NewsOrbit
Entertainment News Telugu Cinema రివ్యూలు సినిమా

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

Lambasingi movie review

Lambasingi movie review ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ‘లంబసింగి’. ఈ సినిమాకి ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఈ మూవీని నిర్మించారు. నవీన్ గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ మార్చి 15 న అనగా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం..

Lambasingi movie review
Lambasingi movie review

కథ విషయానికి వస్తే.. హీరో వీరబాబు(భరత్ రాజ్) లంబసింగి అనే ఊరిలో కానిస్టేబుల్. ఆ ఊరిలో హీరోయిన్ హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురని అతనికి తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో హరిత తండ్రి ఒకరు. వారితో పోలీసులు రోజూ సంతకాలు చేయించుకొని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. అయితే ఈ పనిని హీరోకి అప్పగిస్తారు.హీరోయిన్ ని ప్రేమలో పడేయడానికి అతను రోజూ ఆమె తండ్రి సంతకం కోసం వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత ఆ ఊర్లోనే నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి బాగా దగ్గరవుతాడు వీరబాబు. దీంతో అదే మంచి టైం అని భావించి హరితకి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. హరితకి ప్రేమిస్తున్న సంగతి చెప్పగా ఆమె అందుకు అంగీకరించదు. దీంతో నిరాశకు లోనైన వీరబాబు.. ఓ రోజు అతను మాత్రమే డ్యూటీలో ఉండగా.. కొంతమంది నక్సలైట్లు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. ఆ దాడిలో వీరబాబుకి ఊహించని విధంగా షాక్ తగులుతుంది. అదేంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు ఒప్పుకోలేదు? హరిత గతం ఏంటి? అనేది మాత్రం ఖచ్చితంగా తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Lambasingi movie review
Lambasingi movie review

సినిమా ఎలా ఉందంటే… డైరెక్టర్ నవీన్ గాంధీ రాసుకున్న ఈ కథ చాలా బాగుంది.సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా ఆ తర్వాత మాత్రం స్పీడ్ గా ఉంటుంది. దివి ట్రాక్ ను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డైరెక్టర్ బోర్ కొట్టకుండా తీశాడు.స్క్రీన్ ప్లేని బాగా డిజైన్ చేసుకున్నాడు.మూవీలో కామెడీ కూడా వర్క్ ఔట్ అయ్యింది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

Lambasingi movie review
Lambasingi movie review

టెక్నిషియన్స్ పని విషయానికి వస్తే.. డైరెక్టర్ నవీన్ బోర్ కొట్టించకుండా మూవీని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ అయితే సూపర్.అలాగే ఆర్.ఆర్.ధృవన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. అతని పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. కె. బుజ్జి సినిమాటోగ్రఫి కూడా బాగుంది. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి పనితనం బాగుంది.

Lambasingi movie review
Lambasingi movie review

ఇక నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్ దివి సహజమైన నటనతో అకట్టుకుంది. హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా బాగా నటించాడు. క్లైమాక్స్ లో భరత్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు.మిగిలిన నటులు వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో బాగా నటించారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరించే సినిమా. ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N