NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: 45 మంది అభ్యర్దులతో రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

Congress: సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. 45 మందితో రెండో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్ధుల సంఖ్య వందకు చేరింది. ఇంకా 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. వామపక్షాల పొత్తులో భాగంగా చేరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో ఇప్పటికే అంగీకారం కుదిరింది. అయితే ఏ స్థానాలు ఇవ్వాలి అనే దానిపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహార కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

congress

మరో 15 స్థానాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్ లో పెట్టారు. ఈ స్థానాల పై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి వదిలివేశామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయనీ, ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారంపై కొలిక్కి వస్తుందని ఆయన తెలిపారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి రెండో జాబితాలో అవకాశం కల్పించారు.

  • సిర్పూర్ – రావి శ్రీనివాస్
  • అసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరు శ్యామ్
  • ఖానాపూర్ (ఎస్టీ) – వెద్మర బొజ్జు
  • ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
  • బోథ్ (ఎస్టీ) – వెన్నెల అశోక్
  • ముథోల్ – బోస్లే నారాయణ రావు పాటిల్
  • ఎల్లారెడ్డి – కే మదన్ మోహన్ రావు
  • నిజాబాదాద్ రూరల్ – డాక్టర్ రేకులపల్లి భుపతిరెడ్డి
  • కొరుట్ల – జువ్వాది నర్సింగరావు
  • చొప్పదండి (ఎస్సీ) – మోడిపల్లి సత్యం
  • హుజూరాబాద్ – వొడితెల ప్రణవ్
  • హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
  • సిద్దిపేట – పూజల హరికృష్ణ
  • నర్సాపూర్ – ఆవుల రాజిరెడ్డి
  • దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి
  • కూకట్ పల్లి – బండి రమేష్
  • ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
  • ఎల్బీ నగర్ – మధుయాష్కి గౌడ్
  • మహేస్వరం – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  • రాజేంద్రనగర్ – కస్తూరి నరేందర్
  • శేరిలింగంపల్లి – వి జగదీశ్వర్ గౌడ్
  • తాండూర్ – బయ్యని మనోహర్ రెడ్డి
  • అంబర్ పేట – రోహిన్ రెడ్డి
  • ఖైరతాబాద్ – పి విజయారెడ్డి
  • జూబ్లీహిల్స్ – మహ్మద్ అజహరుద్దీన్
  • సికింద్రాబాద్ కంటోన్నెంట్ (ఎస్సీ)- డాక్టర్ జీవీ వెన్నెల
  • నారాయణ పేట్ – డాక్టర్ పర్ణిక చిట్టెం రెడ్డి
  • మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • జడ్చర్ల – జె అనిరుద్ద్ రెడ్డి
  • దేవరకద్ర – గావినోళ్ల మధుసూధన్ రెడ్డి
  • ముక్తల్ – వాకిటి శ్రీహరి
  • వనపర్తి – డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
  • దేవరకొండ (ఎస్టీ) – నేనావత్ బాలూనాయక్
  • మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • భువనగిరి – కుంభం కనిల్ కుమార్ రెడ్డి
  • జనగామ – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
  • పాలకుర్తి – యశశ్విని
  • మహబూబాబాద్ (ఎస్టీ) డాక్టర్ మురళీ నాయక్
  • పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
  • వరంగల్లు పశ్చిమ – నాయిని రాజేందర్ రెడ్డి
  • వరంగల్లు తూర్పు – కొండా సురేఖ
  • వర్ధన్నపేట (ఎస్సీ) – కేఆర్ నాగరాజు
  • పినపాక (ఎస్టీ) – పాయం వెంకటేశ్వర్లు
  • ఖమ్మం – తమ్మల నాగేశ్వరరావు
  • పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజికవర్గానికి కాంగ్రెస్ పెద్ద పీట వేసింది. ఇప్పటి వరకూ ప్రకటించిన వంద స్థానాల్లో 38 శాతం రెడ్డి సామాజికవర్గానికి టికెట్ ల కేటాయింపు జరిగింది.

కులాల వారీగా

  • రెడ్డిలకు 38 స్థానాలు
  • బీసీలకు 20 స్థానాలు
  • వెలమలకు 9 స్థానాలు
  • కమ్మలకు 3 స్థానాలు
  • బ్రాహ్మణులకు 3 స్థానాలు
  • మైనార్టీలకు 4 స్థానాలు
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 31

Amit Shah: బీసీ కార్డ్ ప్రయోగించిన బీజేపీ..తెలంగాణ ఎన్నికల వేళ అమిత్ షా కీలక హామీ

 

Related posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

sharma somaraju

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

sharma somaraju

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

sharma somaraju

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

sharma somaraju

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

IPS AB Venkateswararao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్ .. అయిదేళ్లుగా న్యాయపోరాటం

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju