Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas జీల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యాం” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత… “సాహో” ప్లాప్ అయిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా సినిమాల్లో పూజాహెగ్డే ఉండటంతో పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా రేపు రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుండగా తాజాగా “రాధేశ్యాం” డైలాగ్ సోషల్ మీడియా లో లీక్ అవ్వటం సినిమా యూనిట్ లో కలకలం రేపింది. మరోపక్క డైలాగ్ విని ప్రభాస్ అభిమానులు పూనకాలు తెచ్చుకుంటున్నారు.
ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా… లీక్ అయిన డైలాగ్ కూడా అదే తరహాలో ఉండటంతో ప్రభాస్ అభిమానులు రేపటి దాకా ఆగేలా కనబడటం లేదు. “ప్రేమ కోసం రోమియో చనిపోయాడు మనం అలా కాదు” అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ “రాధేశ్యాం” సినిమా డైలాగ్ వైరల్ అవుతుంది. నిమిషం నిడివి కంటే తక్కువ ఉన్న ఈ డైలాగ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. మరో పక్క ఈ సినిమాతో కచ్చితంగా విజయం సాధించాలని హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే రేంజ్ లో యాక్షన్ సినిమా తీయాలని ఫెయిల్ అయిన ప్రభాస్ రొమాంటిక్ కథ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడానికి “రాధేశ్యాం” సినిమాని బరిలోకి దింపుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!