Kismat First Review: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకోండ , రియా సుమన్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, టెంపర్ వంశీ తదితరులు ముఖ్య పాత్రలలో పోషించిన కిస్మత్ నేడు ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లోకి వచ్చింది. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనాథ్ బదినేని దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సరిగ్గా రెండు నెలలకు అంటే ఏప్రియల్ రెండు నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది కిస్మత్ రివ్యూ తో తెలుసుకుందాం.
కిస్మత్ కథ:
కార్తీక్ (నరేష్) అభి (అభినవ్ గోమట్టం), కిరణ్ విశ్వదేవ్ కలిసి నటించిన చిత్రమే ఈ కిస్మత్. మంచిర్యాలకు చెందిన ఈ ముగ్గురు బీటెక్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉంటారు. ఊరిలో అల్లరి చిల్లర గా తిరుగుతూ తల్లిదండ్రులతో తిట్లు తింటారు. ఇక ఓసారి గొడవ కారణంగా పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్ళొస్తారు. అప్పుడే ఇంట్లో వాళ్ళ మాటలతో ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్ వెళ్తారు. మరోవైపు హైదరాబాదులో ఎలక్షన్ హడావిడి నడుస్తుంది. అనేక విద్యార్థులను నెలకొల్పి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న జనార్ధన్ ( అభినవ్ ఘోష్) ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నిస్తాడు.
ఆ క్రమంలో అతన్ని ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ లోక్‌నాథ్ (సమీర్) టార్గెట్ చేసి దాడులు చేస్తాడు. అతని నుంచి తప్పించుకునేందుకు తన వద్ద ఉన్న రూ. 20 కోట్ల డబ్బును తన అనుచరులు సూరి, రాజుకు ఇచ్చి దాచి పెట్టమని చెబుతాడు. కానీ రాజు మాత్రం పది కోట్లతో ఎస్కేప్ అవుతాడు. రాజును పట్టుకునే క్రమంలో అతన్ని చంపేస్తాడు సూరి. మరి రాజు ఆ 10 కోట్లు ఎక్కడ పెట్టాడు? అతను దాచిన ఆ డబ్బు కార్తీక్ బ్యాచ్‌కు ఎలా దొరికింది? ఆ అనంతరం వాళ్ళ జీవితంలో ఎటువంటి కలహాలు జరిగాయి? కార్తీక్ అతని స్నేహితులు ఉద్యోగం సంపాదించారా? అనే కథ చుట్టూ ఈ మూవీ రూపొందింది.
క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్:
కిస్మత్ ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి తరహాలో ఇప్పటికీ చాలా సినిమాలే వచ్చాయి. కథలు కొత్తదనం ఏముండదు. కానీ ప్రారంభం నుంచి టేకింగ్ మాత్రం బాగుంది. ముందు జనార్దన్ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్, ఎమ్మెల్యే అవడానికి కారణం, బ్లాక్ మనీ, ఇన్కమ్ టాక్స్ దాడి సీన్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారాయి. మొత్తానికి అయితే మంచి పాజిటివ్ టాక్ కే దక్కించుకుంది ఈ సిరీస్. ప్రస్తుత కాలంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లకి మంచి ఆదరణ పెరిగింది. అలా రిలీజ్ అయి ఇప్పటికే అనేక సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక ఆ కోవాలో నే చేరింది ఈ మూవీ కూడా.
డైరెక్టర్: శ్రీనాథ్ బాదినేని
నిర్మాత: రాజు
సినిమాటోగ్రఫీ: వెదరామన్ శంకరన్
సంగీతం: మార్క్ కే రబిన్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
థియేట్రికల్ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 2, 2024
ఓటిటి రిలీజ్ డేట్: ఫిబ్రవరి 2, 2024
ఓటిటి ప్లాట్ఫారం: అమెజాన్ ప్రైమ్ వీడియో
కిస్మత్ మూవీ రేటింగ్: 7.9