NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కాపుల‌కు 3 ఎంపీ టిక్కెట్లు ఇచ్చిన జ‌గ‌న్‌… జ‌న‌సేన‌ను దెబ్బ‌కొట్టే ప్లాన్‌…!

ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. హీట్ మామూలుగా లేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకుంటూ వెళుతున్నారు. అటు జ‌న‌సేన + టీడీపీ పొత్తు ఖరారు కావ‌డంతో కాపుల ఓట్లు కూట‌మి వైపు మొగ్గు చూపుతాయా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావ‌రి జిల్లాలు, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కాపు, కాపు వ‌ర్గంలోని ఉప‌కులాల ఓటింగ్ అంతా కూట‌మి వైపు మొగ్గు చూపితే ఖ‌చ్చితంగా వైసీపీకి ఎఫెక్ట్ ప‌డుతుంద‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి.

అయితే జ‌న‌సేన ఓటింగ్ కూట‌మికి ప్ల‌స్ కాకుండా జ‌గ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ ఈక్వేష‌న్లు వేసుకుంటూ పొత్తును ముందే చిత్తు చేసే ప్లాన్‌లో ఉన్నారు. జ‌న‌సేన ఓటింగ్ బ‌లంగా ఉన్న చోట కాపుల‌కు పార్ల‌మెంటు సీట్లు ఇస్తున్నారు. కాకినాడ పార్ల‌మెంటు ప‌రిధిలో జ‌న‌సేన + టీడీపీ కూట‌మి చాలా బ‌లంగా ఉంది. అందుకే ఇక్క‌డ కాపు వ‌ర్గానికే చెందిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌కు జ‌గ‌న్ సీటు ఇచ్చారు. ఆయ‌న గ‌త మూడు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఆ సానుభూతి కూడా క‌లిసి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ లెక్క‌లేస్తున్నారు.

ఇక బంద‌రు పార్ల‌మెంటు ప‌రిధిలోనూ కాపులు ఎక్కువ‌. పొత్తు ఉంటే ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో వైసీపీకి ఇబ్బంది త‌ప్ప‌దంటున్నారు. పైగా ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాల‌శౌరి జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ నుంచే పార్ల‌మెంటుకు పోటీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే బంద‌రు నుంచి కాపు వ‌ర్గం నుంచే అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి ర‌మేష్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇక గుంటూరు పార్ల‌మెంటును కూడా జ‌గ‌న్ కాపు ఈక్వేష‌న్‌తో గెలుచుకునే ప్లాన్ చేస్తున్నారు.

పార్టీ కీల‌క నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు పెద్ద కుమారుడు ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను రంగంలోకి దించారు. గుంటూరు పార్ల‌మెంటు సీటును కూట‌మి ఎలాగూ క‌మ్మ‌ల‌కే ఇవ్వ‌నుంది. పైగా ఇది అమ‌రావ‌తి ప్రాంతం కావ‌డంతో వైసీపీకి చాలా ట‌ఫ్‌సీటు. అందుకే క‌మ్మేత‌ర ఓట్లతో పాటు కాపు ఓట్ల‌ను క‌లుపుకుని ఈ పార్ల‌మెంటు సీటును గెలుచుకునే ప్లాన్‌తో జ‌గ‌న్ ఇక్క‌డ ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు సీటు ఇచ్చారు. ఏదేమైనా జ‌నసేన ఓట్లు టీడీపీ వైపు మ‌ళ్ల‌కుండా జ‌గ‌న్ ఈక్వేష‌న్లు అయితే మామూలుగా లేవు.

Related posts

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!

ఆరా స‌ర్వేపై ఆరాలెందుకు… తెర‌వెనుక ఏం జ‌రిగింది..?

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju