NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఎలిమినేట్ అయిన తర్వాత ముమైత్ ఖాన్ వైరల్ కామెంట్స్..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో స్టార్ట్ అయి అప్పుడే వారం రోజులైపోయింది. టెలివిజన్ రంగంలో అతి పెద్ద రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో… తెలుగులో 5 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. తాజాగా ఓటీటి ప్లాట్ ఫామ్ లో… నాన్ స్టాప్  ఎంటర్టైన్మెంట్ గా  24 గంటలు స్ట్రీమింగ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బిగ్ బాస్ తెలుగు ఓటిటిలో 17 మంది సభ్యులు  ఎంట్రీ ఇవ్వగా అందులో 9 మంది కొత్తవాళ్ళు..మిగతా 8 మంది మాజీ ఆటగాళ్లు. ఇదిలా ఉంటే మొదటి వారం నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం తెలిసిందే.  అయితే జరిగిన ఓటింగ్ పరంగా వీరిలో మిత్రశర్మ ఇంటి నుండి గ్యారెంటీగా ఎలిమినేట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ ముమైత్ ఖాన్ చివరాకరికి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. కొద్దిపాటి ఓటింగ్ తేడాతో మిత్రశర్మ కంటే చివరిలో ముమైత్ ఖాన్ ఉండటంతో… ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

Bigg Boss Non-Stop OTT: Mumaith Khan Is Eliminated In The First Week…

అయితే ఎలిమినేషన్ సమయంలో నవ్వుతూ కనిపించిన ముమైత్ ఖాన్… స్టేజి మీదికి వచ్చేసరికి… బోరున ఏడ్చేసింది. అంతమాత్రమే కాదు స్టార్టింగ్ బిగ్బాస్ సీజన్ లో తనపై పడిన మార్కు తొలగించుకోవడానికి… ఈ షోలో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ముమైత్.. ఈ రీతిగా మాట్లాడింది..”బిగ్ బాస్ స్టార్టింగ్ సీజన్ లో నన్ను కావాలని బ్యాడ్ గా చూపించారు. దీంతో నాపై పడినా మార్క్ నీ తొలగించుకోవాలనే ఉద్దేశంతో…ఓటిటి బిగ్ బాస్ షోలో పాల్గొనడం జరిగింది. కానీ ఇంత త్వరగా బయటకు వెళ్లాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు.

Bigg Boss OTT Telugu Mumaith Khan Gets Evicted | Bigg Boss OTT Telugu:  ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్, ఎలిమినేట్ అయిన ముమైత్

ఎంతో బాధగా ఉంది. ఇప్పటికీ కూడా నన్ను కావాలనే బ్యాడ్ గా చూపించారు. కొంతమంది కంటెస్టెంట్ లు కూడా … కావాలనే బ్యాడ్ చేశారు. ఇక ఇదే సమయంలో.. స్టేజ్ పై ఉన్న నాగార్జున ఇంటిలో ఎవరూ పనికిరాని వాళ్ళు..? ఎవరు విలువైన వాళ్ళు అంటూ ముమైత్ ఖాన్ ని నాగార్జున ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అఖిల్‌, అజయ్‌, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్‌, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్‌ ట్యాగ్‌ ఇస్తానని ముమైత్‌ చెప్పుకొచ్చింది. మొత్తం మీద మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ఇంటి నుండి ఎలిమినేట్ కావటం సంచలనంగా మారింది.

Related posts

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N