Naa Saami Ranga: నాగార్జున కొత్త సినిమా “నా సామి రంగ” సినిమాలో అల్లరి నరేష్ పాత్రకి సంబంధించిన గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో అంజి గాడు అనే పాత్రలో కనిపిస్తున్నాడు. 55 సెకండ్ల నిడివి కలిగిన ఈ ప్రోమోలో అల్లరి నరేష్… డైలాగులు.. గోదావరి ప్రాంత యాసని తలపిస్తున్నాయి. పల్లెటూరు నేపథ్యంలో.. ఈ సినిమాని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత.. ప్రముఖ నిర్మాత శ్రీనివాసా చిట్టూరి.. ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుందని వీడియో బట్టి అర్థమవుతుంది. ఈ క్రమంలో విడుదల చేసిన అల్లరి నరేష్ వీడియో అందరినీ ఆకట్టుకుంటూ ఉంది.
“మా అంజి గాడిని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాట వచ్చేస్తది” అంటూ నరేష్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంజి పాత్ర సినిమాలో సరదాగా ఉండబోతుందని వీడియో చూస్తే అర్థమవుతుంది. జాతర, పెళ్లి ఇలాంటి కార్యక్రమాలలో అల్లరి నరేష్ డాన్స్ అల్లరి చేస్తూ రచ్చ రచ్చ చేశాడు. మాట వచ్చేస్తది.. అంటూ అల్లరి నరేష్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “నా సామి రంగ”లో అల్లరి నరేష్ అంజి పాత చూస్తుంటే “గమ్యం” సినిమాలో గాలి శ్రీను పాత్రనీ తలపిస్తోంది.
అప్పట్లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన “గమ్యం” సూపర్ డూపర్ హిట్ అయింది. శర్వానంద్ కూడా హీరోగా నటించాడు. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస కామెడీ సినిమాలు చేసి అల్లరి నరేష్ ఎంతో బిజీగా ఉండేవారు. తర్వాత వరుస పెట్టి ఫ్లాప్ సినిమాలు రావడంతో… కొంతకాలం గ్యాప్ ఇచ్చి ప్రజెంట్ ఇప్పుడు.. హీరోల పక్కన నటించే పాత్రలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో “మహర్షి” సినిమాలో నటించారు. కాగా ఇప్పుడు అక్కినేని నాగార్జున.. “నా సామి రంగ” సినిమాలో స్పెషల్ రోల్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం జరిగింది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!