అల్లు అర్జున్ తనయుడు అయాన్‌కి గిఫ్ట్ రావడం.. బన్నికి షాక్ తగలడం ఒకేసారి జరిగాయి. ఇంతకు ఈ రెండు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా! బన్ని తండ్రి అల్లు అరవింద్. వివరాల్లోకెళ్తే.. బన్ని తనయుడు అయాన్ పుట్టినరోజు బుధవారం. బన్ని, స్నేహరెడ్డి సహా కుటుంబ సభ్యులు అయాన్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే టు మై బేబి.. నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్ నెస్. సంతోషం, సరదాతనం, లెక్కలేనంత ప్రేమ.. మా నాన్న(అరవింద్) అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్ పూల్‌ను ఇచ్చారు. నేను ఇంకా షాక్‌లో ఉన్నాను. 45 రోజుల క్రితం నాన్న అయాన్ని ఏం కావాలని అడిగితే వాడు పూల్ కావాలని అడిగాడు. నాన్న సరేనని కట్టించి ఇచ్చేశారు. అలాంటి తాతయ్య ఉండటం వాడి అదృష్టం. నాలుగో తరం పిల్లలు.. అల్లు పూల్“ అనే మెసేజ్‌తో పాటు బన్ని కొన్ని ఫోటోలను షేర్ చేశాడు బన్ని. అలాగే స్నేహా రెడ్డి కేక్ కటింగ్ ఫోటోలను షేర్ చేశారు.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!