NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల, సునీత వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఇక‌, విప‌క్షాలు రెస్టు తీసుకోవ‌చ్చా.. !

ఏపీలో మ‌రో సంచ‌ల‌నానికి శుక్ర‌వారం ముహూర్తం ఫిక్స‌యింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అదినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతూ వ‌చ్చిన ఆయ‌న సోద‌రీమ‌ణులు వైఎస్ ష‌ర్మిల‌, న‌ర్రెడ్డి సునీత‌లు.. ఇప్పుడు నేరుగా క‌ద‌న‌రంగంలోకి దిగుతున్నారు. వైసీపీకి వ్య‌తిరేకంగా వారు ప్ర‌చారం చేయ‌నున్నారు. క‌డప నుంచే ఇద్ద‌రూ శుక్ర‌వారం ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు. సునీత యాత్ర అంతా క‌డ‌పలోనే సాగ‌నుంది. ఇక‌, ష‌ర్మిల మాత్రం.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. అన్న‌ను ఓడించ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగ‌నున్నారు.

అయితే.. ష‌ర్మిల ప‌ర్య‌ట‌న కూడా తొలి వారం రోజులు క‌డ‌ప‌లోనే సాగ‌నుంది. నిజానికి స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌ని అనుకుంటే.. క‌డ‌ప‌కు ఇన్ని రోజులు ఇచ్చేవారు కాదు. కానీ, అనూహ్యంగా ఆమె క‌డ‌ప‌లోనే 8 రోజులు కేటాయిస్తున్నా రంటే.. ఇక్క‌డ బ‌ల‌మైన వైసీపీ ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకున్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. క‌డ‌ప‌లోఎంపీ, రాజంపేట‌లో ఎంపీ అభ్య‌ర్థులుగా ఉన్న‌వారిని ఓడించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

నిజానికి అటు సునీత‌, ఇటు ష‌ర్మిల‌లు ఇప్ప‌టికే వైసీపీకి సెగ పుట్టిస్తున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. జ‌గ‌న్‌ను ఉతికి ఆరేస్తున్నారు. వివేకా హ‌త్య‌ను ప్ర‌ధాన వ‌స్తువుగా తీసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి ఎంత‌గా ఉన్నాయంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేన‌లు కూడా చేయ‌నంత‌గా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ నేరుగా వారిని ఏమీ అన‌లేక‌.. అలాగ‌ని ఉండ‌లేక స‌త‌మ‌తం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఇప్ప‌టికేక‌డ‌ప‌లో ప‌ర్య‌ట‌న‌లు పూర్తి చేసుకున్నారు.

మ‌ళ్లీ క‌డ‌ప‌కు వెళ్లే అవ‌కాశం లేదు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌, సునీత‌లు క‌డ‌ప‌లో ప్ర‌చారం ప్రారంభిస్తున్నా రు. అంటే.. వారు లైవ్‌లో ఉండ‌నున్నారు. పైగా ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు వ‌ర‌కు ష‌ర్మిల క‌డ‌ప‌లోనే ఉండి.. సునీత పూర్తిగా అక్క‌డే తిష్ఠ‌వేసి చేసే ప్ర‌చారం ఎన్నిక‌ల వేళ తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేకుండా పోతుంద నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విప‌క్ష నాయ‌కుల ల‌క్ష్యం వైసీపీనే, ఇప్పుడు జ‌గ‌న్ సొంత సోద‌రీమ‌ణుల ల‌క్ష్యం కూడా ఇదే. పొరుగువాళ్లు చెప్పేదానికంటే కూడా.. సొంత వారు చేసే విమ‌ర్శ‌ల‌కు బ‌లం ఎక్కువ‌. సో. ఇక‌, విప‌క్షాలు.. ఈ ఇద్ద‌రికీ అవ‌కాశం ఇచ్చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. మ‌రి ఈ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ ఎలా త‌ట్టుకుని నిలుస్తుందో చూడాలి.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N