NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP : రఘురామకృష్ణ కు బీజేపీ షాక్!

BJP : రఘురామకృష్ణ కు బీజేపీ షాక్!

BJP : ఇటు వైఎస్ఆర్ సిపి తరపున గెలుపొంది ఢిల్లీలో మాత్రం  బీజేపీ BJP అనధికారిక ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణంరాజు కు హైకోర్టు షాక్ ఇచ్చింది. దేశరాజధానిలో రోజూ పంచాయితీ పెట్టుకొని, మీడియా ని పిలిపించుకొని మరి రాష్ట్ర రాజకీయాలపై ఇక్కడి పరిస్థితులపై వ్యాఖ్యలు చేస్తూ వైయస్సార్సీపి కు తలనొప్పిగా మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అటు గట్టి దెబ్బే. తాజాగా ఆయన మీద గతం లో నమోదైన బ్యాంకు మోసాల కేసును సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని కోర్టు పచ్చజెండా ఊపడంతో ఎంపీకు కొత్త కష్టం వచ్చి పడింది.

BJP Raghu Ramakrishna Raju goes to cbi office
BJP Raghu Ramakrishna Raju goes to cbi office

కుటుంబంపై సీబీఐ విచారణ జరపొచ్చు!

ఇంద్ – భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్, వైకాపా ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు తో పాటు ఆయన భార్య రమాదేవి బంధువు ప్రియదర్శిని లకు సంబంధించి బ్యాంకు మోసాలపై సిబిఐ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మోసపూరిత ఖాతాల ప్రకటనలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులను ఆదేశించింది. ఆర్బీఐ సర్క్యులర్ ఆధారంగా మోసపూరిత ప్రాంతాలుగా బ్యాంకులు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో ఈ అంశాన్ని సైతం జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ ని ఆదేశించింది. సర్క్యులర్ ను సవాలు చేస్తూ ఇంద్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ రఘురామకృష్ణంరాజు లు ఆయన భార్య రమాదేవి కుమార్తె ఇందిరా ప్రియదర్శిని లు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బి విజయ సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

గతంలోనూ ఇంతే!

ఈ కేసు విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది విక్రమ్ వాదనలు వినిపిస్తూ గతంలో బిఎస్ఎన్ఎల్ లిమిటెడ్ కు చెందిన కేసులో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మోసపూరిత ఖాతాలు గా ప్రకటించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు ప్రకటించడాన్ని ఆయన గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో పిటిషనర్ లకు చెందిన ఖాతాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని బ్యాంకులను ఆదేశించింది. అలాగే గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే బ్యాంకింగ్ మోసాలపై విచారణ చేస్తున్న సీబీఐ మాత్రం దర్యాప్తును కొనసాగించవచ్చని నోటీసులు జారీ చేసింది.

హాజరు అవుతారా?

దీంతో కీలక దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖచ్చితంగా దర్యాప్తులో వారి వివరణలు తీసుకోవాలని, వారు చెప్పే విషయాలను కేసు దర్యాప్తు పనిచేస్తాయని సిబిఐ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఈ వారంలోనే ఎంపీ కు నోటీసులు జారీ చేసి విచారణ అని పిలుస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఈ కేసు ఆర్థిక నేరాలకు సంబంధించిన ది కావడంతో సిబిఐ ప్రత్యేక విభాగం దీని బాధ్యతలను చూస్తోంది. అయితే దీనిపై సీబీఐ అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కోర్టు ఉత్తర్వులు అందుకున్న తర్వాత న్యాయనిపుణులతో చర్చించి ఎంపీ కు, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లో పంచాయతీ లు పెట్టి రోజుకో రచ్చబండ అంటూ హడావుడి చేసిన వైకాపా ఎంపీ కు ఎప్పుడు సిబిఐ గడప తొక్కే పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తోంది.

 

Related posts

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?