NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 2 2024 Episode 1168: అనుని ఆశీర్వదించిన సుబ్బు పద్మ…

Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights

Prema Entha Madhuram February 2 2024 Episode 1168: హరీష్ దివ్యకి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని అంటాడు. దివ్య హరీష్ దగ్గరికి వచ్చి ఏమైంది నా కోసమే ఏదైనా బహుమతి తీసుకొచ్చావా అని అడుగుతుంది. మనకు అసలు అలాంటి చిన్న చిన్న సరదాలు చేసుకోవడానికి అవకాశం ఉందా అసలు ఇది మన పెళ్లేనా మనం తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లికూతురు లాగా ఉన్నాము అందరూ వాళ్ళనే చూస్తున్నారు అని అంటాడు హరీష్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఏం చేయలేనుఅక్కడికి అమ్మతో అన్ని రకాలుగా గొడవపడ్డాను అయినా ఎవరు నా మాటలు లెక్క చేయడం లేదు అని అంటుంది దివ్య.మా అమ్మ చాలా దిగులు పడుతుంది ఇలా ఒకే రోజున ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్లు జరిగితే ఏదో ఒక జంటనే సంతోషంగా ఉంటారు అంట మనకేమైనా జరుగుతుందేమో అని మా అమ్మ కంగారు పడుతుంది ఎక్కడ మన పెళ్లి ఆగిపోతుందో అని నాకు భయంగా ఉంది అని అంటాడు హరీష్.

Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights
Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights

ఆగితే వాళ్ల పెళ్లి ఆగుతుంది కానీ మన పెళ్లి ఆగదు హరీష్ నేను వెళ్లి మాట్లాడి వస్తాను అని దివ్య వెళ్ళిపోతుంది. అను గదిలోకి ఛాయా మానసి వెళ్తారు. ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి అను అనాలా లేక రాధ అనాలా అని అడుగుతుంది ఛాయా. ఏమని పిలిచినా చివరికి అనురాధ కదా ఛాయా గారు అని అంటుంది మానసి. ఆ విషయం మనకు తెలుసు కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా అని ఛాయ అంటుంది. మనం చెప్పేదం అని మానసి అంటుంది. నన్ను బెదిరిస్తున్నారా మర్యాదగా బయటికి వెళ్లిపోండి అని అంటుంది అను. నేను మీ పెళ్లి చూద్దామని వస్తే నువ్వు బయటికి వెళ్లిపోమంటావ్ ఏంటి అని అంటుంది మానసి. కారణం ఏంటో నాకు తెలియదు కానీ మా బావకు దూరంగా ఉన్నావు దగ్గరగా ఉన్న పరాయి స్త్రీలాగా ఉన్నావ్ మళ్ళీ పెళ్లి ఏంటి అను,నేనే అనుని అని చెప్పేస్తే ఇంత ఖర్చు ఉండదు కదా అని అంటుంది మానసి.నేను అసలే చిరాకుగా ఉన్నాను నాకు కోపం రానీయకండి మర్యాదగా బయటికి వెళ్లిపోండి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది

Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights
Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights

అను. సరే పద మనం వెళ్లిపోదాం మానసి అని అంటుంది ఛాయా. ఛాయా బయటికి వెళ్లే ముందు అను తాళి తీసేయాలి కదా ఇప్పుడు సూర్య కడతాడు ఆర్య కట్టిన తాళి ఉండకూడదు కదా అని అంటుంది. అయితే మనం తీసేద్దాం అని మానసి తీస్తుండగా అను తన చేయి పట్టుకొని నా తాళి మీద చెయ్యి వేస్తే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది అను. కంగారు పడకు అను మా బావ కట్టిన తాళి తీసేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని సెంటిమెంటా మేము తీయించకపోయినా నువ్వు పెళ్లి పీటలెక్కేముందు ఎవరో ఒకరు తీస్తారు అప్పుడు ఏం చేస్తావు అని అంటుంది మానసి. వాళ్లని కూడా ఇలాగే ఎదిరిస్తావా అయినా ఈ తాళి కట్టింది మరోసారి తాళి కడుతుంది నీ భర్తే కదా ఆ తాళి తీసేయ్ అని అంటుంది ఛాయా. ఇక్కడి నుండి మర్యాదగా వెళ్లిపోండి నా తాళి నా ఇష్టం ప్రాణం పోయినా దీనిమీద ఎవరి చేయి పడనివ్వను అని అంటుంది అను. మానసి అను భయపడుతుందని నీకు అనిపించట్లేదా అని అంటుంది ఛాయా.

Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights
Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights

నీకు ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పు మేము నీ సమస్యను తీర్చేస్తాం కావాలంటే ఈ పెళ్లిని కూడా ఆపేస్తాం అని అంటుంది ఛాయా. ఛాయా గారు మనం చెప్పాల్సిన మనం చెప్పాం కదా తనకు అవసరం ఉంటే తనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మనం వెళ్దాం పదండి అని మానసి ఛాయా వెళ్లిపోతారు. ఆంటీ వాళ్ళు నిజంగానే తాళి తీసేయమంటారా అలా జరగకూడదు అని అనుకుంటుంది. ఇంతలో దివ్య అను గదిలోకి వచ్చి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. చుట్టాలు కూడా అదే సమయానికి వచ్చి పెళ్లికూతురు అను అనుకొని చాలా బాగుంది దిష్టి తగిలేలా ఉంది దిష్టి తీస్తాను అని అంటారు. అంతా హరీష్ చెప్పినట్టే జరుగుతుంది ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు వీళ్ళ సంగతి చూస్తాను అని వెళ్ళిపోతుంది దివ్య. ఇంతలో పెళ్లి మండపానికి సుబ్బు పద్మ వస్తారు. పద్మ అను స్థానంలో వేరొక అమ్మాయి ఆర్య జీవితంలోకి వస్తుందని బాధపడుతుంది. అది చూసి పద్మ బాధపడకు ఆర్య సార్ ఏది చేసిన ఆలోచించి చేస్తారు అని అంటాడు సుబ్బు.అది తెలుసు కాబట్టే ఇంత జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను అని అంటుంది పద్మ. మనం ఇక్కడికి వచ్చింది పిల్లల సంతోషం కోసం వాళ్ళని వెళ్లి చూద్దాం పద అని సుబ్బు అంటాడు. సుబ్బు పద్మ పిల్లల దగ్గరికి వస్తారు.

Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights
Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights

సుగుణ వచ్చి పిల్లలు మీ గురించే ఎదురుచూస్తున్నారు అని అంటుంది. మేము మీ మీద అలిగాము అని అంటారు పిల్లలు. ఎందుకు అని అడుగుతారు సుబ్బు పద్మ. మీరిద్దరూ మాకు ముద్దు పెట్టాలి అని అంటారు పిల్లలు. సుబ్బు పద్మ వాళ్ళిద్దరికీ ముద్దు పెడతారు. పిల్లలు ఎవరితోనైనా చాలా తొందరగా కలిసిపోతారు అని అంటుంది సుగుణ. ఈ నిర్ణయం తీసుకొని మీరు చాలా మంచి పని చేశారు రాసిపెట్టి ఉంటే ఏదైనా జరగక తప్పదు అని అంటాడు సుబ్బు. సుగుణ సుబ్బుని పద్మ ని అను దగ్గరికి తీసుకెళుతుంది. వాళ్లు వస్తున్నారని తెలిసి అను తన మొహం కనపడకుండా చున్నీతో కప్పుకుంటుంది. దివ్య,రాధ పద్మ గారు మీ కోసం చీర తీసుకొచ్చారు అని అంటుంది సుగుణ.పద్మ చీర ఇవ్వు అని సుబ్బు అనగానే పద్మ అను కి చీర పెడుతుంది. అను వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వాళ్లకి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది వాళ్ల కూతురు అనులాగా స్పర్శ తగిలింది అని అనుకుంటారు. పద్మ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది సుగుణ. నా కూతురు గుర్తొచ్చింది అని చెప్తుంది పద్మ. కన్న పేగు కదా మర్చిపోలేక ఇలా గుర్తుకొచ్చినప్పుడు కన్నీళ్లు బయటికి వస్తాయి అని అంటుంది పద్మ.

Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights
Prema Entha Madhuram Today Episode February 2 2024 Episode 1168 Highlights

దేవుడు కొందరికి మాత్రమే అదృష్టాన్ని ఇస్తాడంట ఈ పిల్లలు నీకు వరమైతే ఈ పెళ్లి నీకు అదృష్టం అని అంటుంది పద్మ. నీ లాగా ఒంటరిగా ఉండే అమ్మాయికి బాధలు కష్టాలు ఉంటాయి ఈ పెళ్లితో నీకు అవన్నీ తొలగిపోతాయి అని సుబ్బు అంటాడు. దివ్య చీర పెడుతుంటే గుంజుకుంటుంది ఆశీర్వాదం తీసుకోకుండా చాలా తల పొగరుగా ప్రవర్తిస్తుంది. మీరు పిల్లల కోసం వచ్చారని నాకు అర్థం అవుతుంది నాన్న ఈ నాటకం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అనుకుంటుంది అను. కాళ్లు కడిగే కార్యక్రమం ఉంది పెళ్లి కొడుకులని రమ్మనండి అని పంతులు అంటాడు. యాదగిరి ఆర్య హరీష్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్తాడు. ఆర్య సుబ్బుని పద్మని చూసి అక్కడే ఆగిపోతాడు. యాదగిరి నువ్వు హరీష్ ని తీసుకొని వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు ఆర్య. మీరు మీ మంచి తనంతో ఒంటరి పోరాటం చేస్తున్నారని అర్థమైంది అని సుబ్బు అంటాడు.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella