NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్ గెలుపు ముందే ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌… అక్క‌డ చేతులెత్తేసిన‌ట్టే..!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ముందుగానే ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంటే వాళ్లు ఎంత పెద్ద తోపు లీడ‌ర్లు, టాప్ లీడ‌ర్లు అయినా కూడా జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేయ‌డ‌మో లేదా స్థాన‌చ‌ల‌నం చేయ‌డ‌మో చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీలో కాస్త దూకుడుగా లీడ‌ర్‌గా పేరున్న అనిల్ కుమార్ యాద‌వ్‌నే అసెంబ్లీ రేసు నుంచి త‌ప్పించేశారు. నెల్లూరు సిటీలో అనిల్ వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ సారి అనిల్ నెల్లూరు సిటీలో తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతున్న ప‌రిస్థితి. పైగా ఆయ‌న సొంత బాబాయ్ కూడా అనిల్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీలో బ‌లంగా ఉన్న రెడ్డి నేత‌లు, చివ‌ర‌కు ఎంతో సౌమ్యుడిగా పేరున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి సైతం అనిల్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన ప‌రిస్థితి. అస‌లు గ‌త ఎన్నిక‌ల్లోనే నారాయ‌ణ‌పై అనిల్ కేవ‌లం 1200 ఓట్ల స్వ‌ల్ప తేడాతో గ‌ట్టెక్కారు.

ఈ ఐదేళ్లలో అనిల్ కావాల్సినంత వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సారి అనిల్ నెల్లూరు సిటీలో ఓడిపోతాడ‌నే తెలిసే జ‌గ‌న్ న‌ర‌సారావుపేట పార్ల‌మెంటుకు మార్చారు. ఇక ఇప్పుడు నెల్లూరు సిటీలో టీడీపీ అభ్య‌ర్థి నారాయ‌ణ గెలుపు ప‌క్కా అన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేతగా నారాయ‌ణ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యం అక్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో మంత్రిగా ఉండి గెలుపు చివ‌రి అంచుల వ‌ర‌కు వెళ్లిమ‌రి నారాయ‌ణ ఓడిపోయారు.

ఒక‌ప్పుడు మంత్రిగా నెల్లూరు జిల్లాలో చ‌క్రం తిప్పిన అనిల్ ఇప్పుడు జిల్లాలో ఒంట‌రి అయిపోయారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై బలమైన ప్రభావం చూపగల ఆనం, కోటంరెడ్డి టీడీపీలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దూరమవుతున్న సంకేతాలు వ‌చ్చేశాయి. గ‌త ఎన్నిక‌ల్లో నారాయ‌ణ‌కు 46 శాతం ఓట్లు వ‌స్తే, అనిల్‌కు 47 శాతం ఓట్లు వ‌చ్చాయి. జ‌న‌సేన అభ్య‌ర్థికి 3 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు జ‌న‌సేన + టీడీపీ పొత్తుతో కాపు ఓటింగ్ టీడీపీకి మొగ్గు చూప‌నుంది.

ఇక నారాయ‌ణ‌పై పెట్టిన కేసులు, గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి సానుభూతి, మంత్రిగా ఉన్న‌ప్పుడు చేసిన అభివృద్ధి ఇవ‌న్నీ ఈ సారి నారాయ‌ణ‌కు తిరుగులేని మెజార్టీతో గెలిపించే వాతావ‌ర‌ణ‌మే ఇప్పుడు నెల్లూరులో క‌నిపిస్తోంది. వాస్త‌వానికి గ‌త నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేదు. వైసీపీలో ముస‌లం మొద‌ల‌వ్వ‌డంతో పాటు గ‌త ఐదేళ్ల‌లో సిటీలో ప‌నులు పూర్తిగా ఆగిపోవ‌డంతో వైసీపీకి పూర్తిగా రివ‌ర్స్ అయిపోయింది. ఏదేమైనా జ‌గ‌న్ ఇక్క‌డ అనిల్‌ను త‌ప్పించ‌డంతోనే నారాయ‌ణ గెలుపు ముందుగానే క‌న్‌ఫార్మ్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!

సోమిరెడ్డికి షాక్.. హింట్ ఇచ్చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ జంపింగ్‌కు స‌ర్వేప‌ల్లి సీటు..!

జ‌న‌సేన‌లో ఫ్యామిలీ ప్యాకేజ్‌.. ఆ న‌లుగురు బ్ర‌ద‌ర్స్‌కు టిక్కెట్లు ఫిక్స్‌..!