Mamitha Baiju: మమితా బైజు.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల విడుదలైన మలయాళ లవ్ డ్రామా ప్రేమలు మూవీ తో మమితా సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. యూత్ కు లేటెస్ట్ క్రష్ అయింది. ప్రేమలు సినిమా మలయాళం లోనే కాకుండా తెలు,గు తమిళ భాషల్లో సైతం ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మమితా ఒక్క సినిమాతో సౌత్ సినీ ప్రియులందరికీ చేరువైంది. అయితే మమితాకు ప్రేమలు ఫస్ట్ మూవీ కాదు. అంతకంటే ముందే ఆమె దాదాపు 15 చిత్రాల్లో నటించింది.
కేరళలో జన్మించిన మమితా.. చిన్నతనం నుంచి సాంస్కృతి కార్యక్రమాలపై మక్కువ చూపింది. మమితా తండ్రి డాక్టర్ కాగా.. తల్లి గృహిణి. మమితాను డాక్టర్ గా చూడాలన్నది ఆమె తండ్రి కల. కానీ మమితా మాత్రం చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది. నటిగా తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతుంది. అందం అభినయంతో అందరి మన్ననలు అందుకుంటుంది. ప్రేమలు విషయంతో మమితాకు మలయాళం లోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో సైతం ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మమితా బైజు.. తన నేమ్ వెనుక ఉన్న ఓ టాప్ సీక్రెట్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్య పోసింది. ఇంతకీ ఈ అమ్మడి అసలు పేరు మమితా కాదట. మమితాకు ఆమె తల్లిదండ్రులు పెట్టిన అసలు నమిత. మమితా పుట్టినప్పుడు హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో పొరపాటున ఎన్ అనే అక్షరానికి బదులుగా ఎమ్ అనే అక్షరాన్ని రాశారు. హాస్పిటల్ సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా నమిత కాస్త మమితగా మారింది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. బర్త్ సర్ట్ఫికెట్ లో పేరును తప్పుగా రాశారన్న విషయాన్ని మమితా స్కూల్ లో జాయిన్ అయ్యే వరకు ఆమె తల్లిదండ్రులు గుర్తించలేదు. స్కూల్లో చేర్పించడానికి తీసుకెళ్లాక పేరు తప్పుగా పడిందని చూసుకున్నారు. ఇక అప్పుడు చేసేదేమి లేకపోవడం.. పైగా మమితా కూడా బాగానే ఉండటంతో తల్లిదండ్రులు అదే పేరును కంటిన్యూ చేశారు. అలా తనది కాని తన సొంతమైంది. ఎమ్ అనే అక్షరం మహత్యమో ఏమో గానీ మమితా జాతకమే మారిపోయింది. డాక్టర్ కావాల్సిన ఆమె యాక్టర్ అయింది.
తొమ్మిదో తరగతిలోనే నట ప్రస్థానాన్ని ప్రారంభించిన మమితా.. సర్వోపరి పాలక్కారన్ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తరువాత వరుసగా హనీ బీ 2: సెలబ్రేషన్స్, డాకినీ, కృష్ణం, వరతన్, స్కూల్ డైరీ తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు చేసింది. 2021లో వచ్చిన ఖో ఖో మూవీలో టీమ్ కెప్టెన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రేమలు సినిమాతో ఫస్ట్ బ్రేక్ అందుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. మమితా చేతిలో ఇప్పుడు ప్రేమలు 2తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి.