NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఆగస్టు 16న ఏం జరగనుంది..??

 

ఆగస్టు 16వ తేదీ.. ఏపీలో కీలకం కాబోతుందా?. ఏపీ రాజకీయం, ఏపీ రాజధాని వ్యవహారంలో ఆ తేదీ ఒక చారిత్రక అంశంగా మిగిలిపోతుందా?. ఇంతకూ ఆగస్టు 16 కు అంత ప్రాధాన్యత ఎందుకు? ఆ రోజు ఏం జరగనుంది అనేది ఒక్కసారి చూద్దాం.

What will happen on August 16th

కోర్టులో క్లియరెన్స్ వస్తే రాజధానికి అంకురార్పణ ఆ రోజే..!

రాజధాని తరలింపు విషయంలో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. యధాతథ స్థితి లో ఆలా నిలిపివేసి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అయితే ప్రభుత్వం మాత్రం హైకోర్టుతో లాభం లేదనుకొని సుప్రీంకోర్టు వరకు వెళుతుంది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేసి తమకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ కు రానుంది. అంతా అనుకున్నట్టు జరిగితే సుప్రీంకోర్టు రాజధాని తరలింపునకు అనుమతులు ఇస్తుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎత్తివేస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరుగుతుందని భావించి ఆగస్టు 16వ తేదీన విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. అందుకు సంబందించి ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా మంత్రులతో పాటు తెర వెనుక విజయసాయి రెడ్డి, సీఎం పేషీ నుండి కీలక అధికారులు కూడా విశాఖలో తిష్ట వేసి కార్యక్రమాలను నడిపిస్తున్నారు. రాజధానికి శంకుస్థాపనకు అవసరమైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు సీఎం కార్యాలయం, క్యాంపు కార్యాలయం, పరిపాలనా భవనం తదితర తాత్కాలిక భవనాలను చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల లోనూ ఆగస్టు 16 వ తేదీ అమరావతి నుండి పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.

టిడిపీ పతనానికి నాంది ఆ రోజేనా?

రాజధాని తరలింపుతో అమరావతిలో రాజధాని అనే అంశం ఇక ముగిసిపోతుంది. అంటే టీడీపీ ముద్ర, టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలను జగన్ దాదాపు చెరిపేసినట్లే. ఇక అదేరోజున టీడీపీకి కీలకంగా ఉన్న నాయకులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీని మరింత బలహీన పర్చాలని జగన్ భావిస్తున్నారు. అందుకే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగస్టు 16వ తేదిన్నే జగన్ కు మద్దతు పలుకుతారని అయన అనుచరులు కొంత మంది మాజీ ఎమ్మెల్యే లు ఇద్దరు వైసీపీలో చేరుతారని అనుకుంటున్నారు. వారితో పాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ తో పాటు ఉత్తరాంధ్రకే చెందిన మరో మాజీ మంత్రిని కూడా వైసీపీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. డానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అంటే ఓ వైపు రాజధాని శంకుస్థాపన, మరో వైపు టీడీపీ కీలక నాయకులను వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని నైతికంగా దెబ్బతీయవచ్చు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.

Related posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?