NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో మ‌రో కె. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… బ‌క్కెట్ గుర్తు గాజుగ్లాసుకు బొక్క పెట్టేస్తుందా..?

ఈ ద‌ఫా గెలుపు గుర్రం ఎక్కాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చిక్కులు పెరుగుతున్నాయి. వ్య‌క్తిగ‌తంగా కొన్ని ఇబ్బందులు వ‌స్తే.. పార్టీ ప‌రంగా మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తున్నా యి. ప్ర‌స్తుతం వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న చిన్న పాటి స‌భ‌ల‌కే అలిసి పోతున్నారు. జ్వ‌రం వెంటాడుతోంది. దీని నుంచి కోలుకునేందుకు హైద‌రాబాద్ వెళ్తే.. వెంట‌నే వైసీపీ యాంటీ ప్ర‌చారం చేసింది. ఈ విష‌యం తెలుసుకుని హుటాహుటిన పిఠాపురం చేరుకున్నా.. ఆరోగ్యం మాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు.

ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. కీల‌క నేత‌లు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. వెళ్తున్నారు సైలెంట్‌గా ఉన్నారా? అంటే.. రాళ్లేస్తున్నారు. అది కూడా ప‌వ‌న్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌పైనే టార్గెట్ చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లో పోతిన మ‌హేష్‌, కైక‌లూరులో బీవీ రావు పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక‌, అవ‌నిగ‌డ్డ లో టికెట్ ఆశించి ద‌క్క‌ని విక్కుర్తి శ్రీనివాస్ కూడా.. వైసీపీలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈయ‌న కూడా జెండా ఎత్తేయ‌డం ఖాయం.

ఇలా పార్టీ ప‌రంగా ఇబ్బందులు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. స్వ‌తంత్ర పార్టీ న‌వ‌రంగ్ వైసీపీతో చేతులు క‌లిపింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో పిఠాపురంలో ప‌వ‌న్ పేరునుపోలి ఉన్న ఓ వ్య‌క్తిని రంగంలో క దింపుతోంది. ఈయ‌న పేరు కూడా.. కె. ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే.. ఇంటి పేరు మాత్రం.. క‌నుమూరి. ఈయ‌న ఇక్క‌డ పోటీ చేయ‌నున్నారు. అంతేకాదు.. ఈ స‌మ‌స్య‌తోనే తీరిపోలేదు.

ఈ పార్టీ గుర్తుగా `బ‌క్కెట్‌`ను ఎంచుకున్నారు. ఇది పూర్తిగా ఏ మాత్రం తేడా లేకుండా.. జ‌న‌సేన పార్టీ గుర్తు గ్లాసును పోలి ఉంది. దీనిని ఎన్నిక‌ల సంఘం నిషేధిత జాబితాలో చేర్చ‌క పోవ‌డంతో దీనిని న‌వ‌రంగ్ పార్టీ తీసుకుంది. సో.. ఇది పిఠాపురంలో జ‌న‌సేన ఓటు బ్యాంకు గండి కొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ గ్లాసుకు వేయాల‌ని అనుకున్న వారుకూడా.. బ‌క్కెట్‌కు వేసేలా ఎన్నిక‌ల గుర్తు ఉండ‌డంతో జ‌న‌సేన పార్టీలో నాయ‌కులు ఆద‌రాబాద‌రాగా కేంద్రం ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని చూస్తున్నారు. కానీ, ఇప్ప‌టికే విడుద‌ల చేసిన నిషేధిత జాబితాను మ‌రోసారి స‌వ‌రించాలంటే.. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌ప్పుడే. దీంతో ఈ ఎఫెక్ట్ జ‌న‌సేన‌పై ప‌డుతుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju