NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 12 2024 Episode 1176: అనుని దెపి పొడిచిన దివ్య,  నిజం తెలిసిన రోజు బాధపడతావు దివ్య అంటున్న అను..

Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights

Prema Entha Madhuram February 12 2024 Episode 1176: అను దేవుడికి దీపం పెడుతుంది. ఈ ఆనందం మూమెంట్లో ఒక సెల్ఫీ దిగుదామా అని యాదగిరి అంటాడు. దివ్య నువ్వు కూడా రామ్మా అని ఆర్య అంటాడు. నేను ఇప్పుడు సెల్ఫీలు దిగి చూసుకునే అంత ఆనందంలో లేను అని దివ్య అంటుంది. అలా అంటే ఎలా దివ్య అని మర్చిపోవాలి అని అను అంటుంది. నీలాగా  పాత మొగుణ్ణి మర్చిపోయి కొత్త మొగుడుతో ప్రేమగా ఉండలేను అని దివ్య అంటుంది. దివ్య ఇంతకు ముందులాగా మాట్లాడకు ఇప్పుడు తను మీ వదిన అని ఆర్య అంటాడు. అప్పుడే వెనకేసుకు ని మాట్లాడుతున్నావా అని దివ్య అంటుంది. నిన్నటి వరకు నా హరీష్ గొప్పోడు సూట్ ఏసుకుంటే హీరోలా ఉంటాడని గొప్పలు పోయావు కదా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్ నీ బ్రతుకు బండలు కాకుండా బయటపడ్డావని సంతోషించక ఎందుకు ఆ ఏడుపు అని యాదగిరి అంటాడు. నేను కొంతమంది లాగా రంగులు మారుస్తూ నటించలేను నిన్నటి వరకు పాత మొగుడు కోసం ఏడ్చింది ఈరోజు కొత్త మొగుడితో ఆనందంగా నవ్వుతుంది అలాంటి ప్రేమ నాది కాదు అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights
Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights

దివ్య నోటికొచ్చినట్టుల్లా మాట్లాడకు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలిసే రోజు వస్తుంది ఈ పెళ్లి వల్ల నాకు నా పిల్లలకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంకెప్పుడూ ఇలా నోరు జారకు ఆ తర్వాత బాధపడాల్సి ఉంటుంది అని అను అంటుంది. దాని మాటలకి ఏం కానీ  ఉష జ్యోతి వదినని లోపలికి తీసుకువెళ్లండి అని సుగుణ అంటుంది. అందరూ లోపలికి వెళ్లి పోతారు. సీతారాముల లాంటి మీరు ఎన్నో కష్టాలు పడి ఈ పెళ్లి వల్ల మళ్ళీ దగ్గరయ్యారు సార్ ఇకమీదట మీరు ఆనందంగా ఉండాలి ఉంటారు అని యాదగిరి అంటాడు. కట్ చేస్తే, ఎవరో ఒక చిన్న పాప బట్టలని సర్దుకుంటూ ఆర్య ఫోటోని పట్టుకొని నాన్న నీకోసం వచ్చేస్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి పట్టుకుంటాను ఇకమీదట నీతోటే కలిసి ఉంటాను అని అంటుంది.భగవంతుడా మా నాన్నని కలిసిపోవడానికి వెళుతున్నాను తను నాకు దొరికేలా చెయ్యి అని భగవంతుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో నుంచి వెళుతుంది ఆ పాప.

Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights
Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights

కట్ చేస్తే, మీ ప్రేమ చాలా గొప్పది సార్ అందుకే నేను ఎంత దూరంగా వెళ్లిపోయిన మళ్లీ దగ్గర అయ్యి మనం ఒకటయ్యాం అని అనుకుంటుంది అను. అను నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నాకు నమ్మకం నా నమ్మకమే నిజమై నువ్వు నాకు దొరికావు ఇక నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను అని ఆర్య అనుకుంటాడు.ఇద్దరూ పరుగెత్తుకొచ్చి ఒక దగ్గర నిలబడతారు. ఆర్య ని చూసిన అను పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకుంటుంది. అను నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నేను అనుకునేవాన్ని నీకోసం ఎంతగానో ఎదురు చూశాను అను ఇన్నాళ్ళకి మళ్లీ నాకు దొరికావు అని ఆర్య అంటాడు. ఒక చిన్న అబద్ధం వల్ల మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాను మీ ప్రేమ చాలా గొప్పది సార్ అందుకే మనిద్దరం మళ్ళీ కలుసుకున్నాం అని అను అంటుంది. ఇక ఎప్పటికీ మనం దూరం కాకూడదు అను అని ఆర్య అంటాడు. ఏ కష్టం వచ్చినా కానీ ఇద్దరం కలిసి ఎదుర్కొందాం సార్ ఇకమీదట ఎప్పుడూ అలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights
Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights

వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.ఆర్య గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది అను . ఇంతలో పిల్లలు వచ్చి సౌండ్ చేస్తారు. వాళ్లను చూసి దూరం జరిగి పిల్లల్ని దగ్గరికి రమ్మని పిలుస్తారు. అమ్మానాన్న మిమ్మల్ని కలపడానికి ఎంతగానో కష్టపడ్డాం మా వల్లే మీరు కలిశారు ఎప్పటికీ ఇలాగే మనం ఆనందంగా ఉండాలి అని అక్కి అంటుంది. అవును పిల్లలు నీ వల్లనే మేము ఇద్దరం కలిసాము చాలా థాంక్స్ అని ఆర్య అంటాడు. థాంక్స్ ఒక్కటేనా అని అక్కి అంటుంది. ఆర్య అను అభాయ్ కి ముద్దు పెడతారు. అక్కికి ముద్దు పెడుతూ ఉండగా అక్కి పక్కకు తప్పుకోగానే ఆర్య అను తలలు రెండు గుద్దుకుంటాయి. అమ్మ నాన్న తలని మళ్ళీ ఢీకొట్టు లేదంటే కొమ్ములు వస్తాయి చూడడానికి బాగోదు అని అక్కి అంటుంది. ఇంత పని చేస్తావా అని అనులేచి అక్కిని పట్టుకో పోతుంది అక్కకి పరిగెడుతుంది. వాళ్లు అలా సంతోషంగా ఉండడం చూస్తుంది దివ్య. ఆర్య అక్కిని పట్టుకుంటాడు అను అభాయ్ ని ఊళ్ళో కూర్చోబెట్టుకొని నలుగురు నవ్వుకుంటూ ఆనందంగా ఉంటారు. మీరు ఇంత ఆనందంగా ఎలా ఉంటారు నేను చూస్తాను అని దివ్య  వాళ్లను చూసి అనుకుంటుంది.

Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights
Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights

కట్ చేస్తే, ఆర్య వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం స్వీట్లు బట్టలు బంగారం అన్ని పని వాళ్ళతో కారులో పెట్టించి హడావుడి చేస్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు మనం అక్కడికి వెళ్లడం అవసరమంటావా వాళ్లు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తాం అని జెండి అంటాడు. పొదడి నుంచి వర్కర్స్ ని తిప్పలు పెడుతుంది జెండి అన్నయ్యని వదినని చూడాలని ఆరాటం అమ్మది అని నీరజ్ అంటాడు. అణువల్ల అత్తగారి అని చెబుదాము అని వాళ్ళ అమ్మ అంటుంది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమోనమ్మా అప్పుడే మనం వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అని జెండి అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights
Prema Entha Madhuram Today Episode February 12 2024 Episode 1176 Highlights

మాకు మాత్రం పిల్లల్ని అన్న వదినల్ని చూడాలని ఉండదా అమ్మ అని రాజ్ అంటాడు.నాకు అదంతా ఏమీ తెలియదు కేశవ అక్కడికి వెళ్ళాక మీరేం చెప్తారో ఏమో నాకు తెలియదు నేను మాత్రం వాళ్ళని వెంటనే చూడాలి అని వాళ్ళ అమ్మ అంటుంది.అను ఇల్లు వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళు అవుతుంది ఈ ఇంటి  వారసులుగా పెరగవలసిన పిల్లలు ఎక్కడో అనాధల పెరిగారు వాళ్ళని నేను వెంటనే చూడాలి అని వాళ్ళ అమ్మ అంటుంది.నేను అక్కడ ఏదో ఒకటి మేనేజ్ చేస్తాంలే జెండి అని రాజ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N