NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 16 2024 Episode 2131: అమృతవాళ్లు శాంభవి దగ్గరికి వచ్చారన్న నిజం అంజలికి తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights

Kumkuma Puvvu March 16 2024 Episode 2131: అరుణ్ కుమార్ అమృత ఇద్దరూ దాచినపల్లి గ్రామంలో దిగుతారు. అమృత ఏమండీ ఈ ఊరిలో దిగగానే నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా నా పుట్టింటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది అని అంటుంది అరుణ్ కుమార్ ఎవరికైనా తండ్రి ఊరికి వస్తే అది పుట్టినిల్లు లాగే అనిపిస్తుంది కదా అమృత ఇది మీ నాన్నగారి పుట్టిన ఊరు అని నీకు అలా అనిపిస్తుంది అని అంటాడు అమృత అవునండి ఈ ఊరిలో మా నాన్న గారి ఇల్లు ఎక్కడుందో తరువాత ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అని అంటుంది. అరుణ్ కుమార్ అలాగే అమృత ముందు మనం ఎక్కడ ఉండాలో అది ఆలోచించాలి అని అంటాడు.అక్కడే బస్టాప్ దగ్గర ఒక నలుగురు ఐదుగురు పెద్దమనుషులు నిలబడి వీళ్ళవైపే చూస్తూ ఉంటారు.అమృత ఇదేంటండి వీళ్లు మన వైపే చూస్తున్నారు అని అంటుంది.అరుణ్ కుమార్ ఆగు అమృత వాళ్లు ఏం చేస్తారో చూద్దాం అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights
Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights

ఆ పెద్ద మనుషులు అమృత అరుణ్ కుమార్ దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఇక్కడికి చదువు చెప్పడానికి వచ్చిన టీచర్స్ మీరే కదా అని అడుగుతారు. అరుణ్ కుమార్ ఆ అవునండి మేమే ఆ టీచర్స్ అంటాడు. అమృత అవునా మేము మిమ్మల్ని చూడగానే అదే అనుకున్నాము మా శాంభవి అమ్మగారు ఈ ఊరికి చదువు చెప్పడానికి టీచర్స్ కావాలని పేపర్లో ప్రకటన వేయించారు అది చూసి మీరు వచ్చారా అని అడుగుతారు. అమృత అవునండి మేము ఆ పేపర్లో ప్రకటన చూసే వచ్చాము అని అంటుంది.ఆ ఊరి పెద్దపెద్దమనుషులు పదండి అమ్మ ఈ ఊరి దేవత ఇంటికి వెళదాం రండి అని అంటారు.అమృత ఈ ఊరి దేవత ఎవరండి అని అంటుంది.ఆ పెద్ద మనుషులు ఈ ఊరి దేవతే ఎవరో మీకు తెలియదా ఆవిడ శాంభవి దేవి గారు ఊరు కష్టమే తన కష్టం అనుకుంటుంది ఆవిడ ఇంటికి వెళదాం పదండి అంటూ అమృత అరుణ్ కుమార్ ని శాంభవి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు.

Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights
Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights

కట్ చేస్తే పెద్ద మనుషులు శాంభవి గారిని పిలిచి ఇదిగోండి అమ్మ మన ఊరికి వచ్చిన టీచర్స్ ని తీసుకువచ్చాము అని అంటారు. శాంభవి రండి మీరేనా ఈ ఊరికి చదువు చెప్పడానికి వచ్చిన టీచర్స్ అని అడుగుతుంది. అరుణ్ కుమార్ అమృత అవునండి మేమే మీరు వేసిన పేపర్ ప్రకటన చూసి ఈ ఊరికి విద్యను అందించడానికి వచ్చాము అని అంటారు. శాంభవి మీ ఆలోచన చాలా బాగుంది ఈ ఊరికి గవర్నమెంట్ తరఫునుంచి ఏదీ లేదు ఏమి కావాలనుకున్న ఈ అన్నీ మేమే సరఫరా చేస్తాము. ఈ ఊరిలో బడి చదువు చెప్పడానికి టీచర్స్ వారికి కావలసిన అవసరాలు డబ్బు అన్నీ మేము ఇస్తాము మీకు ఏమి కావాలనుకున్న మమ్మల్ని అడగండి మేము ఇస్తాము అని అంటుంది శాంభవి. మాధవి అత్తయ్య వీళ్ళు ఇంతకుముందు ఎక్కడ చదువు చెప్పారు అడిగి తెలుసుకోండి అంటుంది మాధవి.శాంభవి చెప్పండి మీరు ఇంతకుముందు ఎక్కడ చదువు చెప్పారు అనిఅడుగుతుంది అరుణ్ కుమార్ చెప్పామండి ఇంతకుముందు మేము సిటీలో చదువు చెప్పాము అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights
Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights

చరణ్ రాజ్ అలా అయితే మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అక్కడ సిటీలోనే ఉండకపోయారా ఈ పల్లెటూరికి రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అమృత కారణమంటే ఏముంటుందండి పట్టణంలో చదువును అమ్ముకోవడం తప్ప ఏమీ లేదు అందుకే మేము పల్లెటూర్లో మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు చదువును అందించాలని మా ఆశయం అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని అంటుంది. శాంభవి మాధవి మొన్న ఇద్దరు దంపతులుకు ఇల్లు ఇచ్చాము కదా అందులోనే పక్క పోర్షన్ లో వీళ్ళని ఉండుమని చెప్పు వాళ్లని తీసుకువెళ్లి ఆ ఇల్లు చూయించి రా అంటుంది శాంభవి.మాధవి అలాగే అత్తయ్యఅంటూ మీరు ఇక్కడే ఉండండి నేను తాళం తీసుకొని వస్తాను అంటూ మాధవి వెళ్లి తాళం తీసుకొని వస్తుంది వారిని తీసుకువెళ్లి కావేరి వాళ్ళు ఉన్న ఇంటి పక్కన పోర్షన్ చూపిస్తుంది మీరు ఇక్కడే ఉండండి మీ పక్కనే మొన్న ఒక గయ్యాళి గంగమ్మ దిగింది తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights
Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights

అమృత తను అంతగయ్యలా అండి అని అడుగుతుంది. మాధవి రండి మీకే పరిచయం చేస్తాను తెలుస్తుంది తను ఎంత గయ్యాలో అంటూ మాధవి అమృత వాళ్ళను తీసుకువెళ్లి కావేరి వాళ్లకి పరిచయం చేస్తుంది కావేరి అమృత వాళ్ళని చూడగానే షాక్ అవుతుంది. మాధవి ఏంటి అలాగే చూస్తూ నిలబడి పోయావు వీళ్లు మీ పక్క పోర్షన్ లో దిగారు పంతులమ్మ పంతులయ్య ఈ ఊరికి చదువు చెప్పడానికి వచ్చారు మీలాగా గయ్యాళి గంగమ్మలు కాదు వీళ్ళు చాలా డీసెంట్ మనుషులు జరా వీళ్ళతో కొంచెం మెత్తగా మాట్లాడు అని అంటుంది మాధవి. కావేరి ఓ చాలు చాల్లే అమ్మ నాకేమన్నా నోరు దురుద ఊరికే వెళ్లి ఈవిడతో పంచాయతీ పెట్టుకోవడానికి అంటుంది కావేరి. అమృత ఆ మరే పోయి మీతోనే పెట్టుకోవాలి పంచాయతి అంటుంది. మాధవి చూస్తుంటే ఈ పంతులమ్మ కూడా పెద్ద కంచు అనుకుంటా ఇంకేంటి కంచు కంచు రాసు కుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా ఇక రోజు ఇద్దరు సిగలు పట్టుకుని కొట్టుకుంటారేమో చూద్దాం నాకు సరదాగా ఉంటుంది కదా అంటూ సరే నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights
Kumkuma Puvvu Today Episode March 16 2024 Episode  2131 highlights

కట్ చేస్తే కావేరి చంద్రం అమృత అరుణ్ కుమార్ వాళ్ళు ఒక దగ్గర కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. కావేరిఎదుటివాడి కాలు ఇరిగిందని తన కాలు కూడా విరగ్గొట్టుకోమంటావా ఏంట్రా తమ్ముడు అందుకే మేము ఆ యుగంధర్ నుండి తప్పించుకోవడానికి వేరే దారి లేక వెనక ముందు ఆలోచించకుండా వచ్చేసాం రా తమ్ముడు అంటుంది. కావేరి అయిందేదో అయిపోయింది ఇప్పుడు అందరం మళ్లీ ఒక దగ్గరికి చేరుకున్నాం కదా అక్క నాకు సంతోషంగా ఉంది అంటాడు. అమృత వదిన మీరు ఆయన్ని ఒంటరిగా వదిలేసి వచ్చారని కోపంలో అలా మాట్లాడాను అవి ఏవి మనసులో పెట్టుకోకు అని అంటుంది. చంద్రం లేదు చెల్లెమ్మ మిమ్మల్ని అలా వదిలేసి రావడం తప్పు మాదే మమ్మల్ని మీరే క్షమించాలి అంటాడు. అమృత అవును ఇంతకు ఈ పనిమనిషి అవతారం ఏంటి అన్నయ్య అని అడుగుతుంది. కావేరి పని వాడి తల్లిదండ్రులు పనివాళ్ళు కాకపోతే ఇంకేమవుతారు నా బొంద అని అంటుంది. పని వాడి తల్లిదండ్రులు ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అక్క అంటాడు అరుణ్ కుమార్ చంద్రం అవును బామ్మర్ది మన బండి గాడు ఇక్కడ పనివాడిలాగా ఈ ఇంట్లో చేరాడు ఇక మేము కూడా ఈ అవతారాలు పని వాళ్ళ లాగా ఇంట్లోకి వచ్చాము అని అంటారు. అమృత అవునా మన బంటి ఇక్కడ ఉన్నాడా అని అంటుంది

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri