NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: కృష్ణా మురారి కలిసి వైదేహి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. డాక్టర్ మహేశ్వరి గారు మమ్మల్ని పంపించారని వైదేహి గారికి చెప్పండి అని కృష్ణా నర్స్ కి చెబుతుంది. వైదేహి గారి పిలుపు కోసం ఎదురు వెయిట్ చేస్తూ ఉంటారు. మేడం డాక్టర్ కృష్ణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారని నర్స్ వైదేహి తో చెప్తుంది. అప్పుడే వైదేహి కి ముకుంద కాల్ చేస్తుంది ఏంటో చెప్పు ముకుందా అని అంటుంది. కృష్ణ మురారి వచ్చారా అని అడిగితే వచ్చినట్టున్నారు అని అంటుంది. కాసేపు వాళ్ళని బయట వెయిట్ చేయమని చెప్పు నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. డాక్టర్ గారు బిజీగా ఉన్నారు కాసేపు వెయిట్ చేయమని చెప్పు అని నర్స్ కి చెప్పి పంపిస్తుంది వైదేహి. ఇప్పుడు చెప్పు ముకుందా అని అంటుంది. డాక్టర్ మహేశ్వరి నాకు కాల్ చేయడమేంటి వాళ్ళు నా దగ్గరికి రావడం ఏంటి ఇదంతా నీ డ్రామా నే కదా అని అంటుంది. ఇంతకీ నేనేం చేయాలి అని అంటుంది నువ్వు చేయాల్సింది ఉంది కాబట్టే చుట్టూ తిరిగి నీ దగ్గరికి వచ్చేలా చేశాను అని అంటుంది ముకుంద. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అని మొత్తం తన ప్లాన్ ని వైదేహి కి చెప్తుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights
Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

ఇక కృష్ణ మాత్రం పెద్ద అత్తయ్యకి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ కృష్ణ నిర్ణయం తీసుకున్నావు కదా అంతా బానే ఉంటుందిలే అని అంటాడు. సరోగసి నుంచి నేనేమీ టెన్షన్ పడట్లేదు ఇంట్లో జరిగిన సంఘటనలు ఒక్కోటి గుర్తొస్తుంటే ఇంకా ఎన్ని రోజులు నిజాన్ని దాయాలీ అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయి అని భయమేస్తుంది అని అంటుంది కృష్ణ. కొన్ని విషయాలు ఎంత ఆలోచిస్తే భయం అంత ఎక్కువవుతుంది కృష్ణ జరిగేది మనం మార్చలేము. మనకి ఉన్న అదృష్టం నువ్వు 9 నెలలు మోయకపోయినా, మనం తల్లిదండ్రులు అవ్వడమే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పెద్దలకు ఇచ్చిన మాట గురించి, ఈ విషయం రేపు పెద్దత్త కి తెలిస్తే అని అంటుంది. తెలుస్తుంది అసలు బిడ్డలు లేకుండా పోవడం కంటే ఇలాగైనా బిడ్డని అంటున్నామని అడ్జస్ట్ అవుతారు అనిఅంటాడు మురారి. ఇప్పుడు చెప్పడం కన్నా సరోగసి సక్సెస్ అయిన తర్వాత ఇంట్లో అందరికీ చెబుదాం అని అంటాడు. అంతవరకే ఇంట్లో ఏం జరిగినా నువ్వు మౌనంగా ఉండడమే మంచిది కృష్ణ అని అంటాడు. మరోవైపు ముకుంద వైదేహి కి చెప్పాల్సినంత చెప్పి సరేనా అంటుంది ఇక ఎక్కువ సేపు వాలని వెయిట్ చేయించడం బాగోదు ఇక నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights
Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

ఇక మరోవైపు భవానీ దేవి ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రేవతి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కృష్ణ ఏది రేవతి అని అంటే హాస్పిటల్ కి వెళ్ళిందంట అక్క అని అంటుంది. నీకు తెలియదా అంటే మురారి చెప్పాడు అని,ఒక్కదానివే ఎందుకు పంపించడం అని వాడి ని కూడా వెళ్ళమంటే వెళ్ళాడు. నిజంగా హాస్పిటల్ కి వెళ్ళాడు అంటావా అంటే హాస్పిటల్ కి అని చెప్పారు అని అంటుంది. కానీ భవానీ మాత్రం నాకెందుకు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లారు అని అనిపించట్లేదు. కృష్ణ కడుపుతో ఉందేమో అనిపిస్తుంది దాని కంగారు చూస్తుంటే నాకెందుకు అనుమానం గా ఉంది అని అంటుంది భవాని. ఏదైనా ఉంటే మనతో చెప్పేవాళ్ళు కదా కానీ అంటుంది రేవతి. కానీ నాకైతే మాత్రం అదే అనిపిస్తుంది వీళ్ళిద్దరూ హాస్పటల్ కి వెళ్ళారంటావా అని అంటుంది. కృష్ణకు అసలే కడుపులో ఏది దాగదు నిజమైతే చెప్పేది అని అంటుంది రేవతి. ఏమో మనకి సప్రైజ్ ఇవ్వడానికి అలా చేస్తున్నారేమో, ఒకసారి హాస్పిటల్ కి కాల్ చేసి కనుక్కుంటాను వాళ్ళ హాస్పిటల్ కి వెళ్తే,

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights
Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

కచ్చితంగా ప్రెగ్నెంట్ అయినట్టే, ఒకసారి హాస్పిటల్ కి కాల్ చేస్తానని భవాని హాస్పిటల్ కి కాల్ చేస్తుంది అక్కడికి కృష్ణ మురారి వచ్చారా అంటే వచ్చారు మేడం అని అంటే దేనికోసం వచ్చారు అంటే వాళ్ళు కృష్ణ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడానికి వచ్చారు అని చెప్తుంది దాంతో భవాని ఆనందంతో ప్రెగ్నెన్సీ గురించా అని ఒక్కసారిగా ఆనందపడుతుంది. నాకు తెలుసు అమ్మ వాళ్ళ దానికోసమే వచ్చారని నాకు చల్లని మాట చెప్పావు నిన్ను చల్లగా చూడాలి దేవుడు అని ఫోన్ పెట్టేస్తుంది. నేను చెప్పాను కదా రేవతి మన కృష్ణం ఎలా తప్పింది అని ఆనంద్ తో రేవతితో చెప్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త చెప్తారా అని నేను ఎదురు చూస్తూ ఉంటే నాకు సప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తున్నారు వాళ్ళు అని అంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్లకి నేను సప్రైజ్ ఇస్తాను చూడు అని అంటుంది. రేవతి ఆలోచిస్తూ ఉంటే ఏంటి అలా ఆలోచిస్తున్నావు కోడలు నెల తప్పిందని సంతోషం నీ ముఖంలో లేదు కదా అని అంటే, కృష్ణ నెల తప్పితే చెప్పకుండా ఎందుకు ఉంటుంది అక్క నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని అంటుంది రేవతి. రేవతి ఈ రోజుల్లో పిల్లలు ఎలా లేరు సర్ప్రైజ్ అని, ట్రీట్ అనే ఏదో ప్లాన్ చేస్తున్నారు.

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights
Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

అయినా మనం ఏం పొరపాటు పడట్లేదు కదా హాస్పిటల్ లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసమే వచ్చారని చెప్పారు కదా అని అంటుంది భవాని. ఇవన్నీ ఆలోచించొద్దు నా కోడలు తల్లి కాబోతోంది నా కోరిక నెరవేరుతుంది అని అంటుంది భవాని. అదే నిజమైతే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది అక్క అంటుంది రేవతి. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంతలో భవాని వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంది ఎవరికి అక్క ఫోన్ చేస్తున్నావు, కృష్ణక కృష్ణకు సప్రైజ్ అన్నావ్ అని అంటుంది రేవతి కృష్ణకు కాదు రేవతి నా ఫ్రెండ్స్ నా మొఖం మీద ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం చెప్తాను చూడు అని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నా కోడలు కృష్ణ తల్లి కాబోతుంది మీరు పార్టీకి రండి అని అంటుంది. ఆ మాటను చిన్నగా చెప్తావ్ ఏంటి ఇప్పుడే బయలుదేరుతున్నామని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. మధు తో కృష్ణ మురారి వచ్చేటప్పటికి ఏర్పాట్లు అన్ని పూర్తవ్వాలి అని అంటుంది ఇక సంగీత మధు ఇద్దరూ కలిసి ఫంక్షన్ కి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights
Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

ఇక మరోవైపు హాస్పిటల్లో కృష్ణ వైదేహి తో సరోగసికి మదర్ దొరకాలంటే ఎంత టైం పడుతుంది అంటే టూ త్రీ మంత్స్ పడుతుంది అంటుంది వైదేహి. అంత టైమా తొందరగా దొరికేలా చూడండి అని అంటుంది కృష్ణ మురారి ఇవాళ రేపు దొరికిన మాకు ఓకే అని అంటాడు. డబ్బులు ఎక్కువైనా పర్లేదు అని అంటాడు. ఎందుకంత తొందర పడుతున్నారు సరోగసి అంటే అంత ఆషామాషీ కాదు అని అంటుంది వైదేహి. ఒక్కొక్కసారి ఆరు నెలలు దొరికినా కూడా సరైన మొదటి దొరకపోవచ్చు అని అంటుంది. మీరు డాక్టర్ కృష్ణ మీకు తెలియదా ఇదంతా అని అంటుంది. కానీ మా సిచువేషన్ అలాంటిది అని అంటుంది కృష్ణ. సిచువేషన్ ఏదైనా ఆలోచించాలి కదా, మీ బిడ్డని తొమ్మిది నల్లి మోసి కనపయ్య అమ్మాయి కోసం ఎంతో ఓపిక ఎదురు చూడాలి మీరు అని అంటుంది వైదేహి. ఆ అమ్మాయి క్యారెక్టర్ హెల్త్ రిపోర్ట్స్ మెంటల్ కండిషన్ అన్ని చూడాలి మనం అని అంటుంది. మీరు దృష్టి పెడితే కాస్త తొందరగానే అవుతుంది అని అంటాడు మురారి. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్లకోసం సరోగసి మదరిని సెలెక్ట్ చేసాము వాళ్లకు రిక్వెస్ట్ చేసి రెండు నెలలు ఆగమని చెప్పి మీకు తొందరగా చూస్తాను అని అంటుంది.వాళ్ల వివరం నాకు ఇవ్వండి నేనే పంపిస్తాను అంటుంది కృష్ణ వాళ్ళ వివరాలు మీకు ఇవ్వకూడదు నేనే మాట్లాడతాను అని అంటుంది. మీకు తొందరగా ఉందని నాకు అర్థమైంది అందుకని పనికిరాదు అంటుంది. వాళ్ల నొప్పించడానికి నాకు కొంచెం టైం కావాలి ఈ లోగో నేను అన్ని ఫార్మాట్టీస్ పూర్తి చేస్తాను అని అంటుంది. తరగతి మదర్ గా ఒప్పుకున్న అమ్మాయి ఎవరు మేడం అని ప్రశ్న అడుగుతుంది. ఈ వివరాలన్నీ కాంప్రెషన్ గా ఉంచాలని నీకు తెలుసు కదా కృష్ణ ఒకరి గురించి ఒకరికి తెలియకూడదు కదా అని అంటుంది. నేను డాక్టర్ని కదా నా వల్ల ఏ ప్రాబ్లం రాదు అని అంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights
Krishna Mukunda Murari Today Episode April 30 2024 Episode 458 highlights

తన వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అని అంటుంది. బిడ్డని కన్న తర్వాత మీ దగ్గరికి వచ్చి గొడవ చేస్తే అందుకని ఎవరి విషయాలు ఎవరికీ చెప్పను అని అంటుంది. మేము మా దగ్గరే అమ్మాయిని ఉంచుకొని మీరు ఇచ్చిన డబ్బులు అమ్మాయికి ఇచ్చి పంపించేస్తాము మీకు బిడ్డని ఇస్తాము అంత వారికే అని అంటుంది. కానీ ఒకసారి ఆమెను చూడాలని ఉంది అంటుంది కృష్ణ. అప్పుడే ముకుంద హాస్పిటల్ కి ఎంట్రీ అవుతుంది. ముందు చూడాలని అంటారు తర్వాత కలవాలని అంటారు ముందు వాళ్ళని ఒప్పించనివ్వు తర్వాత ఆలోచిద్దాం అంటుంది వైదేహి. సరే మేడం నేను రేపొద్దున వస్తామని మురారి అక్కడి నుంచి కృష్ణను తీసుకొని వెళ్ళిపోతాడు. మురారి బిడ్డకి సరోదసి మదర్ గా వైదేహి చూసి చేసింది ముకుందని అన్న విషయం కృష్ణకు తెలియకుండా జాగ్రత్త పడతారు. బయటికి వచ్చిన కృష్ణ వాళ్ళు మనకి ఆ మదర్ ఎవరు అన్నది విషయం చెప్పరు. కానీ నేను ఊరుకోను ఆ మదర్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి, నా బిడ్డను మోసే అమ్మాయి నా పక్కన ఉంటే నా బిడ్డ నా పక్కనే ఉన్నట్టుంటుంది కాబట్టి, నేను బిడ్డను మొయ్యలేకపోతున్నానని బాధ కొంచమైనా తగ్గుతుంది కదా అని అంటుంది కృష్ణ. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కృష్ణ ముందు వాళ్ళని ఒప్పుకొని వాళ్ళు ఎవరో తెలుసుకొని నీ పక్కనే పెట్టి జాగ్రత్తగా చూసుకుందాం సరేనా అని అంటాడు. ఇక మనం ఇంటికి వెళ్దాం పద అని ఇద్దరు ఇంటికి వెళ్లి పోతారు ఇదంతా ముకుందా కూడా వింటుంది.

ఇక మరోవైపు ముకుందా వైదేహిని కలుస్తుంది.ఇప్పుడే వాళ్ళిద్దరూ వెళ్లారు అని అంటే నేను చూడలేదు కదా అంటే చూడలేదు అని అంటుంది.ఇంతకీ నేను చెప్పినట్టు చెప్పావా అంటే యాజ్ ఇట్ ఇస్ గా నువ్వు చెప్పినట్టే చెప్పాను. ఆ అమ్మాయి కొంచెం క్యూరియాసిటీగా అడిగింది. అని అంటే ఆ అమ్మాయి క్యూరియాసిటీ అలానే ఉండనివ్వు నిజం తెలిసిన రోజు కృష్ణ గుండె పగడం ఖాయం. విషయం ఇప్పుడే చెప్పొద్దు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెబుదాం అని అంటుంది ముకుందా వైదేహి సరే అంటుంది. ఇక మరోవైపు ఇంట్లో భవాని దేవి పార్టీ ఏర్పాటు చేస్తుంది. పార్టీకి అందరూ వస్తారు మధు సంగీత కలిసి డ్రింక్స్ సప్లై చేస్తుంటే రజిని వచ్చి నువ్వు వెళ్లిపో నా కూతురు ఒక్కతే డ్రింక్స్ ఇస్తుంది అని అంటుంది సరే అని మధు పక్కకు వెళ్ళిపోతాడు అప్పుడే ఆదర్శ్ వచ్చి ఏంట్రా ఈ ఫంక్షన్ అంతా అని అడుగుతాడు. నువ్వు ఇంట్లోనే ఉంటావు గానీ నీకేమీ తెలియదు బ్రో. ఇవాళ కృష్ణ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది అందుకే ఈ పార్టీ అని అంటాడు మధు. ఆ మాటకి ఆదర్శ్ కోపంతో రగిలిపోతుంటాడు. ఆదర్శ తో మాట్లాడుతూ, వచ్చినవాళ్లు ఏంటి బాబు పెళ్ళాం పోయింది కదా దిగుడుగా ఉన్నట్టున్నావ్ మీ అమ్మ నీ గురించి పట్టించుకుంటుందా లేదా అని అంటారు ఇది అక్కడికి వచ్చిన రేవతి ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు భవాని కలుదురు రండి అని తీసుకెళ్తుంది. కోడలు నెల తప్పినందుకే ఇంత హడావిడి చేస్తుంటే ఇక శ్రీమంతానికి బారసానికి ఎంత చేస్తావో అని అంటారు భవానితో ఫ్రెండ్స్. హడావిడి చేయాలి కదా పిల్లలు పుట్టలేదని మీలాంటి వాళ్ళందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, మేమేదో మాట వరస కంటే నువ్వు మనసులో పెట్టుకున్నావా అని అంటారు. ఇంతకీ మీ కోడలు ఎక్కడ అని వాళ్ళు అడిగితే హాస్పిటల్ కి వెళ్ళింది వస్తుంది అని అంటుంది భవాని. ఆమె వివరాలు ఇస్తారంటారా అని మరోవైపు కృష్ణ ఇంటికి వస్తూ మురారితో అంటుంది. ఆ అమ్మాయిని వేరే వాళ్ల కోసం చూశామని అన్నారు ఇప్పుడు మనకోసం ఒప్పుకుంటుందో లేదో అని అంటే ఒప్పిస్తానని వైదేహి అంటోంది కదా అని అంటాడు మురారి. నా గర్భసంచి పోయింది అన్న నిజాన్ని పెద్ద అత్తయ్య కి తెలిసేలోపే ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కనబోతున్నామని తెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అని అంటుంది. లేదంటే పెద్దత్తయి తట్టుకోలేదు అని అంటుంది. కచ్చితంగా వైదేహి ఇవ్వాలని ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకోగానే వాళ్ళ ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని అంటాడు. ఇక అప్పుడే దారిలో మామిడిపల్లి కనిపిస్తాయి అవన్నీ తీసుకోవడానికి మురారి కార్ ఆపుతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చినా కృష్ణా మురారిని చూసి భవాని సంతోషంతో కృష్ణ ఎదురుగా వెళ్లి కృష్ణుని హగ్ చేసుకుని ఆనందపడుతూ ఉంటుంది. మీరు సప్రైజ్ అవ్వాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను అని అంటుంది భవాని. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది కృష్ణ. మీరు చెప్పకపోయినా నువ్వు తెచ్చుకున్న మామిడికాయలే చెప్తున్నాయి నువ్వు తల్లివి కాబోతున్నావని అంటుంది భవాని. ఆ మాటకి కృష్ణ మురారి ఇద్దరు షాక్ అవుతారు. ముకుంద నవ్వుకుంటూ ఉంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella