NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ ద‌మ్ముంటే ఖ‌మ్మంలో రేవంత్‌రెడ్డి మీద గెలుస్తావా… ఇది క‌దా అస‌లైన స‌వాల్ అంటే..!

ఎస్ ఇప్పుడు ఇదే చ‌ర్చ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా వినిపిస్తోంది. కేటీఆర్ తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని.. అలాగే తాను సిరిసిల్ల‌లో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని… ఇద్ద‌రం మ‌ల్కాజ్‌గిరిలో పార్ల‌మెంటుకు పోటీ చేద్దామ‌ని ఎవ‌రు గెలుస్తారో తేల్చుకుందాం అంటూ స‌వాల్ విసిరారు. వాస్త‌వానికి ఇది కేటీఆర్ విసిరిన ప‌లాయ‌న వాద స‌వాల్ అన్న సెటైర్లు బాగా పేలుతున్నాయి.

ఒక్క‌సారి వెన‌క్కు వెళితే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఏకంగా 88 సీట్ల‌తో బంప‌ర్ మెజార్టీ సాధించి అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ ఆ వెంట‌నే నాలుగు నెల‌ల‌కే జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బొక్క బోర్లా ప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ప‌ట్టుబ‌ట్టి ఓడించిన ఎంతోమంది నేత‌లు త‌ర్వాత ఎంపీలుగా గెలిచారు. కొడంగ‌ల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్‌గిరిలో స్వ‌ల్ప మెజార్టీతో ఎంపీగా గెలిచారు. అలాగే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో పాటు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, బండి సంజ‌య్‌, సోయం బాపూరావు, కిష‌న్ రెడ్డి కూడా ఎంపీలు అయ్యారు. వీళ్ల‌లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మిన‌హా మిగిలిన వారంతా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ప‌నిక‌ట్టుకుని ఓడించిన నేత‌లే.

రేవంత్ ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని సెగ్మెంట్ల‌లో ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులే భారీ మెజార్టీల‌తో విజ‌యం సాధించారు. దీంతో కేటీఆర్ ఎక్క‌డా లేని ధైర్యాన్ని కూడ‌దీసుకుని తాను త‌ప్ప‌కుండా గెలుస్తాన‌నుకుని డిసైడ్ అయ్యి మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్ పోటీ చేయాల‌ని స‌వాల్ విస‌ర‌డం చూస్తుంటే చాలా కామెడీగా ఉంద‌ని అంటున్నారు. మెద‌క్ త‌ర్వాత బీఆర్ఎస్ ప‌క్కాగా గెలిచే సీటు మ‌ల్కాజ్‌గిరి అని కేటీఆర్ అనుకుంటున్నా రేప‌టి పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ అది అంత ఈజీ కాదు.

కేటీఆర్ విసిరిన కామెడీ స‌వాల్ చూసిన కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్‌కు ద‌మ్ముంటే రేవంత్ రెడ్డి మీద లేదా ఖ‌మ్మంలో తాము నిల‌బెట్టే కాంగ్రెస్ అభ్య‌ర్థి మీద కేటీఆర్ ఇక్క‌డ‌కు వ‌చ్చి పోటీ చేయాల‌ని స‌వాల్ విసురుతున్నారు. ఖ‌మ్మం పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ఆరు చోట్ల కాంగ్రెస్‌, కొత్త‌గూడెంలో కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షం సీపీఐ విజ‌యం సాధించాయి. ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి మొత్తంగా 2 ల‌క్ష‌ల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఎంపీ విజ‌యం సాధించే ఛాన్సులు ఉన్నాయి.

అందుకే రేవంత్ మాల్కాజ్‌గిరి కి రేవంత్ రావాల‌ని స‌వాల్ విసురుతుంటే ఇక్క‌డ కాంగ్రెస్ వాళ్లు కేటీఆర్‌కు ద‌మ్ముంటే ఖమ్మం వ‌చ్చి కాంగ్రెస్ నుంచి ఎవ‌రు పోటీ చేసినా వాళ్ల‌పై గెలిస్తే చాలు అని ప్ర‌తి స‌వాళ్లు విసురుతున్నారు. ఏదేమైనా మ‌ల్కాజ్‌గిరి పేరు చెప్పి అక్క‌డ‌కు రేవంత్ రావాల‌ని స‌వాల్ విస‌ర‌డం కేటీఆర్ లాంటి నేత రేంజ్‌కు త‌గిన స‌వాల్ కాద‌నే చెప్పాలి.

Related posts

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

IPS AB Venkateswararao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ సర్కార్ .. అయిదేళ్లుగా న్యాయపోరాటం

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju

ఆ మంత్రి గెలుపు ఆశ‌లు వ‌దులుకున్నారా… వైసీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

Prajwal Revanna: బెంగళూరులో ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన సిట్ పోలీసులు

sharma somaraju

ఏపీ ఉద్యోగులు రెచ్చిపోయారు.. జ‌గ‌న్‌కు ఎఫెక్టేనా..!

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

sharma somaraju

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju