NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ మంత్రి, జ‌గ‌న్ వీరాభిమాని సీటుకే దిక్కులేదా…!

ఆయన మంత్రి వైసిపిలో యంగ్ ఎమ్మెల్యే.. అన్నింటికీ మించి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు. జగన్ ఆయనను బాగా నమ్ముతారు. చాలా చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా గత ఎన్నికల్లో జగన్ పట్టుబట్టి మరీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. తొలిసారి గెలిసిన సదురు యువ ఎమ్మెల్యేకు జగన్ ఎక్కడా లేని ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే జిల్లాలో మంత్రికి, ఎమ్మెల్యేలకు, సీనియర్లకు మించిన ప్రాధాన్యత ఆ యువ ఎమ్మెల్యేకు దక్కింది.

YSP Minister, Jagan Veerabhimani
YSP Minister Jagan Veerabhimani

అనూహ్యంగా జగన్ కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కింది. వైసీపీలో కీలక నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఆ యువ‌ ఎమ్మెల్యేకు ఉంది. అలాంటి ఓ ఎమ్మెల్యే కు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు వస్తుందా ? అంటే డౌట్ గానే ఉంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీ సీటును మలసాని భరత్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కు ఇచ్చేశారు. భరత్ కుమార్ రాజకీయాలకు కొత్త. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

మూడో జాబితాలోనే పార్టీ అధిష్టానం ఈ విషయం వెల్ల‌డి చేసింది. ఆ తర్వాత మరో మూడు జాబితాలు మొత్తంగా వైసిపి నుంచి ఆరు జాబితాలు వచ్చాయి. ఇందులో అమర్నాథ్ పేరు ఏ జాబితాలోనూ లేదు. పైగా ఆయన ఎలమంచిలి, చోడవరం, పెందుర్తి సీట్లను ఆప్షన్ గా ఉంచుకున్నారు. అయితే ఈ మూడు సీట్లలో సెట్టింగ్ ఎమ్మెల్యేలను కద‌పకూడదని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మార్చినా కూడా గుడివాడకు అక్కడ సీటు ఇవ్వ‌ర‌ని ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్ గాజువాక నియోజకవర్గ ప్రాంతంలో ఉంటున్నారు.

YSP Minister, Jagan Veerabhimani
YSP Minister Jagan Veerabhimani

చివరకు గాజువాక సీటు అయిన ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకుంటే అక్కడ మరో ఇన్‌చార్జ్‌ని తెచ్చిపెట్టారు. అయితే అనకాపల్లి పార్లమెంటు నుంచి అమర్నాథ్ 2014లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడ విపక్షాలు కాపు సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితేనే గుడివాడను ఎంపీగా పోటీ చేయిస్తారని లేకపోతే అక్కడ కూడా ఛాన్స్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కథ‌ ఇలా ఉండటం వైసిపి వర్గాలనే ఆశ్చర్యపరుస్తుంది. జ‌గ‌న్ తాను న‌మ్ముకున్న అనుచ‌రుడికి
ఎలా న్యాయం చేస్తారో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!

సోమిరెడ్డికి షాక్.. హింట్ ఇచ్చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ జంపింగ్‌కు స‌ర్వేప‌ల్లి సీటు..!

జ‌న‌సేన‌లో ఫ్యామిలీ ప్యాకేజ్‌.. ఆ న‌లుగురు బ్ర‌ద‌ర్స్‌కు టిక్కెట్లు ఫిక్స్‌..!