NewsOrbit
రివ్యూలు

`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రివ్యూ

బ్యాన‌ర్‌: ఎ జీవీ ఆర్‌జీవీ ఫిలింస్‌
న‌టీన‌టులు: విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
ప్రొడ్యూసర్ :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ, న‌రేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు
                                                         ఈ మ‌ధ్య వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలిచిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అస‌లు సినిమా విడుద‌ల‌వుతుందా?  లేదా? అనే స‌స్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ.. అనేక అడ్డంకుల‌ను దాటి.. విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. రేపు అంత‌టా రిలీజ్ అని అనుకుంటున్న త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ హైకోర్టు మెలికపెట్టింది. ప్ర‌త్యేక క‌మిటీ ఓకే చెప్పిన త‌ర్వాతే సినిమాను విడుద‌ల చేయాల‌ని తీర్పు ఇచ్చింది. సినిమాను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. దీంతో సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌ల కాలేదు. తెలంగాణ రాష్ట్రం, ఓవ‌ర్‌సీస్‌లో విడుద‌లైంది. ఇన్ని వివాదాలు, విమ‌ర్శ‌లు ఈ సినిమాను చుట్టుముట్టడానికి కార‌ణం ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఆ పరిమిత కథతో తీసిన సినిమా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ విడుల కావడం అంటే వివాదం కాక ఇంకేముంటుంది. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్రీ ప‌బ్లిసిటీయే ద‌క్కింది. అస‌లు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు భయ‌ప‌డినట్లు ఈ సినిమాలో ఏదైనా గోప్య స‌మాచారం ఉందా?  లేదా?
క‌థ‌:
ఇదేం కొత్త క‌థ కాదు.. చాలా మందికి తెలిసిందే.. 1989లో ముఖ్యమంత్రి ప‌దవిని కోల్పోయిన ఎన్టీఆర్‌(విజ‌య్ కుమార్‌) ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఒంటరిగా బ్ర‌తుకుతుంటారు. అలాంటి త‌రుణంలో లక్ష్మీ పార్వ‌తి(య‌జ్ఞ‌శెట్టి) ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర రాస్తాన‌ని ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. విద్యావంతురాలైన ఆమె గురించి తెలుసుకుని ఆమెకు త‌న చ‌రిత్ర‌ను రాసే అనుమ‌తి ఇస్తారు ఎన్టీఆర్‌. అయితే ఇద్ద‌రిపై దుష్ప్ర‌చారం మొద‌లవుతుంది. దాంతో ఎన్టీఆర్ మేజ‌ర్ చంద్ర‌కాంత్ స‌క్సెస్ ఫంక్ష‌న్‌లో ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు బాబురావ్‌(శ్రీతేజ్‌), ఓ ప‌త్రికాధినేత‌తో క‌లిసి ఎన్టీఆర్‌, ల‌క్ష్మీ పార్వ‌తిపై చెడు ప్ర‌చారం మొద‌లు పెడ‌తారు.  ఆ లోపు 1994 ఎన్నిక‌లు వ‌స్తాయి. ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తితో క‌ల‌సి ప్ర‌చారం చేసి మ‌ళ్లీ విజయం సాధించి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. అయితే త‌ర్వాత బాబూరావ్ త‌న తెలివి తేట‌లు, కుట్ర‌ల‌తో కుటుంబ స‌భ్యుల‌ను కూడా త‌న వైపు తిప్పుకుంటాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చి లాక్కుంటాడు. ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొన్న ఎన్టీఆర్ చివ‌ర‌కు వైస్రాయ్ ఘ‌ట‌న‌లో చెప్పుల దాడి త‌ర్వాత కుమిలి కుమిలి చ‌నిపోతాడు.
విశ్లేష‌ణ‌:
ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారి ఎన్టీఆర్‌గా న‌టించిన వ్య‌క్తి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌. రంగ‌స్థ‌ల న‌టుడైన విజ‌య్‌కుమార్‌ను వ‌ర్మ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం ఎంచుకుని ఆస‌క్తిని పెంచాడు. పాత్ర ప‌రంగా, న‌ట‌న ప‌రంగా విజ‌య్‌కుమార్ అద్భుతంగా న‌టించాడ‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, డైలాగ్ డెలివ‌రీ ఇలా అన్నింటినీ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు త‌న న‌ట‌న‌తో. ఇక ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌లో న‌టించిన య‌జ్ఞ‌శెట్టి ఒక‌ట్రెండు సినిమాలు న‌టించినావిడే. ప్రేమ‌, అమాయ‌క‌త్వం, బాధ‌, వేద‌న‌, అవ‌మాన భారం ఇలాంటి భావాల‌ను చ‌క్క‌గా తెర‌పై ప‌లికించారామె. ఇక ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్రీతేజ్‌.. కుట్ర‌లు సాగించే బాబూ రావ్ పాత్ర‌కు త‌న‌దైన స్ట‌యిల్లో న‌ట‌న‌తో ప్రాణం పోవాడు. మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు. వ‌ర్మ త‌ను సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం నిజాల‌ను ప్రేక్ష‌కుల ముందు ఉంచే ప్ర‌య‌త్నం చేశాడు. ఎన్టీఆర్ ఒంట‌రిగా ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ల‌క్ష్మీ పార్వ‌తితో ప‌రిచ‌యం పెళ్లి వ‌ర‌కు ఎందుకు దారి తీసింది. ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీ త‌ర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో వ‌చ్చిన క‌ల‌హాలేంటి? ఎన్టీఆర్ కుటుంబంపై కుట్ర‌లు చేసింది ఎవ‌రు?  చివ‌ర‌కు ఎన్టీఆర్ వెన్నుపోటుకు కార‌ణ‌మైన వ్య‌క్తి ఎవ‌రు? అనే విష‌యాల‌ను వ‌ర్మ ఎలివేట్ చేశారు. బ‌యోపిక్‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా చూపించాడు. పాత్ర‌ల కోసం కొత్త వారిని ఎంపిక చేసుకోవ‌డంలోనే స‌క్సెస్ సాధించాడు వ‌ర్మ‌. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని బాగానే ఉన్నాయి. అయితే సినిమా నెమ్మ‌దిగా సాగ‌డంతో సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోయే అవ‌కాశం ఉంది. ఇక తెలుగు దేశం పార్టీ వారికి, నాయ‌కుల‌కు, క‌మ‌ర్షియ‌ల్ సినిమా ల‌వ‌ర్స్‌కు సినిమా పెద్ద‌గా రుచించ‌క‌పోవ‌చ్చు.
బోట‌మ్ లైన్‌:
 ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. ఎన్నిక‌ల చిత్రం
రేటింగ్‌: 2.5/5

Related posts

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Leave a Comment