Bhimaa: చాలా కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా భీమా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. గోపీచంద్ కెరీర్ లో 25వ సినిమా ఇది. శుక్రవారం భీమా విడుదల అయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ఆడియెన్స్ ట్విట్టర్(ఎక్స్) ద్వారా రివ్యూ ఇచ్చేస్తున్నారు. సినిమాపై తమ అభిప్రాయం తెలుపుతున్నారు.
అయితే మెజారిటీ పీపుల్ నుంచి భీమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ కటౌట్‌కి తగ్గ బొమ్మపడిందని అంటున్నారు. భీమాలో డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లో గోపీచంద్ అదరగొట్టేశాడని.. పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పవర్ ఫుల్ యాక్టింగ్, బాడీలాంగ్వేజ్, డైలాగ్స్ అదుర్స్ అని ఆడియెన్స్ అంటున్నారు. మాస్ కోణంలో ఉన్న ఆయన మరో పాత్ర సర్ప్రైజింగ్గా ఉందని చెబుతున్నారు.
అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు భీమా సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయని.. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గూస్బంప్స్ తెప్పించేలా తెరకెక్కించారని అభిప్రాయపడుతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందట. పలు సిన్నివేశాలకు అతని బీజీఎమ్ ప్రాణం పోశాయని అంటున్నారు. హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఇద్దరికీ కథలో చక్కని ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్క్రీన్‌ప్లే కూడా గ్రిప్పింగ్‌గా ఉందట. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అదిరిపోయాయని.. మాస్ ఆడియెన్స్‌కు భీమా ఫుల్ మీల్స్‌లా ఉంటుందని కొందరు చెబుతున్నారు. మొత్తానికి ట్విట్టర్ టాక్ బట్టీ థియేటర్స్ లో భీమా దుమ్ములేపుతోందని అర్థమవుతోంది. కొన్ని కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ.. గోపీచంద్ యాక్టింగ్, గూస్బంప్స్ తెప్పించే బీజీఎమ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే భీమా సినిమాకు మెయిన్ హైలెట్స్ గా నిలిచాయని తెలుస్తోంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!