NewsOrbit
న్యూస్

అలా అయితే లెక్కింపు కష్టం

ఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఒకవేళ వీటి లెక్కింపును పెంచితే గనుక మొత్తం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని ఈసి పేర్కొంది.

ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వివి ప్యాట్‌లను లెక్కించేలా ఈసికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దాదాపు 21 పార్టీల నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 25 వ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం వివిప్యాట్‌ స్లిప్పులను లెక్కించడంలో ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఏప్రిల్ 1 వ తేదీకి వాయిదా వేసింది.

దీంతో నేడు ఈసి తమ స్పందన తెలియజేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న విధానం సరైందేనని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని ఈసి వెల్లడించింది.  50 శాతం స్లిప్‌లను లెక్కించాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో  పేర్కొంది.

ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో ఒక్క వివి ప్యాట్‌ను మాత్రమే ఎంచుకుని దానిలోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తున్నారు. దీనివల్ల ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓటరు స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు. ఇంత తక్కువ మొత్తంలో స్లిప్పులు లెక్కిస్తే కచ్చితత్వం తెలియదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

Related posts

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

Leave a Comment