NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

Anil Ravipudi-Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల లిస్ట్ తీస్తే రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. ఆ తర్వాత వినిపించే పేరు అనిల్ రావిపూడి. అటువంటి అనిల్ రావిపూడిని ముసిగేసి కొడితే రూ. 10 వేలు ఇస్తానంటూ తాజాగా రాజమౌళి ప్రకటన చేశారు. అనిల్ ను ముసుగేసి కొట్టమనేంత కోపం రాజమౌళికి ఎందుకు వచ్చింది..? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? అన్నది తెలుసుకుందాం పదండి.

విల‌క్ష‌ణ న‌టుడు స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం కృష్ణ‌మ్మ‌. వివి గోపాల కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి అరుణాచల క్రియేషన్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మించారు. మే10న థియేట‌ర్స్ లో గ్రాండ్ గా కృష్ణ‌మ్మ మూవీ విడుద‌ల కాబోతోంది. మే1న హైద‌రాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ రాజ‌మౌళి, అనిల్ రావిపూడి, కొర‌టాల శివ‌, సుకుమార్‌, గోపీచంద్ మ‌లినేని స్పెష‌ల్ గెస్ట్‌లుగా హాజరు అయ్యారు. చిత్ర‌టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియ‌జేశారు.

ఇక‌పోతే ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి కృష్ణ‌మ్మ మూవీ గురించి మాట్లాడిన త‌ర్వాత రాజ‌మౌళిని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆర్ఆర్ఆర్ అనంత‌రం రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్ బాబుతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్లోబల్ రేంజ్‍లో యాక్షన్ అడ్వెంచర్ గా వీరి మూవీ రాబోతోంది. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. అయితే కృష్ణ‌మ్మ ప్రీ రిలీజ్ వేడుక‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మ‌హేష్ బాబు – రాజ‌మౌళి సినిమా ప్ర‌స్తావ‌న తెచ్చారు. `మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఓపెనింగ్ డేట్, జానర్, కథ ఏంటో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ విషయాలను రాజ‌మౌళిగారు చెబుతారని ఆశిస్తున్నాను` అంటూ అనిల్ జ‌క్క‌న్న‌ను ఇరికించారు.

దాంతో రాజ‌మౌళి కృష్ణ‌మ్మ సినిమా గురించి మాట్లాడిన అనంత‌రం అనిల్ రావిపూడికి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. `ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని.. వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే రూ.10వేలు ఇస్తా` అంటూ రాజ‌మౌళి ఓ స్వీట్ ఆఫ‌ర్ ఇచ్చారు. వెన‌కాలే ఉన్న అనిల్ రావిపూడి వెంట‌నే రియాక్ట్ అయ్యారు. `దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. రూ.10వేలు అంటే నిజంగా వచ్చేస్తార`ని బ‌దులిచ్చాడు. దీంతో వీరి స‌ర‌దా సంభాష‌ణ నెట్టింట వైర‌ల్ గా మారింది.

కాగా, రాజ‌మౌళి అంత తొంద‌ర‌గా త‌న సినిమాల గురించి ఎటువంటి విష‌యాన్ని బ‌య‌ట‌ పెట్టారు. అలాంటి ఆయ‌న్ను అంద‌రి ముందు మ‌హేష్ బాబుతో చేయ‌బోయే సినిమా గురించి చెప్ప‌మ‌ని అనిల్ రావిపూడి అడిగారు. దాంతో రాజ‌మౌళికి బాగా కోపం వ‌చ్చింది. అయితే ఆ కోపాన్ని నేరుగా ప్ర‌ద‌ర్శించ‌కుండా కామెడీ వేలో అనిల్ రావిపూడికి కౌంట‌ర్ ఇచ్చారు.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N