చిన సమాధానంతో ని దీనిపై స్పష్టత వచ్చిందని,ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని టిడిపి నేతలు అన్నారు.

ప్రశాంత్ కిశోర్ వైపు మళ్లిన వేళ్ళు!

కాగా మమతా బెనర్జీ టీడీపీ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బ్రీఫింగ్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అనేక టక్కుటమార విద్యలు ప్రదర్శించి జగన్ ను సీఎం చేయగలిగారని వారు అంటున్నారు.అదే తరహా వ్యూహాలు పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసి మమతా బెనర్జీకి తిరిగి అధికారం దక్కేలా చేశారన్నారు.దుష్ప్రచారం ద్వారా ప్రత్యర్థుల పై బురదజల్లేది ప్రశాంత్ కిషోర్ వ్యూహమని వారు అన్నారు.ప్రశాంత్ కిశోర్ ద్వారానే మమతా బెనర్జీకి కూడా టిడిపి పై తప్పుడు సమాచారం అందిందని,అదే ఆమె వెల్లడించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.అయితే ఇలాంటి దుమారం వల్ల టిడిపికి నష్టమేమీ లేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on March 19, 2022 5:24 pm

Yandamuri

Recent Posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

Rk Sagar: నటుడు సాగర్ అంటే గుర్తుకు రావడం కష్టమే. కానీ ఆర్కే నాయుడు అంటే మాత్రం తెలుగువారి మ‌దిలో… Read More

April 30, 2024

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

Ileana D'Cruz: ఇలియానా డి'క్రూజ్.. ఈ గోవా బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో… Read More

April 30, 2024

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

Breaking: విజయవాడ గురునానక్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థోపెడిక్ వైద్యుడు శ్రీనివాస్ కుటుంబంలో అయిదుగురు మృతి చెందారు.… Read More

April 30, 2024

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

Janasena: ఏపీలో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను స్వతంత్ర అభ్యర్ధులకు… Read More

April 30, 2024

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

Tenth Results: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. మంగళవారం బషీర్ భాగ్ లోని ఎస్‌సీఈఆర్‌టీ లో విద్యాశాఖ… Read More

April 30, 2024

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

Varalaxmi Sarathkumar: ప్రముఖ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరో… Read More

April 30, 2024

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

Trinayani April 30 2024 Episode 1226: ముదురు బెండవి నువ్వు అమ్మతో అలాగేనా మాట్లాడేది అని లలిత దేవి… Read More

April 30, 2024

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

TDP: తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్ధులపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన నేతలను పార్టీ నుండి… Read More

April 30, 2024

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

Naga Panchami: చిత్ర అయ్యో అక్క అలా తలుచుకున్నామో లేదో ఇలా ప్రత్యక్షమైంది పాము ఇంట్లో పాములు బాధ తగ్గింది… Read More

April 30, 2024

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: కృష్ణా మురారి కలిసి వైదేహి హాస్పిటల్ దగ్గరికి వస్తారు.… Read More

April 30, 2024

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

Mamagaru: గంగాధర్ ఫోన్ చేసి గంగా ప్లీజ్ ఒక్కసారి బయటికి రావా అని అడుగుతాడు. ముందు మీరు ఇక్కడి నుంచి… Read More

April 30, 2024

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

Guppedanta Manasu: వసుధార అయినా మను గారే ఈ హత్య చేశాడు అని మేము నమ్మాలి అంటే మరి రాజివ్… Read More

April 30, 2024

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

Malli Nindu Jabili: మాలిని అక్కడికి ఎందుకు తీసుకువెళుతుంది అని ఆలోచిస్తాడు గౌతమ్. అక్క ఆయనని మా అత్తయ్యని ఇంటికి… Read More

April 30, 2024