అక్కినేని వారింటి కోడలు సమంత అక్కినేని పెళ్లి తర్వాత కూడా హీరోయిన్గా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే భర్త చైతన్యతో సమంత కలిసి నటించిన `మజిలీ` ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత తమిళ చిత్రం `96` తెలుగు రీమేక్ `జానకీ దేవి` (వినపడుతున్న టైటిల్)లో నటించబోతున్నారు. అలాగే నాని, ఇంద్రగంటి సినిమాలో.. దిల్రాజు బ్యానర్లో నెక్ట్స్ ఇయర్ ప్రభాస్ చేయబోయే సినిమాల్లో సమంత పేరు హీరోయిన్గా పరిశీలనలో ఉందని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన ఆసక్తికరమైన విషయమేమంటే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తోన్న `మన్మథుడు 2`లో సమంత అతిథి పాత్ర చేస్తుందట. కథానుగుణంగా కీలక సమయంలో సమంత పాత్ర ఎంట్రీ ఉంటుందట. ఈ పాత్ర పరిధి పది నిమిషాల మేర ఉంటుందని టాక్. ఇది వరకు నాగార్జున, సమంత కలిసి `రాజుగారి గది 2`లో నటించారు. ఇప్పుడు మరోసారి వెండితెరపై `మన్మథుడు 2`తో మామ కోడలు సందడి చేయబోతున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
previous post
next post
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!