Eagle: మాస్ మహారాజ్ హీరోగా అనుపమ హీరోయిన్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని సంఘటనల మూలంగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమాలో నవదీప్, అవకాశాల శ్రీనివాస్ కీలక పాత్రలు వహించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
టైగర్ నాగేశ్వరరావు సినిమా అనంతరం రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా ధమాకా సక్సెస్ అనంతరం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మాస్ మహారాజ్ నటించిన మొదటి సినిమా ఇది. ఇక ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్ షోస్, ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
” ఈగల్ మూవీ రవితేజ మాస్ జాతర .. అలాగే కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ ఫుల్ మీల్స్ పెడుతుంది ” అంటూ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక మరో ప్రేక్షకుడు..ష ఈగల్ సూపర్ డూపర్ సినిమా. పర్ఫెక్ట్ కమర్షియల్ యాక్షన్ సినిమా. రవితేజను బాగా చూపించాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ సూపర్ ఉంది.
#EAGLE one Man show
@RaviTeja_offl ఊచకోత
Elevations 🔥🔥🔥
Cinematography 🔥
Bgm 🔥🔥🔥
Overall excellent movie with elevations emotion and story #EAGLEonFEB9th#EaglePremier#RaviTeja#peoplesmediafactory 🔥
మార్గశిరం మధ్య రాత్రి రవి అన్న హిట్టు బొమ్మ
Overall:3.5/5 pic.twitter.com/SBIsWoHIwg— Vinay Naidu (@vinaynaidu060) February 9, 2024
చాలా కాలం తర్వాత రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈగల్ సినిమా విజువల్ క్వాలిటీ.. రవితేజ సరికొత్త అవతారం అదిరిపోయింది. ఎఫెక్ట్స్ అండ్ బీజీయం, సినిమాటోగ్రఫీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ” అంటూ మరో ప్రేక్షకుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు అభిమానులు.
#Eagle 👌✅
Top notch visual quality & a new look avatar from #RaviTeja
One word review ⭐⭐⭐⭐#RaviTeja #Eagle#BlockbusterEagle pic.twitter.com/FPtDGJTtGd— AKLESH (@aklesh__sahni) February 9, 2024
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!