NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీపై మూడు పార్టీల కూట‌మి ఎఫెక్ట్ ఎంత‌.. అంత సీన్ అయితే లేదు..!

The effect of the three-party alliance on the YCP is not clear

టీడీపీ, జ‌నసేన, బీజేపీలు చేతులు క‌లిపాయి. సీట్లు పంచుకున్నాయి. ఇది ప్ర‌స్తుతానికి టైటిల్ మాత్ర‌మే. అస‌లు సినిమా మ‌రో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విడుద‌ల కానుంది. గుంటూరు వేదికగా బొప్పూడిలో నిర్వ‌హిస్తున్న ఉమ్మ‌డి తొలి భారీ బ‌హిరంగ స‌భ నుంచి మూడుపార్టీలూ ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిం చ‌నున్నాయి. ఇక‌, అప్ప‌టి నుంచి మూడు పార్టీలూ క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారాన్ని కూడా దంచి కొట్ట‌నున్నాయి.

ఇది ఓకే. అయితే… ఈ మూడు పార్టీల ప్ర‌భావం వైసీపీపై ఎంత ప‌డుతుంది? బ‌ల‌మైన సంక్షేమ కార్య‌క్ర మాలతో దూసుకుపోతున్న వైసీపీ ప్ర‌భుత్వాన్ని క‌ట్ట‌డిచేసి.. ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో ఈ మూడు పార్టీలు.. చీల్చే ఓట్లు ఎన్ని? అనేది ఆస‌క్తిగా మారింది. కూట‌మి ప్ర‌భావంపై స‌ర్వ‌త్రా జ‌రుగుతున్న చ‌ర్చ‌ను బ‌ట్టి.. కీల‌క‌మైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు మాత్రం వైసీపీతోనే ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ వుతోంది.

ఎందుకంటే.. కూట‌మిలో బీజేపీ ఉండ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. బీజేపీలేకుండా.. టీడీపీ-జ‌న‌సేన మాత్ర‌మే ముందుకుసాగి ఉంటే.. ఆ ప్ర‌భావం వేరేగా ఉండేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతు న్నారు. పైగా బీజేపీపై 2014 ఎన్నిక‌ల స‌మయంలో ఉన్న సానుకూల‌త ఇప్పుడు ప్ర‌జ‌ల్లో లేదు. అప్ప‌టికి బీజేపీ క్లీన్ చిట్ తో ఉంది. అంటే.. రాష్ట్రాన్ని విడ‌గొట్టే స‌మయంలో ప్ర‌త్యేక హోదాను 5 ఏళ్లు కాదు.. 10 ఏళ్లు కావాల‌ని.. రాష్ట్రానికి నిధులు ఇవ్వాల‌ని అప్పట్లో బీజేపీ రాజ్య‌స‌భ వేదిక‌గా ప్ర‌శ్నించింది.

ఇక‌, మోడీ ప్ర‌చార స‌భ‌ల్లో కూడా.. ఏపీకి న్యాయం చేస్తామ‌న్నారు. ఇది 2014 ఎన్నిక‌ల పొత్తుల‌ను ముందు కు తీసుకువెళ్ల‌డానికి దోహ‌ద‌ప‌డింది. ఇప్పుడు అలాంటి సానుకూలత బీజేపీ విష‌యంలో లేదు. పైగా.. ప‌దేళ్లుగా మోడీ రాజ‌ధాని, పోల‌వ‌రం, స్టీల్ ఫ్యాక్ట‌రీ వంటి కీల‌కమైన వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న పెట్టారు. దీంతో వ్య‌తిరేకత పెరిగిందే త‌ప్ప‌.. సానుకూల‌త కాదు. ఇలాంటి ప‌రిస్థితిలో పొత్తుల ప్ర‌భావం వైసీపీపై పెద్ద‌గా చూపించే అవ‌కాశం లేదు.

అయితే..చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల దూకుడు మాత్రం ప‌నిచేయొచ్చు. వారి ప్ర‌చారం, వారి సానుకూ లత వంటివి మాత్ర‌మే ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌కంగా మారితే.. అది పొత్తు పార్టీలు అంతో ఇంతో మేలు చేసే అవ‌కాశం ఉంది. ఇది కాక‌.. వైసీపీకి భారీ న‌ష్టం చేకూర్చే ప‌రిస్థితి అయితే.. ఇప్ప‌టికిప్పుడు క‌నిపించ‌డం లేదు.

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N