Bhoothakaalam Review: రేవతి, షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం హారర్ మూవీ భూతకాలం. ఈ మూవీ సోనీ లీవ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ హారర్ మూవీ కి భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివ దర్శకత్వం వహించాడు. విమర్శలకు ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్న ఈ హారర్ మూవీ ఎటువంటి రేటింగ్ దక్కించుకుంది? కదేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కథాంశం:
ఆశ (రేవతి) ఓ కిండర్ గార్డెన్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటుంది. భర్త చనిపోవడంతో కొడుకు వినును( షేన్ నిగమ్) కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. విను ఎంబిబిఎస్ చదవాలని కలలు కంటాడు. కానీ తల్లి ఆశ బలవంతంగా అతడిని బి ఫార్మసీ లో చేర్పిస్తుంది. చదువు పూర్తి చేసిన వీను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. సొంత ఊరును వదిలిపెట్టి మరో చోటకు జాబ్‌కు వెళ్లాలని విను ఆశిస్తాడు. కానీ ఆశ అందుకు ఒప్పుకోదు.
విను అమ్మమ్మ చనిపోతుంది. ఇక ఆమె చనిపోయిన కొన్ని రోజుల తరువాత ఇంట్లో వింత శబ్దాలు మరియు ఆకారాలు విను కి కనిపిస్తాయి. తొలుత విను మాటలను ఆశతో పాటు అతడి బంధువులు నమ్ముతారు. వంశపారంగా వీను ఫ్యామిలీని మానసిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇక వీలు కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని జర్జ్ అనే డాక్టర్ తో వీనుకు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది ఆశ. ఇక వీనుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో అదృష్ట శక్తి ఉందని నమ్ముతుంది. ఆశ మరియు వినులను భయపెడుతున్న ఆ అదృష్టశక్తి ఏంటి? దానివల్ల వినుకి ఏం జరిగింది? చివరికి వేణుకి జాబ్ వచ్చిందా? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది.
పడికట్టు సూత్రాలకు భిన్నంగా:
హర్రర్ సినిమాలు అనగానే వింత వింత మేకప్ లతో దయ్యాలు హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రలను భయపెట్టడం కామన్ గా కనిపిస్తుంది. కానీ చాలా వరకు హారర్ సినిమాలు పాడుబడ్డ బంగ్లాలు మరియు పెద్ద పెద్ద భవంతుల బ్యాక్ డ్రాప్ లోనే సాగుతాయి. అలాంటి పడికట్టు సూత్రాలకు పూర్తి భిన్నంగా భూతకాలం మూవీ సాగుతుంది. మూడు గదులు ఉన్న సాదాసీదా ఇంట్లో దెయ్యాలను చూపించకుండా కేవలం సౌండ్, విజువల్స్ తోనే డైరెక్టర్ రాహుల్ భూతకాలం మూవీ ని తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో టాప్ నుంచి పడే చిన్న చిన్న డ్రాప్స్ మరియు హీరో తింటున్నప్పుడు వచ్చే సౌండ్స్, వర్షం పడినప్పుడు వచ్చే శబ్దాలను చాలా న్యాచురల్ గా చూపించారు. రెగ్యులర్ హర్రర్ సినిమాలలో మాదిరిగా కాకుండా భూతకాలం సినిమాలోని సౌండ్ డిజైనింగ్ చాలా కొత్తగా అనిపించింది. తల్లిదండ్రుల ఎమోషన్ ఒకపక్క అయితే దెయ్యాల అలికిడి మరోపక్క. అలా చాలా టెన్షన్స్ మధ్య కి మూవీ సాగింది. మొత్తానికి అయితే ఈ సినిమా మంచి టాక్ దక్కించుకుంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మలయాళం హర్రర్ సూపర్ హిట్ మూవీలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
భూతకాలం మూవీ రేటింగ్: 4.2